
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.
పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.
వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్‌జిత్‌కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు.
వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది.
जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK
— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025
VIDEO Credits: VeerArjunDainik
Comments
Please login to add a commentAdd a comment