కవ్వింత: గుట్టు విప్పాడు... | He breaks secret not to control big laugh | Sakshi
Sakshi News home page

కవ్వింత: గుట్టు విప్పాడు...

Published Sun, Jun 29 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

కవ్వింత: గుట్టు విప్పాడు...

కవ్వింత: గుట్టు విప్పాడు...

బిచ్చగాడు: అయ్య, కాస్త అన్నం పెట్టండి బాబూ..
ఇంట్లోంచి: ఒరేయ్ నీకెవర్రా చెప్పింది ఈ ఇంట్లో వంట నేనే చేస్తానని
 
అలవాటు పోదు కదా..
 ఓ పెళ్లి సందడిలో ఓ భర్త తన భార్యపై ప్రతి ఐదు నిమిషాలకు ఓ సారి నీళ్లు చిలకరిస్తున్నాడు. ఇంతలో పక్కనున్న మరో మహిళ ఏంటి మీ ఆయన అలా చిలకరిస్తున్నాడని అడిగింది.  ‘మా ఆయనది పూల వ్యాపారం’లే అని ఆమె చల్లగా చెప్పింది.
 
సన్నాసెవరో తేలింది
టీచర్: వందకు ఐదు మార్కులు తెచ్చుకున్నావు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీ నాన్న ఏమన్నాడు
 బంటి: నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా అని నన్ను తిట్టాడు సార్
 
 తెలివి తెల్లారింది
 ఓ ఎస్కలేటరు ఎక్కడానికి సంశయిస్తూ ఓ పెద్దాయన ఆలోచిస్తున్నాడు.
 ఎందుకండీ... ఆలోచిస్తున్నారని పక్కాయన అడిగాడు.
 ‘ఎస్కలేటరు ఎక్కేముందు కుక్కపిల్లలను చేతిలోకి తీసుకోండి అని ఇక్కడ బోర్డు పెట్టారండీ... ఇపుడు దాన్నెక్కడ తేవాలి?’’
 
 రహస్యం...
 రంజిత్: నా జీవితంలో ఒకే ఒక స్త్రీని గాఢంగా ప్రేమించాను.
 సుజిత్: మీ ఆవిడ లక్కీ అయితే...
 రంజిత్: పొరపాటున ఆమెకు చెప్పేవురోయ్... ఆ అమ్మాయి వేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement