
ఇంఫాల్: మణిపూర్‌లోని ఓ బ్యాంకులో గురువారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని సాయుధ దుండగులు సుమారు రూ.18.80 కోట్లను దోచుకెళ్లారు. ఉఖ్రుల్ పట్టణంలోని వ్యూలాండ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంకు అధికారులు ఉఖ్రుల్ జిల్లాలోని అన్ని ఏటీఎంలకు అవసరమైన నగదును వ్యూలాండ్ బ్రాంచిలో నిల్వ ఉంచుతుంటారు.
గురువారం సాయంత్రం 5.40 గంటల సమయంలో అత్యాధునిక ఆయుధాలతో ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకు సిబ్బంది ప్రవేశించే గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదిరించి వాష్‌రూంలో బంధించారు. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టి, క్యాష్ వాల్ట్‌ను తెరిపించారు. మొత్తం రూ.18.80 కోట్లను ఎత్తుకెళ్లి పోయారు.
Comments
Please login to add a commentAdd a comment