పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి | Wall fell on relatives: 26 killed in marriage celebrations | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి

Published Thu, May 11 2017 7:09 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి

పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి

భరత్‌పూర్‌: రాజస్ధాన్‌లోని భరత్‌పూర్‌లో గురువారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన పందిట్లో మృత్యువు విలయతాడవం సృష్టించింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులు భారీ వర్షం కురవడంతో దగ్గరలోని ఓ గోడ పక్కనే నిల్చున్నారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది నలిగి ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్ర గాయాలయపాలయ్యారు.

ఘటనపై మాట్లాడిన పోలీసులు మృతుల్లో 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలిన గోడ దాదాపు 90 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. గోడకు అనుకుని ఏర్పాటు చేసిన కొన్ని ఫుడ్‌ స్టాల్స్‌ కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement