marriage celebrations
-
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా అతియాశెట్టిని వివాహమాడారు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నూతన వధూవరులు అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో సునీల్ శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా మిఠాయిలు పంచుతూ కనిపించారు. ఈ జంట తొలిసారి భార్యాభర్తలుగా చాలా అందంగా కనిపించింది. అతియా తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.' పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ, క్రిెకెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఆలియా భట్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి ఫడ్నేకర్, నవ్యనందా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
పెళ్లి వేడుకలో కరోనా కలకలం..
సాక్షి, నిజామాబాద్: వర్ని మండలం సిద్ధాపూర్లో పెళ్లి వేడుకల్లో కరోనా కలకలం సృష్టించింది. గత గురువారం పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. సిద్దాపూర్లో మూడు రోజులుగా పరీక్షల శిబిరం కొనసాగుతోంది. ఇప్పటివరకు 370 మందికి టెస్టులు చేయగా, 86 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 865 మంది కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం.. క్వారన్టైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. చదవండి: నిజామాబాద్: షాపింగ్‌మాల్‌లో 75 మందికి కరోనా! ఎన్నికల సిత్రాలు: నిన్న ఏడుపులు.. నేడు చిందులు -
పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్
-
ఘనంగా మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం
-
మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం
-
మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగింది. ఆగస్టు 5, బుధవారం రాత్రి 11గంటల 49 నిమిషాలకు జరిగిన ఈ వివాహా కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వనించారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు వరుడు శ్రీకాంత్, వధువు వైష్ణవికి బంధువులు, అతిథులు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వివాహ వేడుక ఘనంగా జరిగింది. -
కళ్యాణానికి కరోనా సెగ
-
వివాహ వేడుకలో విషాదం
సాక్షి, విజయనగర్‌కాలనీ : వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్ జగదాంబనగర్‌లో నివసించే పులిపాటి నర్సింగ్‌రావు కుమారుడు కిశోర్ వివాహం ఈ నెల 15న సికింద్రాబాద్‌లో జరిగింది. వివాహ అనంతరం ఆదివారం నిర్వహించిన విందులో పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. నర్సింగ్‌రావుకు కాటేదాన్‌లో కార్పెంటర్ కార్ఖానా ఉన్నది. అతని వద్ద టాటాఏసీ ఆటోడ్రైవర్‌గా పనిచేసే వి.శ్రావణ్‌కుమార్(25)తో పాటు ఫర్నీచర్ పాలిష్ పనిచేసే చింటు కూడా వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదై ఉన్న జోషివాడి ప్రాంతానికి చెందిన భిక్షపతి విందుకు హాజరయ్యాడు. ఆ సమయంలో చింటు, భిక్షపతి మధ్య స్వల్ప విషయమై వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇరువురి కొట్టుకున్నారు. దీంతో భిక్షపతి తన తమ్ముడు గణే‹Ù(32)కు ఫోన్ చేసి తనపై దాడిచేస్తున్నారని వెంటనే రావాల్సిందిగా కోరాడు. హాకీ స్టిక్, జాంబియాతో దాడి.. భిక్షపతి ద్వారా సమాచారం అందుకున్న తమ్ముడు గణేష్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడు. అన్న పిలుపుమేరకు హాకీ స్టిక్, జాంబియా (కత్తి)తో రాగా అక్కడి నుంచి చింటు పరారయ్యాడు. కోపంతో రగిలిపోతున్న గణే‹Ùకు అదే బస్తీలో ఉంటున్న సాయిగణేష్ (24), ఆటోడ్రైవర్ శ్రావణ్‌కుమార్ పెళ్లి మండపంలో కనిపించడంతో మీరే చింటును తప్పించారంటూ అన్నదమ్ములిద్దరు కలిసి వారిపై దాడి చేశారు. దాడిలో సాయిగణేష్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా శ్రవణ్‌కుమార్‌ను హాకీ స్టిక్‌తో తలపై తీవ్రంగా కొట్టడంతో అది విరిగిపోయింది. అనంతరం జాంబియాతో ముఖం, ఛాతి, గొంతు తదితర శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడవడంతో శ్రవణ్‌కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న శ్రవణ్‌కుమార్ కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో వైద్య చికిత్స నిమిత్తం నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఉస్మానియా వైద్యులు అతన్ని పరీక్షించిన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అలుముకున్న విషాద ఛాయలు... శ్రవణ్‌కుమార్ కత్తిపోట్లతోపోయాడనే విషయం తెలుసుకున్న బంధుమిత్రులు పెద్ద ఎత్తున అతని ఇంటి వద్దకు చేరుకున్నారు. అందరితో చనువుగా ఉండే శ్రవణ్‌కుమార్ మృతిచెందడంతో ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలాన్ని అడిషనల్ డీసీపీ పూజిత, ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ శివమారుతి ఏసీపీ వేణుగోపాల్, ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగం రవీందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు ఆకుల శ్రీనివాస్, రాజేష్లష్తో పాటు క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం శ్రవణ్‌కుమార్ మృతిదేహానికి ఆసిఫ్‌నగర్ దేవునికుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
అలిసన్ స్టెప్పేస్తే.. సానియా ఫిదా
హైదరాబాద్: అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి అలిసన్ రిస్కే డ్యాన్స్‌కు భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫిదా అయ్యారు. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అలిసన్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. భారత మాజీ డేవిస్ కప్ ఆటగాడు, కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజు కొడుకు స్టీఫెన్ అమృత్‌రాజ్‌ను ఆమె వివాహం చేసుకోనుంది. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ‘ ఇప్పటినుంచి నాకు భారత అభిమానులుకు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక నుంచి నేను అమృత్‌రాజ్ కుటుంబ సభ్యురాలిని. మీ అభిమానాన్ని గెలుచుకునేందుకు చిన్న ప్రయత్నం చేశాను’అంటూ పోస్ట్ చేసింది. ఇక అలిసన్ చేసిన ట్వీట్‌కు సానియా రీట్వీట్ చేస్లూ..‘వావ్.. వాటే డ్యాన్స్. ఒక్కటి కాబోతున్న ఇద్దరికి కంగ్రాట్స్’అంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం అలిసన్ చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. అంతేకాకుండా స్టీఫెన్, అలిసన్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక 37వ సీడ్ అలిసన్ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేదు. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో స్టార్ ప్లేయర్ సెరేనా విలియమ్సన్ చేతిలో అలిసన్ ఘోరంగా ఓడిపోయింది. -
లిప్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి
-
ఫంక్షన్ హాల్లో దారుణం : లిఫ్ట్‌లో కాలు ఇరికి..
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో జరిగిన ఓ వివాహవేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలో జాగీర్ రాధా నగర్‌లోని కేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో లిఫ్ట్‌లో కాలు ఇరికి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
మొన్న బెల్లి డ్యాన్స్.. నిన్న తల్వార్ డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణగుట్ట రౌడీ రాజ్యంగా మారుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు పెళ్లి వేడుకల్లో తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో బెల్లి డ్యాన్స్ పేరిట అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే మరో వివాహా వేడుకలో కొందరు తల్వార్ డాన్స్ పేరిట సామాన్య జనాలను బెదిరిపోయేలా చేశారు. చాంద్రాయణగుట్టలోని బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ వెలుపల మెయిన్ రోడ్‌పై మూడు గంటలపాటు తల్వార్ డ్యాన్స్‌లు చేశారు. ఇది చూసిన సామాన్య ప్రజలు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇది జరిగి 48 గంటలు గడిచిన ఇప్పటివరకు దీనికి కారణమైన వారిపై పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ ప్రాంతంలో ఇలాంటి కార్యకలపాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : చాంద్రాయణగుట్టలో బెల్లి డ్యాన్స్ -
లాలూ కుమారుడి పెళ్లి.. అపశృతి
పట్నా : లాలూ కొడుకు తేజ్ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌తో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కిషన్‌గంజ్ ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు అలమ్, మాజీ మంత్రి ఇస్లాముద్దీన్ బాగీ కుమారుడు ఇక్రాముల్ హక్, దిగల్‌బంక్ ఆర్జేడీ నేత పప్పు పాల్గొన్నారు. వేడుక అనంతరం పట్నా నుంచి కిషన్‌గంజ్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పొతీయా సమీపంలో ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో వీరితో పాటు కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. ఐడీ కార్డుల సహాయంతో వీరిని ఆర్జేడీ నేతలుగా గుర్తించారు. కాగా ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
పెళ్లి వేడుకలో మాజీ సీఎం స్టెప్పులు
పాట్నా: బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్‌ల వివాహం శనివారం కన్నులపండువగా జరిగింది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు... రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌లతో పాటు... ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తదితరులు హాజరయ్యారు. వేదికపై ఆశీనులైన నీతీశ్ నవ దంపతులను ఆశీర్వదించారు. దాణా కుంభకోణంలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ.. తన కుమారుడి వివాహం నిమిత్తం మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత లాలూ ఇంటా పెళ్లి భాజాలు మోగడంతో అంతా ఆనందంతో ఆడి పాడారు. వివాహ వేడుకల్లో భాగంగా ఓ భోజ్ పురి పాటకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు కుమార్తె మీసా భారతి, కొడుకు తేజస్వీ యాదవ్ లు, నవ దంపతులు స్టెప్పులేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ లగావెలు జాబ్ లిప్‌స్టిక్’ అనే భోజ్‌పురి పాటతో పాటు పలు హిందీ పాటలకు రబ్రీదేవి నృత్యం చేశారు. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా సాంగ్స్ కంపోజ్ చేయించగా, వాటికి కూడా అందరూ డ్యాన్స్ చేశారు. -
లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు
-
గానా బజానా.. ఘనంగా తేజ్ పెళ్లి వేడుక
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి చాలా కాలానికి పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నేడు ఆయన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను నేడు(శనివారం) తేజ్ ప్రతాప్ మనువాడబోతున్నారు. దాణా కుంభకోణ కేసుల్లో ఇన్ని రోజులు జైలులో ఉన్న లాలూ, కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికి విడుదలయ్యారు. నిశ్చితార్థపు వేడుకలను మిస్ అయిన లాలూకు, ఆ లోటు లేకుండా పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలను ఆ ఫ్యామిలీ ఘనంగా చేస్తోంది. తేజ్‌కు పసుపు రాసే వేడుక నుంచి అన్ని వేడుకలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. తేజ్‌కు జరిగే అన్ని వేడుకలను తల్లి రబ్రీదేవీ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. లాలూ సైతం ఈ వేడుకలను ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తున్నారు. ఎంతో కాలానికి లాలూ ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరుగుతుండటంతో, ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వరకే చాలామంది అతిథులు లాలూ ఇంటికి వచ్చేశారు. లాలూ ఇంటికి, పెళ్లి కూతురు ఐశ్వర్య రాయ్ బంగ్లాకు కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో, ఆ మార్గమంతా పూలతో, గ్రీన్ చిల్లీస్, లెమన్లతో సర్వాంగ సుందరంగా అలకరించారు. అన్న పెళ్లి వేడుకల్లో భాగంగా తేజస్వి స్టెపులతో అదరగొట్టారు. పలు బాలీవుడ్ సాంగ్‌లకు డ్యాన్స్‌లు వేస్తూ దుమ్మురేపారు. యాదవ్‌ల మాన్షన్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. కాగ, పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో వీరి వివాహం జరుగబోతోంది. లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు -
పెళ్ళిసందడి
-
పెళ్లి వేడుకలో విషాదం: 26 మంది మృతి
-
పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి
భరత్పూర్: రాజస్ధాన్‌లోని భరత్‌పూర్‌లో గురువారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన పందిట్లో మృత్యువు విలయతాడవం సృష్టించింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులు భారీ వర్షం కురవడంతో దగ్గరలోని ఓ గోడ పక్కనే నిల్చున్నారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది నలిగి ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్ర గాయాలయపాలయ్యారు. ఘటనపై మాట్లాడిన పోలీసులు మృతుల్లో 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలిన గోడ దాదాపు 90 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. గోడకు అనుకుని ఏర్పాటు చేసిన కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
చంద్రగిరిలో వైఎస్ జగన్ పర్యటన
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి బుధవారం చంద్రగిరిలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరి చేరుకున్నారు. స్థానిక వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. కాగా చాలా రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేణిగుంటలో అభిమానులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు ఆయన కోసం వేచి ఉన్నారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. -
నేడు చంద్రగిరికి వైఎస్ జగన్
బంధువుల వివాహ వేడుకకు హాజరు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు తిరుపతి: ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి బుధవారం చంద్రగిరికి రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరి చేరుకుంటారు. అక్కడి వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. భారీ స్వాగత ఏర్పాట్లు చాలా రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. మధ్యమధ్యలో పార్టీ అధినాయకునికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, అధిక సంఖ్యలో కటౌట్లను ఏర్పాటు చేశారు. -
మంచు వారి పెళ్లిసందడి
-
వివాహ వేడుకలో విషాదం
* సిలిండర్ పేలి వ్యాపించిన మంటలు * ఆరుగురి సజీవ దహనం సాక్షి, న్యూఢిల్లీ: వివాహ సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ముచ్చ ట్లు చెప్పుకుంటూ, కనపడిన బంధువులందరినీ పలకరించుకుంటూ హాయి గా నవ్వుకుంటున్నారు. అయితే అంతలోనే ఈ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అసలేమి జరిగిందంటే... పెళ్లివారి ఇంటిలో గ్యాస్ సిలిం డర్ పేలడంతో ఆరుగురు మరణించారు. జసోలా గ్రామంలోని మసీదువాలీ గల్లీలో సి -13 ఇంటి సభ్యులంతా శుక్రవారం ఉదయం పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. అంతలోనే ఉదయం 11 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా బారాత్ కోసం బయటకు వెళ్లారు. మంటలు పొరుగున ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయని, వీధులన్నీ ఇరుగ్గా ఉండడంతో మంటలను ఆర్పడానికి అవస్థపడాల్సి వచ్చిందనిఅగ్నిమాపక విభాగం తెలిపింది. కాగా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి పరిసరాలను దిగ్బంధించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
కవ్వింత: గుట్టు విప్పాడు...
బిచ్చగాడు: అయ్య, కాస్త అన్నం పెట్టండి బాబూ.. ఇంట్లోంచి: ఒరేయ్ నీకెవర్రా చెప్పింది ఈ ఇంట్లో వంట నేనే చేస్తానని అలవాటు పోదు కదా.. ఓ పెళ్లి సందడిలో ఓ భర్త తన భార్యపై ప్రతి ఐదు నిమిషాలకు ఓ సారి నీళ్లు చిలకరిస్తున్నాడు. ఇంతలో పక్కనున్న మరో మహిళ ఏంటి మీ ఆయన అలా చిలకరిస్తున్నాడని అడిగింది. ‘మా ఆయనది పూల వ్యాపారం’లే అని ఆమె చల్లగా చెప్పింది. సన్నాసెవరో తేలింది టీచర్: వందకు ఐదు మార్కులు తెచ్చుకున్నావు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీ నాన్న ఏమన్నాడు బంటి: నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా అని నన్ను తిట్టాడు సార్ తెలివి తెల్లారింది ఓ ఎస్కలేటరు ఎక్కడానికి సంశయిస్తూ ఓ పెద్దాయన ఆలోచిస్తున్నాడు. ఎందుకండీ... ఆలోచిస్తున్నారని పక్కాయన అడిగాడు. ‘ఎస్కలేటరు ఎక్కేముందు కుక్కపిల్లలను చేతిలోకి తీసుకోండి అని ఇక్కడ బోర్డు పెట్టారండీ... ఇపుడు దాన్నెక్కడ తేవాలి?’’ రహస్యం... రంజిత్: నా జీవితంలో ఒకే ఒక స్త్రీని గాఢంగా ప్రేమించాను. సుజిత్: మీ ఆవిడ లక్కీ అయితే... రంజిత్: పొరపాటున ఆమెకు చెప్పేవురోయ్... ఆ అమ్మాయి వేరు.