లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు | Lalu Prasad Family Celebrates Tej Pratap Yadav Pre Wedding Ceremonies | Sakshi
Sakshi News home page

లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు

Published Sat, May 12 2018 3:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంటి చాలా కాలానికి పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నేడు ఆయన పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆర్‌జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్‌ కూతురు ఐశ్వర్య రాయ్‌ను నేడు(శనివారం) తేజ్‌ ప్రతాప్‌ మనువాడబోతున్నారు. దాణా కుంభకోణ కేసుల్లో ఇన్ని రోజులు జైలులో ఉన్న లాలూ, కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికి విడుదలయ్యారు. నిశ్చితార్థపు వేడుకలను మిస్‌ అయిన లాలూకు, ఆ లోటు లేకుండా పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలను ఆ ఫ్యామిలీ ఘనంగా చేస్తోంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement