Progress Report
-
చంద్రబాబు సర్కార్ 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్
-
అదే జరిగితే భట్టి విక్రమార్కకి మైనస్‌గా అవుతుందా?
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో మల్లు భట్టి విక్రమార్క పేరు తెలియనివారుండరు. ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుంచి మూడు సార్లుగా ఆయన విజయం సాధిస్తున్నారు. నాలుగోసారి కూడా విజయం నాదే అంటున్నారాయన. సీఎల్పీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మంచి మార్కులు తెచ్చుకున్నారా?. మధిరలో ఆయన పని తీరు ఎలా ఉంది?. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు?. ఆయన ప్రత్యర్థులు ఎవరు?. భట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? మధిరలో ఢీ అంటే ఢీ అటు కాంగ్రెస్, ఇటు సీపీఎంలకు కంచుకోటగా పేరు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రాజకీయాల మీద పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎస్సీ రిజర్వుడు నుంచి జనరల్ సీటుగా మారిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ వరుసగా కాంగ్రెస్ తరపున భట్టి విక్రమార్క విజయం సాధించారు. కమలారాజ్ రెండు సార్లు సీపీఎం అభ్యర్థిగా, ఒకసారి గులాబీ పార్టీ అభ్యర్థిగా మధిర నుంచి పోటీ చేసి.. భట్టి విక్రమార్క చేతిలో మూడుసార్లు ఓటమి చెందారు. నాలుగోసారి పోటీ చేసి సత్తా చాటేందుకు భట్టి విక్రమార్క రెడీ అవుతుండగా.. ఆయన మీదే మూడు సార్లు ఓడిపోయిన కమల్‌రాజ్‌కు నాలుగోసారి కూడా బీఆర్ఎస్ అవకాశం ఇస్తుందా లేదా చూడాలి. 2 లక్షల 9 వేల 945 మంది ఓటర్లున్న మధిరలో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకు 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు సీపీఎం విజయం సాధించాయి. కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ 1985 నుంచి మధిరలో సీపీఎం పాగా వేయగా.. రిజర్వుడు సీటుగా మారిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురేస్తోంది. 2014లో రెండోసారి మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి చెందిన కమల్ రాజ్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడుగా ముద్రవేసుకున్న కమల్ రాజు ఆయనతో కలిసి అప్పటి ఆఖ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా మూడవసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన మల్లు భట్టివిక్రమార్క ఆఖ అభ్యర్థిగా బరిలో దిగిన కమల్ రాజుపై గెలుపొందారు. వరుసగా మూడుసార్లు లింగాల కమల్ రాజ్ పై భట్టి విక్కమార్క విజయం సాధించారు. పరిస్తితులు తలక్రిందులు కావడంతో స్థానిక ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున మధిర జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపోందారు లింగాల కమల్ రాజ్. తర్వాత ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పొంగులేటితో విభేదాలు రావడంతో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఇక నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ హోదాలో కమల్ రాజ్ విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ పెద్దగా పట్టు సాధించలేకపోతున్నారనే టాక్ ఉంది. వరుసగా మూడసార్లు ఓటమి పాలుకావడంతో అసలు నాల్గవసారి టికెట్ వస్తుందా.. ఒకవేళ వస్తే భట్టి విక్రమార్కపై గెలిచేంత గ్రౌండ్ కనకరాజ్‌కు ఉందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. భట్టి గట్టి పట్టు 2009 నుంచి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన భట్టి విక్రమార్క ముదిగొండ నుంచి జమలాపురం వరకు బీటీ రోడ్లు వేశారు. జాలిముడి ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చి పూర్తి చేశారు. మధిర మండలం మడుపల్లిలో లెదర్ పార్క్ కి ఇచ్చిన హామీ, మీనవోలు లో పరిశ్రమ ఏర్పాటుకు, బోనకల్లులో ఇందిర క్రాంతి మహిళా డైరీ కేంద్రం ఏర్పాటు, సాగర్ కాలువను థర్డ్ జోన్ నుంచి సెకండ్ జోన్ కి తీసుకొచ్చే హామీలు పెండింగ్ లో ఉండి పోయాయి. వాటిని కూడ పూర్తయ్యేలా చూడాలని మధిర వాసులు ఎమ్మెల్యే విక్రమార్కను కోరుతున్నారు. చింతకాని మండలం కోమట్ల గూడెంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును ఉద్యమంగా మలిచి రాష్ట్రస్థాయిలో మంచి మైలేజ్ తెచ్చుకున్నారు భట్టి విక్కమార్క. ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టును చింతకాని మండలంలో అమలుచేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని పలు సమావేశాల్లో భట్టి విక్కమార్క చెప్పుకొచ్చారు. దళితబంధు పథకం భట్టికి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. సీఎల్పీ నేతగా రాష్ట్రస్థాయిలో బిజీగా ఉండటం వల్ల నియోజకవర్గ మీద పెద్దగా దృష్టి పెట్టడంలేదనే లేదని విమర్శ సైతం భట్టి విక్రమార్క మీద ప్రభావం చూపే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారు సీటు ఎవరికి? ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఆఖ పార్టీ తరుపున ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఉద్యమకారుడైన బొమ్మెర రాంమూర్తి, కోట రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కమల్‌రాజ్ మూడు సార్లు ఓడిపోయిన అనుభవం ఉన్నందున ఈ సారి ఆయనకు అది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేయడం ఖాయం. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్, ఆఖ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉంది. చదవండి: మంత్రి పువ్వాడకు ప్లస్ ఏంటీ? మైనస్ ఏంటీ? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు భట్టికి మరోసారి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పొంగులేటి గులాబీ గూటి నుంచి కమలం గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక పార్టీ మారితే ఆ పార్టీ సైతం గట్టి అభ్యర్థిని పోటీలో పెట్టే అవకాశం ఉంటుంది. పొంగులేటి బీజేపీలోనే చేరితే గనుక మధిరలో త్రిముఖ పోటీ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నందున మల్లు ప్రత్యర్థుల ఓట్లన్నీ చీలిపోతే... నాలుగోసారి ఆయన విజయం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు ఖాయమంటున్నారు గనుక.. అదే జరిగితే భట్టికి కొంత మైనస్‌గా మారే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సీపీఎంకు బలమైన నియోజకవర్గం గనుక ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉందంటున్నారు. అందువల్ల బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తు కుదిరితే మల్లు కష్టపడాల్సి వస్తుంది. కాని ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఇంకా ఎన్ని రకాలుగా మారతాయో ఇప్పుడే చెప్పడం కష్టమే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వాడ వాడ పువ్వాడ! కానీ, రంగంలోకి పొంగులేటి వస్తే.. పరిస్థితి ఏంటి?
ఖమ్మం జిల్లా కేంద్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. జిల్లాలోని కీలక నేతలు ఖమ్మం సీటు మీదే గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యర్ధి ఎవరైనా బలంగా ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వాడ. కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. మంత్రి వువ్వాడ అజయ్ గురించి ఖమ్మం ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ హాట్ సీట్ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్‌గా మారబోతోంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాలనే ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వాడ వాడ పువ్వాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో జనంకి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మతోన్మాద పార్టీలకు ఖమ్మంలో చోటు లేదనే స్లోగన్ తో ముందుకు సాగుతున్నారు. బీజేపీ నుంచి ఒకవేళ గట్టి అభ్యర్థి బరిలో ఉన్నా గెలుపోందే విధంగా పక్కా కార్యాచరణ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ..2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2004లో సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం గెలుపొందారు. గత నాలుగు ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మంలో బలంగా ఉన్న కమ్మ, మైనార్టీ, కాపు వర్గాల్లో రెండు సామాజికవర్గాలు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీకే విజయం దక్కుతుంది. కన్నేసిన పొంగులేటి ఇదిలా అంటే బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. పొంగులేటి బీఅర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారు అయినప్పటికీ... ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఏ పార్టీలో చేరతారన్న విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరుల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే పొంగులేటి అనుచరుల్లో మెజారిటీ మాత్రం ఖమ్మం నుంచే పోటీ చేయాలని గట్టిగా సూచిస్తున్నారు. జనవరి ఒకటో తారీఖున నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా ఖమ్మం నుంచే పోటీ చేయాలని కోరారు. అందువల్ల ఖమ్మంకే తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. చేతి పార్టీలో ఎవరు? మరో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం నియోజవర్గంపై సీరియస్ గా గురిపెట్టింది. అయితే అజయ్ లాంటి బలమైన నేతను ఢీకొట్టడానికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. అందుకే మాజీ ఎంపీ రేణుకచౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఖమ్మంలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని కూడా రేణుక చౌదరి ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం.. లోకల్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం బలంగా ఉండటంతో రేణుక చౌదరి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో లోకల్ గా గ్రూపుల గొడవలు ఉండటంతో వ్యతిరేక వర్గం రేణుకకు ఏ మేర సపోర్ట్ చేస్తుందన్న అనుమానాలూ ఉన్నాయి. కారుతో కమ్యూనిస్టుల జోడి ఇక బీజేపీకి కూడా ఖమ్మం నియోజకవర్గంలో బలమైన నేతలు ఎవరూ లేరు. ఇతర పార్టీల నుంచి నేతలు చేరితే తప్ప ఖమ్మంలో కాషాయపార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిజెపి బలం పెరిగే అవకాశం ఉంది. పొంగులేటి పోటీ చేస్తే అజయ్ కు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీఅర్ఎస్తో పొత్తు దాదాపు ఖరారైంది. ఇది గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ , 8 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నూతన బస్టాండ్, ఐటీ హబ్, గొల్లపాడు చానల్ ఆధునీకరణ, నూతన కార్పొరేషన్ భవనం, సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలు వంటివి అజయ్ కుమార్‌కు కలిసి వచ్చే అంశాలే. ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంను ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్లకు విస్తరింపచేశారు. రఘునాధపాలెం మండలం సాగు నీటి సమస్య తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టు చేపట్టారు. కాని ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుండటంతో.. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే వర్షాకాలం వరద ముంపు సమస్య పరిష్కారం అవుతుందని..అందువల్ల ఆ విషయాన్ని ఆలోచించాలని నగరవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చదవండి: పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా? కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారన్న టాక్ సైతం లోకల్ గా వినిపిస్తోంది. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదనే వార్నింగ్‌లు ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు సైతం మంత్రికి ఇబ్బందులు తెస్తున్నాయి. కీలక నేతల చూపు ఖమ్మం అసెంబ్లీ సీటు వైపు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం హట్ సీట్ గా మారనుంది. ఏ పార్టీ అయినా ఖమ్మం అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని రంగంలో దించితే దాని ఎఫెక్ట్ పాలేరు, వైరా స్థానాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాలకుర్తి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఓటమి ఎరుగని నేత, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎర్రబెల్లిని ఓడించగల నేత పాలకుర్తిలో లేరనే ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన్ను ఓడించే వారి కోసం అటు కాంగ్రెస్, ఇటు కమలం పార్టీ భూతద్దాలు పెట్టుకుని వెతుకుతున్నాయి. మరి ఎర్రబెల్లి విజయానికి ఎవరైనా బ్రేకులు వేయగలుగుతారా? పోరాటాల పురిటిగడ్డ పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి నియోజకవర్గం వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రబెల్లికి కంచుకోటగా మారింది పాలకుర్తి. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి రెండు సార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ తరపున గెలిచారు. విపక్ష అభ్యర్థుల బలహీనతల్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి విజయం సాధిస్తారు. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపిగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణాలో సీఎం కేసిఆర్ తర్వాత వరుస విజయాలు నమోదు చేసుకున్న వ్యక్తిగా ఎర్రబెల్లి ఉన్నారు. ఓటమి ఎరుగని నేతకు రాబోయే ఎన్నికల్లో చుక్కలు చూపేందుకు కాంగ్రెస్, బిజేపి కసరత్తు చేస్తున్నాయి. ఎర్రబెల్లిని ఎదుర్కునే బలమైన నేత కోసం వెతికే పనిలో ఆ రెండు పార్టీలు నిమగ్నమయ్యాయి. స్థానిక నాయకులను కాదని ఎన్ఆర్ఐలపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపారు. అయితే ఎర్రబెల్లిపై పోటీకి ఎన్ఆర్ఐలు ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. స్థానిక నేతలు మాత్రం చాలా మంది పోటీకి సై అంటున్నారు. ఎర్రబెల్లి వర్సెస్ కొండా ఎర్రబెల్లి దయాకరరావు మీద కాంగ్రెస్ నుంచి కొండా మురళీ పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. మురళి.. ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఏనాటి నుండో రాజకీయంగా వైరం కొనసాగుతోంది. ఎర్రబెల్లిని ఓడించాలన్న పట్టుదలతో కొండా మురళి వున్నారు. అయితే మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రఘురాంరెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు. స్థానిక నాయకులు ముత్తినేని సోమేశ్వర్ రావు సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎవ్వరనేది క్లారిటీ లేకపోయినప్పటికి ఎవరికి వారే పాలకుర్తి టిక్కెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు, యతి రాజారావు కుటుంబాల నుండి ఎవరో ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బిజేపిలో చేరితే ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డిని కూడా చేర్చుకుని బరిలో నిలిపేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రఘురాంరెడ్డి పాలకుర్తిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. మంత్రిగారికి మార్కెలెన్ని? పాలకుర్తి నియోజకవర్గం.. అభివృద్ది విషయంలో ఉమ్మడి జిల్లాలోనే ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎన్నికల ముందు మంత్రి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రాన్ని, సోమేశ్వరాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి కారిడార్‌ను 62కోట్లతో అభివృద్ది చేస్తున్నారు. 150 కోట్లతో పాలకుర్తి చుట్టూ డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్దికి పెద్దపీట వేసి పాలకుర్తి రూపురేఖలే మార్చేశారు. నియోజకవర్గ కేంద్రంలో అనుకున్నదాని కంటే ఎక్కువగానే అభివృద్ది జరిగినప్పటికి.. ఇతర ప్రాంతాల్లో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండగా.. మరికొన్ని మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. పాలకుర్తిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామన్న హామీ అలానే మిగిలిపోయింది. కనీసం పోస్ట్ మార్టమ్ గది లేక జనగామకు వెళ్ళాల్సి వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పోస్ట్ మార్టమ్ గది ఏర్పాటుకు 2009లో ఇచ్చిన హామీ...హామీగానే మిగిలిపోయిందంటున్నారు స్థానికులు. నీళ్ల చుట్టూ రాజకీయాలు పాలకుర్తి ఏరియా మొత్తం మెట్టప్రాతం కావడంతో చాలా ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నూరు రిజర్వాయర్‌ను పాలకుర్తి రిజర్వాయర్ గా మార్చి నియోజకవర్గం రైతులకు సాగునీరు అందిస్తానని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరక అసంతృప్తిలో పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అయితే మంత్రి ఇటీవలనే మూడు జిల్లాల అధికారులతో సమావేశమై పనులపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలోపు రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాలకు సంబంధించి బాలికల జూనియర్ కళాశాల తెప్పిస్తానని.. అదేవిధంగా డిగ్రీ కళాశాల తెస్తానని 2009 నుండి ప్రజలకు హామీ ఇస్తున్నారు. అది కూడా పాలకుర్తి ప్రజలకు కలగానే మిగిలిపోయింది. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళ కోసం లబ్డిదారులు ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నా, ఫలితం కనిపించడంలేదు. ఎన్నికల్లో అభివృద్ధి పాత్ర ఎంత? నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటి తొర్రూర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు..పట్టణాన్ని 66కోట్లతో సర్వాంగసుందరంగా అభివృద్ది చేశారు. ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తూ ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రత్యర్థులు ఎవ్వరైనా సరే.. ప్రజలు తన వెంటే ఉంటారనే నమ్మకంతో ఉన్నారాయన. చదవండి: దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు? నాడు వర్థన్నపేట అయినా.. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం అయినా.. ఏదైనా సొంత ఊరిలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రజలు నుంచి దయాకర్ రావుకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపద్యంలో ఇంకాస్త కష్టపడక తప్పదనే భావన కలుగుతోంది. రాబోయే ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు బలమైనవారైతే...ప్రజల మూడ్ మారితే ఎర్రబెల్లి దయాకరరావుకు చుక్కలు కనిపిస్తాయనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?
2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది. అప్పటి వరకు కారు స్పీడ్‌కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ఉప ఎన్నికతో మారిన రాజకీయ చిత్రం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉన్న రాష్ట్ర రాజకీయాలు కారు వర్సెస్ కమలంగా రూపాంతరం చెందాయి. 2020లో చివర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ గెలుచుకుంది. ఈ గెలుపుతో కారు పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకునే అవకాశం లభించింది. అంతకుముందు రెండు సార్లు ఓటమి చెందిన రఘునందనరావు స్వల్ప మెజారిటీతోనే అయినా సంచలన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు చెరకు ముత్యం రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాల చేతిలోనే దుబ్బాక నియోజకవర్గం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ప్రత్యేక రాష్ట్ర పార్టీగా ఉనికిలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పాగా వేసింది. చెరకు ముత్యం రెడ్డి ప్లేస్‌లో 2004లో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009లో మళ్ళీ చెరకు ముత్యం రెడ్డి గెలిచినా..ఆ తర్వాత రెండుసార్లు గులాబీ పార్టీ తరపున సోలిపేట గెలిచారు. 2020లో సోలిపేట అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఉపఎన్నిక జరిగి దుబ్బాక రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చింది. జైత్రయాత్రలకు బ్రేక్ చెరకు, సోలిపేట కుటుంబాల జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. కాంగ్రెస్, కారు పార్టీలను పక్కకు నెట్టి ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో..మూడు ప్రధాన పార్టీల నేతలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు... రామలింగారెడ్డి సతీమణి పై స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. అందువల్ల చే జారిపోయిన సీటును తిరిగి గులాబీ పార్టీ ఖాతాలో వేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుండి బరిలో దింపాలని గులాబీ పార్టీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభాకరరెడ్డి కూడా దుబ్బాక సొంత నియోజకవర్గం కావడంతో..ఎంపీగా కంటే..ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. జనంతోనే జనం వెంటే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు నియోజకవర్గంలోనే క్యాంప్ వేసి పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మమేకమవుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాదులో ఉంటున్నప్పటికీ ఉదయం లేవగానే దుబ్బాకలో కనిపిస్తున్నారు. వారానికి 5 రోజులపాటు ఆయన నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రజల మధ్యే ఉంటున్నారు. మొత్తానికి ముగ్గురు నేతలు నియోజకవర్గంలోనే తిరుగుతూ..తమ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి.. ఎమ్మెల్యే రఘునందన్ రావుకి తరుచు డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రోటోకాల్ గొడవ ఎవరికి న్యాయం చేస్తుందో చూడాలి. తండ్రి సీటుపై తనయుడి ఆశ దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సీటుపై ఆశ పడుతున్నట్టు సమాచారం. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బై ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు అమలుకాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సరైన ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పడం.. రైతులకు రెండు ఎడ్లు, నాగలి ఇస్తానంటూ చెప్పిన హామీలేవీ నెరవేరలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయారు. మరి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రచారాయుధంతో ప్రజల ముందుకు వస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి మరో నేత డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆఖ లో మాత్రం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే దుబ్బాక టికెట్ ఓకే అయినట్లు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే వారంలో ఐదు రోజులపాటు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పుకొంటున్నారు. గులాబీ పార్టీలో మరో నేత బీసీ సామాజిక వర్గంకు చెందిన చిందెం రాజకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? ఉప ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెగ్గిన మాటల మాంత్రికుడు కమలం పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగుతున్న తమ జైత్ర యాత్రకు బ్రేక్ వేసిన రఘునందన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి మళ్ళీ సత్తా చాటాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్రిముఖ పోటీలో దుబ్బాకలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఎవరా హంతకులు?
చీమకుర్తి: మండల కేంద్రాన్ని ఉలికిపాటుకు గురిచేసిన దంపతుల దారుణ హత్యకు కేసులో పురోభివృద్ధి కనిపిండంలేదు. సెప్టెంబర్ 19న చీమకుర్తి పట్టణంలోని కోటకట్లవారి బజారులో దింటకుర్తి వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులను రాత్రి 9 గంటల సమయంలో అతి దారుణంగా గొంతులు కోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు ఒక డీఎస్పీ, ఒక సీసీఎస్ డీఎస్పీతో కలిసి మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టినట్లు తెలిసింది. హత్యకు గురైన దంపతుల కుమారులు, బంధువులు మాత్రం హత్యకు గురైన వారికి ఎలాంటి వివాదాలు లేవని చెప్తున్నారు. అయితే ఈ హత్యల వెనుక అదే సామాజిక వర్గానికే చెందిన ఇద్దరు ముగ్గురు బడా గ్రానైట్ నేతల పాత్ర ఉన్నట్లు సంఘటన జరిగిన వారం రోజుల పాటు చీమకుర్తిలో విస్తృతంగా చర్చ సాగింది. దీంతో ఆర్యవైశ్య సంఘాల నాయకులు నిరసన ర్యాలీలు చేసి హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేసిన వారు కూడా గత మూడు వారాల నుంచి నోరు మెదపకపోవడం గమనార్హం. గ్రానైట్ వ్యాపార కేంద్రంగా ఉన్న చీమకుర్తివాసుల్లో మనోధైర్యాన్ని కల్పించేందుకు మాత్రం 12 మంది అదనపు పోలీస్ ఫోర్స్‌ను చీమకుర్తికి కేటాయించారు. అంతే తప్ప విచారణలో హంతకులు ఎవరన్న క్లూ దొరక లేదని అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలెందుకు? చీమకుర్తి పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు ప్రధాన కూడళ్లు, బైపాస్‌లో 30కి పైగా సీసీ కెమెరాలను అమర్చినప్పటికీ ఇలా దొంగతనాలు, హత్యలు చేసిన వారిని కనుగొనడటంలో అవి ఏ మాత్రం ఉపయోగపడటంలేదు. అసలు హత్యకు పాల్పడిన వారు దొంగతనం కోసమే వచ్చారా? లేక వ్యాపార, భూసంబంధ, ఇతర వివాదాల నేపథ్యంలో హత్య జరిగిందా..? అనే కోణాలు ఇంకా వెలుగులోకి రాకపోవడం గమనార్హం. జనం రద్దీగా ఉండే బజారులో దారుణంగా భార్యాభర్తలను హత్యచేస్తే పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి కానరాకపోవడం, హంతకులు ఎవరనేది ఇంకా తేల్చకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి చీకటి పడగానే ఇంటి ముందు వీధి లైటు వెలగకపోయినా, ఇంట్లో ఒంటరిగా ఉన్నా భయపడుతున్నారు. హత్య జరిగి దాదాపు నెల రోజులు కావస్తోంది. పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేస్తున్నామంటున్నారు. హంతకులను పట్టుకోవడం ఆలస్యం కావచ్చేమో కానీ కచ్చితంగా బోనులో పెడతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు బృందాలతో విచారణ: హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే మూడు బృందాలతో విచారణ చేస్తున్నారు. హంతకులను త్వరలో పట్టుకుంటామనే నమ్మకం ఉంది. దుర్గాప్రసాద్, ఒంగోలు రూరల్ సీఐ పబ్లిక్‌లో వచ్చే రూమర్లకు ఆధారాలు లేవు: హత్యకు గురైన వారి గురించి పబ్లిక్‌లో వచ్చే రూమర్లకు సరైన ఆధారాలు లేవు. హత్యలపై ప్రతిరోజూ వివిధ కోణాల్లో విచారిస్తున్నాం. నూటికి నూరు శాతం హంతకులను త్వరలో పట్టుకుంటాం. రాఘవేంద్ర, సీసీఎస్ సీఐ, ఒంగోలు -
లక్షకుపైగా వాహనాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 2న నిర్వహించే ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సభకు 25 లక్షల మందికిపైగా జనాన్ని తరలించాలని టీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు వాహనాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి 10 వేలకు పైగా వాహనాలు సభకు వస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ నుంచి 7 వేలకు పైగా వాహనాలు అడిగారని అధికారులు చెబుతున్నారు. వీటి బుకింగ్‌లు పూర్తి కావొచ్చాయి. ఆర్టీసీకి రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. టోల్గేట్ల వద్ద అదనపు సిబ్బంది.. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులన్నింటిపై కలిపి దాదాపు 17 టోల్గేట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయని బుధవారం ‘టోల్’ ఫికర్ పేరిట ప్రచురితమైన కథనం నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు అదనపు సిబ్బందిని నియమించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. జాతీయ రహ దారులపై ఉన్న టోల్గేట్ల వద్ద ఈ వాహనాలు టోల్ చెల్లించే విషయంలో స్పష్టత రాలేదు. డీజిల్‌కు పెరిగిన డిమాండ్.. సభకు అన్ని జిల్లాల నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో పెట్రోల్ బంకుల యజమానులు అప్రమత్తమయ్యారు. శనివా రం సాయంత్రం, ఆదివారం వాహనాలు బారులు తీరనున్న నేపథ్యంలో ఇంధనాన్ని అదనంగా తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. 25 లక్షల మందిని తరలించేందుకు లక్ష వాహనాలు అవసరం. ఈ వాహనాలకు లక్ష మంది డ్రైవర్లు అవసరం. మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వారి అనుచరులు మరో 2 వేల వాహనాల్లో రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సభకు వచ్చే వారిలో లక్షకు పైగా డ్రైవర్లు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగనివ్వం... ప్రగతి నివేదన సభకు భారీగా టీఎస్ ఆర్టీసీ బస్సులు తరలించనున్న నేపథ్యంలో సామా న్యులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వమని చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మాట్లాడుతూ బస్సులకు అద్దె చెల్లించే విషయంలో ఎవరికీ మినహాయింపులు ఇవ్వడం లేదన్నారు. -
ప్రగతి నివేదన సభకు సై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీ జెండాల రెపరెపలు.. స్వాగత తోరణాలు.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే భారీ కటౌట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ‘ప్రగతి నివేదన సభ’కు కొంగరకలాన్ సుందరంగా ముస్తాబైంది. టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభ నిర్వహణలో చిన్న లోటుపాటు కూడా లేకుండా మంత్రులు దగ్గరుండి మరీ ఏర్పా ట్లను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సభా వేదిక వద్దే శుక్రవారం రాత్రి బస చేశారు. ఉదయం నుంచి అక్కడే మకాం వేసి సభావేదిక, పార్కింగ్ ప్రదేశాలు, కార్యకర్తలు కూర్చునే ప్రాంగణం, ఇతర వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రత్యేక వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ సభకు 25 లక్షల మంది తరలివస్తారని టీఆర్ఎస్ అధినాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల దాహార్తి తీర్చేందుకు సభాస్థలికి సమీపంలో ప్రత్యేక వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నీటి వాల్వూ దగ్గర ఒకేసారి నాలుగు ట్యాంకర్లు, 5 నిమిషా లకో ట్యాంకర్ నిండేలా ఫిల్లింగ్ స్టేషన్‌ను జల మండలి అందుబాటులోకి తెచ్చింది. శనివారం రాత్రి నుంచే ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ట్రాక్టర్లలో సభా ప్రాంతానికి చేరుకునేవారికి ఈ రాత్రి నుంచే జలాలను పంపిణీ చేయనుంది. 400 మంది వలంటీర్లు వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేందుకు వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఎంపిక చేసిన 15 పార్కింగ్ స్థలాల్లో వాహనదారులకు సూచనలు, సలహాలిచ్చేందుకు 400 మందిని టీఆర్ఎస్ రంగంలోకి దించింది. ట్రాకర్లపై నేడు సభా ప్రాంతానికి చేరుకునేవారికి ఈ వలంటీర్లు అన్నివిధాలా సాయపడేలా సూచనలు జారీచేసింది. విపత్కర పరిస్థితుల్లో స్పందించేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగనుంది. విపత్తులు సంభవిస్తే క్షణాల్లో చేరుకునేందుకు సభా వేదిక, ప్రాంగణం చుట్టూ, పార్కింగ్ స్థలాల్లో 30 ఫైర్ఇంజన్లను అందుబాటులో ఉంచింది. వైద్య సేవలకు రెడీ.. ఈ సభకు వచ్చే ప్రజలు అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు 200 మంది వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచింది. ఎంపీలు చామకూర మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌లకు సంబంధించిన ఆస్పత్రుల సిబ్బంది ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. నలువైపులా ఎల్ఈడీ తెరలు సభా ప్రాంగణంలో ఉన్నవారే కాకుండా చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా సభా కార్యక్రమాలను వీక్షించేందుకు నలువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, ప్రధాన రహదారులు, పార్కింగ్ స్థలాల్లో వీటిని నెలకొల్పారు. 250 ఎల్ఈడీ తెరల ద్వారా సభను ఎక్కడ నుంచైనా తిలకించొచ్చు. 20 వేల మంది పోలీసులు సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ముఖ్యనేతలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భావించిన పోలీస్ శాఖ భారీగా బలగాలను మోహరించింది. 20 వేల మంది పోలీసులకు గాను శుక్రవారం 15 వేల మంది ప్రగతి నివేదన సభ బందోబస్తు విధుల్లో చేరారు. తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి బస్సుల్లో తరలివచ్చిన బృందాలు సభాస్థలిని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దీనికితోడు నిరంతరం పోలీసు జాగిలాలు గస్తీ కాస్తున్నాయి. 36 డాగ్ స్క్వాడ్ బృందాలు సభా ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నాయి. ట్రాక్టర్లలో వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు ప్రగతి నివేదన సభకు ఊరికో ట్రాక్టర్లో తరలిరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రికే 10 వేల ట్రాక్టర్లలో లక్ష మంది వస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారికి విజయవాడ హైవేకు దగ్గరగా, కొంగర నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో, వండర్లా సమీపంలో.. ఫ్యాబ్‌సిటీ లోపల మొత్తం 9 ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. వారు వండుకునేందుకు వంట చెరుకు, ట్యాంకర్లతో నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. ఈ పార్కింగ్ స్థలాల్లో పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తొలిసారి బౌన్సర్ల సేవలు భద్రతకు పోలీసులపైనే ఆధారపడకుండా ప్రైవేటు సెక్యూరిటీని కూడా రంగంలోకి దించుతోంది. 300 మంది బౌన్సర్లను సభాస్థలిలో అందుబాటులో ఉంచుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రజలను అదుపు చేసేందుకు వీరి సేవలను వినియోగించుకోవాలని అధికార పార్టీ నిర్ణయించింది. బహిరంగ సభకు వచ్చేవారి కోసం సభాస్థలికి కొద్ది దూరంలో వేదికకు రెండువైపులా సంచార మూత్రశాలలు ఏర్పాటు చేశారు. 300 శౌచాలయాల్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి వసతి ఏర్పాటు చేశారు. మూత్ర శాలల చుట్టూ ప్రహరీ నిర్మించారు. వేదిక ముందు 16 గ్యాలరీలు బహిరంగ సభలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. సభకు వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 16 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. ఒకదాంట్లో నుంచి ఇంకో గ్యాలరీలోకి వెళ్లకుండా బారికేడ్లు వేసింది. తూర్పున 3, పడమరన 3, ఉత్తరాన 4, దక్షిణాన 4, మీడియా, వీఐపీలకు ఒక్కొక్కటి చొప్పున గ్యాలరీలు ఏర్పాటు చేశారు. -
బండెనక బండి.. రావాలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల విజయ ప్రస్థానాలను పంచుకునేందుకు ఆదివారం కొంగర కలాన్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కాగా, సభలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం నుంచే పలు జిల్లాల నుంచి బండెనక.. బండి పెట్టి ట్రాక్టర్లు కదిలాయి. శనివారం ఉదయం నుంచే వాహనాలు సభాస్థలి పరిసరాలకు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు జిల్లాల వారీగా వచ్చే వాహనాలు, పార్కింగ్, తిరిగి వెళ్లే రూట్లను నిర్ధారించి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ సహా జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారానే వస్తుండటంతో మొత్తం 14 మార్గాలను ఎంపిక చేశారు. ఔటర్ రింగు రోడ్డు ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, పార్కింగ్, తిరుగు ప్రయాణం తదితర వివరాలతో కూడిన రూట్‌మ్యాప్‌ను అన్ని జిల్లాలు, పార్టీ నాయకులకు పంపారు. జిల్లాలు, పార్కింగ్ నుంచి సుమారు 19 ప్రాంతాల నుంచి కళా ప్రదర్శనలు, అభివృద్ధి నమూనాలను చూపుతూ భారీ జులూస్‌లతో సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు తావులేకుండా లైన్‌ను పాటిస్తూ నిర్ణీత వేగంతో వాహనాలన్నీ ప్రయాణించేలా పోలీస్ యంత్రాంగం తగు ఇండికేషన్లతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఆదివారం ఔటర్‌పై ప్రయాణం వద్దు.. సెప్టెంబర్ 2న ఒక్కరోజు సాధారణ ప్రయాణికులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణాన్ని మానుకోవాలని లేదా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేసింది. ప్రగతి నివేదన సభతో ఔటర్‌పై భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఔటర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులు సైతం ఇతర రూట్లను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రగతి నివేదన సభ కోసం ఆర్టీసీ తమ సర్వీసులను నడపాలని నిర్ణయించిన దరిమిలా.. ఆదివారం సిటీలో బస్సుల కొరత ఉంటుందని, ఆ ఒక్క రోజు ప్రయాణాలను మానుకోవాలని ఆర్టీసీ సైతం విజ్ఞప్తి చేసింది. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - కె.పి వివేకానంద్
-
ప్రోగ్రెస్ రిపోర్ట్ - పతివాడ నారాయణ స్వామి
-
సర్వే సెగ
► ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై తర్జనభర్జన ► టీఆర్ఎస్ శ్రేణుల అంతర్మథనం ► లోపాలను దిద్దుకునే దిశగా చర్యలు ► ప్రజాభిప్రాయంపై మరోసారి ఆరా ఎమ్మెల్యేలపై నిర్వహించిన సర్వేపై జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు తమ నియోజకవర్గంలో పరిస్థితి.. ఎమ్మెల్యే పనివిధానంపై బేరీజు వేసుకుంటున్నారు. పనివిధానం తగ్గిన ప్రాంతాల్లో దానినుంచి బయట పడేందుకు కొందరు ఇప్పటికే దిద్దుబాట పట్టారు. అయితే, ఎమ్మెల్యేల పనితీరుకు.. పార్టీకి ఆదరణపై సర్వే రిపోర్టులో తేడాలుండడం అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్యేల ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ గులాబీశ్రేణుల్లో గుబులు రేపింది. అంచనాలకందని రీతిలో వెల్లడైన సర్వే ఫలితాలను జీర్ణించుకుంటూనే వాటిని పునఃసమీక్షించుకునే పనిలో పడ్డాయి. పనితీరు, పాలనను మదింపు చేస్తూ సర్వే నిర్వహించినట్లు అధినేత కేసీఆర్ చెబుతున్నా.. ఫలితాలు ప్రజాదరణకు అద్దంపట్టేలా లేవని పార్టీవర్గాలు అంతర్గతంగా విశ్లేషించుకుంటున్నాయి. కొందరు శాసనసభ్యులు మాత్రం సర్వే రిపోర్టు ఆధారంగా లోపాలను దిద్దుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో ముఖాముఖి చర్చలు జరపడం ద్వారా ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు. పార్టీ పరంగా గ్రాఫ్ బాగానే ఉన్నా.. వ్యక్తిగతంగా పలుకుబడి తగ్గుతుందని సర్వేలో తేలడం ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తుండడం.. విపక్ష పార్టీలకు నైతికబలం చేకూరేలా సర్వే ఫలితాలు వెల్లడికావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే ఫలితాలనే వెల్లడించిన సీఎం.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై కూడా మరో నివేదిక రూపొందించారు. టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలకు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో పసిగట్టారు. ఈ రహస్య నివేదికను బహిర్గతం చేయకున్నా.. అంతర్గతంగా మాత్రం సర్వే వివరాలను క్లుప్తంగా తెలిపారు. పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... చాలా నియోజకవర్గాల్లో పార్టీకి పాసు మార్కులు పడ్డా.. ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం పడిపోవడం గులాబీ బాసును కలవరపరుస్తోంది. జిల్లామంత్రి మహేందర్‌రెడ్డి సొంత ఇలాకాలో పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్లు తేలింది. మహేందర్‌కు ప్రజాదరణ తగ్గిపోవడమేగాక.. ఆ ప్రభావం పార్టీపై కూడా చూపుతుండడం గులాబీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అనూహ్యంగా బలం పుంజకున్నట్లు సర్వేలో తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై మెజార్టీ ప్రజలు పెదవి విరిచినా.. పార్టీపై విశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదరలేదని స్పష్టమైంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్) వ్యక్తిగత ఇమేజ్ బాగానే ఉన్నా.. పార్టీపరంగా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గినట్లు సర్వేలో వెల్లడికాగా.. పార్టీ ఇమేజ్ 52శాతం రావడం, మహేశ్వరంలో టీఆర్ఎస్కు 60 శాతం, కాంగ్రెస్‌కు 20 శాతం అనుకూలంగా ప్రజాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. అయితే, ఇలా పార్టీ, ఎమ్మెల్యేల పనితీరు పట్ల అంచనాలకందని రీతిలో సర్వే ఫలితాలు వెల్లడి కావడంతో దీని వాస్తవికతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సైతం ఈ సర్వే శాస్త్రీయతపై తలపట్టుకుంటున్నాయి. నివేదికల్లో వెల్లడైన మార్కులకు ఒకదానికి ఒకటి పోలిక లేకపోవడం.. పార్టీ విజయానికి ఢోకాలేదు కానీ... ఎమ్మెల్యేలు బాగా పనిచేయడం లేదనే సంకేతాలు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు శాసనసభ్యులు అంతరంగికులతో సర్వేపై మేథోమథనం చేశారు. సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ... దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు. ఒకరిద్దరు మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తమపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ప్చ్... నచ్చలే!
పనితీరుపై సీఎం పెదవి విరుపు ♦ ఎమ్మెల్యేలకు ప్రజాదరణ అంతంతమాత్రమే ♦ తగ్గుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి హవా ♦ ప్రచారం జోరు.. క్షేత్రస్థాయిలో బేజారు ♦ ఆరు నెలల కాలంలో పరిస్థితి తారుమారు ♦ టీఆర్ఎస్ శాసనసభాపక్షంతో సీఎం భేటీ ♦ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టాప్.. లాస్ట్ మంత్రి ♦ పుంజుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఆర్ ♦ సర్వేపై పార్టీ శ్రేణుల్లో సర్వత్రా చర్చ ఆరునెలల్లో ఓడలు బండ్లయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి.. కొన్ని నియోజకవర్గాల్లో విపక్షం పుంజుకుంది.. పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆదరణ తగ్గింది. ఆరు నెలల్లోనే సిట్టింగ్‌ల పరిస్థితి తారుమారయ్యింది. కొత్త జిల్లాల్లో హవా కొనసాగిస్తోన్న మంత్రిదీ ఇదే దుస్థితి. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై స్వయంగా సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఇది తేలింది. ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన ఈ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’లో పలు విషయాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్దల ప్రచారం టాప్ గేర్‌లో దూసుకెళుతున్నా.. క్షేత్రస్థాయిలో కారు జోరుకు మాత్రం బ్రేకులు పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. కొన్నిచోట్ల మాత్రం పనితీరుతో సక్సెస్ రేటును సాధించినట్లు తేలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ప్రగతి రథచక్రం’ తిరోగమిస్తోంది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి గ్రాఫ్ పడిపోతోంది. తాండూరులో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గత సర్వేలో మహేందర్‌రెడ్డి పనితీరు బాగాలేదని తేలింది. గత ఆరు నెలలతో పోలిస్తే ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ సగానికి తగ్గిపోయింది. గతేడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 68.50 శాతం మంది ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఈ ఏడాది జనవరిలో జరిపిన రెండో విడత సర్వేలో ఇది 38.30 శాతానికి పడిపోయింది. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తూ జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసిస్తున్న మహేందర్‌రెడ్డికి సొంత ఇలాకాలో ప్రజాదరణ తగ్గుతుందని సర్వేలో తేలడం.. అది కూడా అధికార పార్టీ శాసనసభ్యుల్లోనే చివరి స్థానం కావడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తారనే గుర్తింపు ఉన్నా.. ప్రజలతో మమేకం కాకపోవడం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించరనే కారణాలే ఈ పరిస్థితికి దారితీశాయని పార్టీ వర్గాలు అనుకొంటున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సర్వేను నిజం చేసేలా ఇటీవల పురపాలక సంఘం ఎన్నికల్లోనూ మంత్రికి చేదు ఫలితాలే మిగిలాయి. ఈ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీని ప్రతిపక్ష కాంగ్రెస్ నాటకీయంగా కైవసం చేసుకుంది. ఈ పరిణామాలు, తాజా సర్వే ఫలితాలు మంత్రి అనుచరగణానికి మింగుడు పడటంలేదు. ఎగబాకిన రామ్మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (పరిగి) మాత్రం ఊహించని రీతిలో బలం పుంజుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఆర్‌కు మంచి మార్కులు రావడం.. అది కూడా గత సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో పరిస్థితి మెరుగుపరుచుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. నిత్యం ప్రజలతో కలిసిపోవడం.. ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా పోషిస్తుండడం రామ్మోహన్ కు ప్లస్ పాయింట్ అయిందని సర్వేలో తేలింది. టీడీపీ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ర్యాగ కృష్ణయ్య (ఎల్బీనగర్) పనితీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొంది. ఆరు నెలల క్రితం 54 శాతంప్రజాదరణ ఉండగా.. అది ప్రస్తుతం 24.40 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ (ఉప్పల్) ప్రతిష్ట సైతం మసకబారింది. ఆయన పనితీరుపై 39.70 శాతం ప్రజలు మాత్రమే అనుకూలంగా స్పందించారు. గాంధీ టాప్.. అధికార పార్టీ ఎమ్మెల్యేల పరపతి రోజురోజుకు దిగజారుతోంది. ఇదే విషయం సర్వేలో స్పష్టమైంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాత్రం ఊహించనిరీతిలో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నారు. తొలి సర్వేలో 33.30 శాతం ఉన్న ఆయన గ్రాఫ్ జనవరి సర్వేలో 70.50 శాతానికి ఎగబాకడం సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆయన పనితీరు సూచిక దారుణంగా పడిపోయింది. మొదటి సర్వేలో 60.40 శాతం ఉన్న ఆయన.. చివరి సర్వేలో 39.10 శాతానికి పడిపోయారు. మిగతా ఎమ్మెల్యేదీ దాదాపుగా ఇదే పరిస్థితి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సంజీవరావు, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, యాదయ్య, వివేకానందలకు నియోజకవర్గాల్లో పాసు మార్కులు పడినా.. వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వే గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాత్రం గతంతో పోలిస్తే కొంత మేర పుంజుకొన్నట్టు తేలింది. ఇలాగైతే కష్టమే..! ఎమ్మెల్యేలకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తుండడం ముఖ్యమంత్రిని కలవరపరుస్తోంది. ఒక్కో శాసనసభ్యుడి పనితీరును సర్వే ద్వారా మదింపుచేసిన సీఎం.. బలాలు, బలహీనతలపై కూడా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు తాజా సర్వే ఇబ్బందిగా మారింది. నియోజకవర్గాల్లో తమకు ఎదురులేదని భావించిన తమను సీఎం సర్వే ఆత్మరక్షణలో పడేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సర్వే వాస్తవీకతపై టీఆర్ఎస్ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలో తేలిన అంకెలకు స్థానికంగా ఉన్న పరిస్థితికి భారీ తేడా ఉందని అంటున్నాయి. -
పోలీస్ రిపోర్ట్!
గత ఏడాది పనితీరుపై ప్రజలకు నివేదిక ఠాణాల వారీగా సమావేశాల నిర్వహణ ప్రజల ఆకాంక్షలూ తెలుసుకునేలా చర్యలు ఆదేశించిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి సిటీబ్యూరో: నగర పోలీసులకూ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ ఉండనుంది... దీన్ని అధికారులు తమ పరిధిలో నివసించే ప్రజలకు ‘అందించనున్నారు’... ఏడాదికి ఒకసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వార్షిక పనితీరు నివేదికను వారి ముందు ఉంచడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తున్నారు. ప్రజల నుంచి వారి ఆకాంక్షలు, అవసరాలను తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా సమావేశాల నిర్వహణ, ప్రగతిని ప్రతి రోజూ స్వయంగా పర్యవేక్షించాలనీ నిర్ణయించారు. ఏళ్ళుగా మూసధోరణిలోనే... ప్రతి ఏడాదీ డిసెంబర్ ఆఖరి వారంలో పోలీసు విభాగం వార్షిక నివేదికలు విడుదల చేస్తుంటుంది. రాష్ట్ర స్థాయిలో డీజీపీ, కమిషనరేట్లలో పోలీసు కమిషనర్లు యాన్యువల్ రౌండప్స్గా పిలిచే వార్షిక విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుంటారు. వీటిలో గత ఏడాది పోలీసులు తీసుకున్న చర్యల్ని వివరిస్తూ ఆ కారణంగా నేరాల సంఖ్యలో నమోదైన హెచ్చుతగ్గుల్ని వివరిస్తారు. రాష్ట్ర, కమిషనరేట్ స్థాయిలో ప్రాథమిక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల్నీ ప్రకటిస్తుంటారు. ఏళ్ళుగా ఇదే మూసుధోరణిలో సాగుతున్న విధానానికి నగర పోలీసు కమిషనర్ స్వస్థి చెప్పారు. ఓపక్క నగర స్థాయిలో కమిషనర్ వార్షిక నివేదికలు, కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించినప్పటికీ... మరోపక్క స్థానికుల మనోభావాలను అనుగుణంగా పని చేయడానికి ఈ విధానాన్ని వికేంద్రీకరించారు. ఠాణాల వారీగా ప్రత్యేక మీటింగ్స్... ఇందులో భాగంగా ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) తన ఠాణాకు సంబంధించి కమ్యూనిటీ సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఆ ప్రాంతానికి సంబంధించిన కీలక వ్యక్తులకూ ప్రాధాన్యం ఇస్తారు. ఆ సమావేశంలో గత ఏడాది పోలీసు పనితీరును ప్రజలకు నివేదిస్తారు. ఈ ఏడాది మరింత మెరుగైన పోలీసింగ్ కోసం తీసుకోనున్న చర్యల్నీ ప్రవేశపెడతారు. వీటికి అదనంగా ప్రాంతాల వారీగా స్థానికులకు ఉన్న సమస్యలు ఏంటన్నది తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల్ని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల్లో చేరుస్తారు. తమ విధి విధానాల్లో మార్పులకు సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలు వస్తే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. తక్షణం అమలు చేసేవి, మార్పు చేర్పులకు అవకాశం ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తూ అమలులోకి తీసుకువస్తారు. సిబ్బంది, ఆర్థిక భారాలతో కూడిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందిస్తారు. అన్నీ క్రోడీకరించి నగర స్థాయిలో... సిటీ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల క్రితం ఈ విధానం ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పూర్తికాగా.. గరిష్టంగా పది రోజుల్లో అన్నింటిలోనూ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కమ్యూనిటీ హాళ్ళు, సమావేశ మందిరాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న ఈ మీటింగ్స్‌లో ప్రజల నుంచి వచ్చి సూచనలు, సలహాలతో పాటు ఫిర్యాదుల్నీ క్రోడీకరించి కమిషనరేట్‌కు పంపిస్తారు. వీటిని అధికారులకు అధ్యయనం చేయడం ద్వారా తమ దృష్టికి ఏవైనా లోపాలు వస్తే వాటిని సరిదిద్దడంతో పాటు నూతన విధానాలకు సంబంధించిన సలహాలు, సూచనలు తారసపడితే అన్నింటినీ క్రోడీకరిస్తారు. సిటీలోని అన్ని ఠాణాలను నుంచి వచ్చిన వాటిలో కీలకమైన, అచరణకు అనువైన వాటిని ఎంపిక చేసుకుని నగర వ్యాప్తంగా అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కేస్ స్టడీస్‌తో అవగాహన పెంచేలా... ప్రస్తుతం నగర పోలీసు విభాగం కమ్యూనిటీ పోలీసింగ్, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజా భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న పోలీసులు వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు కాలనీల్లోనూ భారీగా సామూహిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం పోలీసుస్టేషన్ల వారీగా ప్రయత్నాలు చేస్తూ ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నారు. ఈ వార్షిక సమావేశాలను సైతం ప్రజలకు ఈ కోణంలో అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కొలిక్కివచ్చిన కేసులు, ఒనగూడిన ప్రయోజనాలకు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల నిర్వహణ తీరుతెన్నులపై నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గతేడాది నేరాల రేటు తగ్గింది వెంగళరావునగర్: గడచిన రెండేళ్ళతో పోలిస్తే 2016 సంవత్సరం వెస్ట్‌జోన్ పరిధిలో చాలా వరకు నేరాల రేటు తగ్గిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీలో శుక్రవారం నేరాలు అరికట్టడంలో పోలీసులు, ప్రజల పాత్ర అనే విషయంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజల సహకారం వల్లే నేరాలు తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఇటీవల టెక్నాలజీని సైతం వినియోగించుకుని నేరాలు అరికడుతున్నామన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో తాము నేరాల అదుపులో సఫలీకృతం అవుతున్నట్టు పేర్కొన్నారు. ఒకసారి నేరం చేసిన వానిని పట్టుకుని పీడీ యాక్ట్ ద్వారా జైల్లో ఉంచుతున్నామని, ఆ వ్యక్తి తిరిగి వచ్చిన తర్వాత అతనిపై నిఘాను ఉంచుతున్నట్టు చెప్పారు. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో దాదాపు 137 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. 2015 కంటే గత ఏడాది చైన్ స్నాచింగ్స్ లాంటివి 90 శాతం తగ్గాయన్నారు. కార్యక్రమంలో పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్లు వాహిదుద్దీన్, సతీష్, పలువురు ఎస్ఐలు, కాలనీ ప్రతినిధులు కె.విశ్వప్రకాశ్, కోడె సాంబశివరావు, త్రిపురనేని సత్యనారాయణ, చిలకల వెంకటేశ్వరరావు, పీఎస్జీ కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
... అండ్ ద హీరో ఈజ్ 2015
2015లో మన హీరోలంతా ఫుల్ జోష్‌తో పని చేశారు. దాదాపుగా అందరు హీరోలూ తమ తమ సినిమాలతో బిజీగానే ఉన్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ల లెక్కలు పక్కన పెడితే...అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలందరూ మునుపటి కన్నా స్పీడ్ పెంచి సినిమాలు చేశారు... చేస్తున్నారు. ఇలా హీరోలంతా బిజీగా ఉంటే పరిశ్రమకే చాలా మంచిది. 2015లో మన హీరోల హంగామా, 2016లో ప్రణాళికల గురించి ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్. బాక్సాఫీస్ బాహుబలి... ‘బాహుబలి’లో కొడుకు శివుడిగా, తండ్రి అమరేంద్ర బాహుబలిగా రెండు విభిన్న పార్శ్వాలున్న పాత్రల్లో ప్రభాస్ ఈ ఏడాది జేజేలందుకున్నారు. మొత్తం వసూళ్ళలో రికార్డులు తిరగరాశారు. అది సరే కానీ ఇంతకీ, అమరేంద్ర బాహుబలిని అతని సేనాధిపతి కట్టప్ప ఎందుకు చంపినట్లు? అది తెలుసుకోవడానికి రానున్న కొత్త ఏడాదిలో ప్రభాస్ నటించే రెండోభాగం ‘బాహుబలి... ది కన్‌క్లూషన్’ కోసం అందరూ వెయిటింగ్. శ్రీమంతుడి... బ్రహ్మోత్సవం తండ్రి సొంత ఊరిని దత్తత తీసుకొని, అభివృద్ధి చేసి, ఆ ఊరి వాళ్ల ప్రేమను సంపాదించే హీరో కథ ‘శ్రీమంతుడు’. ఈ సినిమాతో బాక్సాఫీస్ ‘శ్రీమంతుడు’గా వెలిగారు మహేశ్‌బాబు. ఆ చిత్రకథకు తగ్గట్లుగా తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త ఏడాది శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బ్రహ్మోత్సవం’తో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే, మురుగదాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. సర్దార్ కోసం వెయిటింగ్ పవన్ కల్యాణ్ నటించిన తొలి మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఈ ఏడాది ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో తెరపై కనిపిస్తారని అంతా ఆశించారు. కానీ, ఈ చిత్రం ఆలస్యంగా మొదలైంది. వచ్చే ఏడాది విడుదలవుతుంది. మళ్లీ సందడి చేశారు 23ఏళ్ల క్రితం రమ్యకృష్ణ-మీనాతో ‘అల్లరి మొగుడు’గా సందడి చేసిన మంచు మోహన్‌బాబు మళ్లీ ఈ నాయికలిద్దరితో ‘మామ మంచు-అల్లుడు కంచు’ చేశారు. కొత్త ఏడాదిలో ఆయన ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారనే వార్త వినిపిస్తోంది. కొత్త ఏడాదికి ప్రేమతో... ‘టెంపర్’ సినిమాలో లంచగొండి ఆఫీసర్‌గా పూర్తి నెగటివ్ షేడ్స్‌లో కనిపించారు చిన్న ఎన్టీఆర్. చాలా కాలం నుంచి ఊరిస్తున్న సక్సెస్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ మార్కు హీరోయిజమ్‌తో సొంతం చేసుకున్నారు. సుకుమార్ శైలిలో డిఫరెంట్ లుక్‌లో స్టయిలిష్‌గా రేపు సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ అని పలకరించనున్నారు. ఆ తర్వాత శివ కొరటాల దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేయనున్నారు. క్లాస్‌గా.... వచ్చే ఏడాది మాస్‌గా తండ్రి గౌరవం కోసం పోరాడే కొడుకుగా, త్రివిక్రమ్ మార్కు ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా అల్లు అర్జున్ సక్సెస్ అందుకున్నారు. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా తరువాత కొత్త ఏడాదిలో మాస్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’గా అల్లు అర్జున్ వస్తున్నారు. ఈ చిత్రంలో రఫ్ అండ్ టఫ్‌గా కనబడుతున్నారు. ఇప్పుడిక ఫైటింగ్ స్పిరిట్ కావాలి! ‘బ్రూస్లీ’లో స్టంట్‌మ్యాన్‌గా తెరపైకొచ్చిన రామ్‌చరణ్ సరికొత్త మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఫైట్స్ చేశారు. కొత్త ఏడాదిలో తమిళంలో ఘనవిజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటించనున్నారు. కిక్ ఎక్కలేదు గానీ... ఈ ఏడాది ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ ద్వారా రవితేజ తెరపై కనిపించారు. మొదటి కిక్ ఇచ్చినంత కిక్ రెండో కిక్ ఇవ్వలేదని జనం తీర్పు ఇచ్చేశారు. ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ తర్వాత కొత్త ఏడాదిలో వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎవడో ఒకడు’, చక్రి అనే నూతన దర్శకుని చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆక్సిజన్... ఈ ఏడాది యాక్షన్ ఎంటర్టైనర్ ‘జిల్’, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సౌఖ్యం’లో నటించారు గోపీచంద్. కొత్తగా ‘ఆక్సిజన్’ అనే సినిమా అంగీకరించారు. ఇది కాకుండా మరికొన్ని చిత్రాలను ఫైనలైజ్ చేశారు. భలే భలే సినిమాలోయ్... తనను తాను అన్వేషించుకునే యువకుడి పాత్రలో ‘ఎవడే సుబ్రమణ్యం’, మతిమరుపు ఉన్న కుర్రాడిగా ‘భలే భలే మగాడివోయ్’లో.. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రల్లో నాని భేష్ అనిపించుకున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో హను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమాతో ముందుకు వస్తున్నారు. మరో పక్క తనను హీరోగా ఇంట్రడ్యూస్ చే సిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎప్పటిలానే ‘పండగ చేస్కో’ ‘పండగ చేస్కో’ అంటూ ఈ ఏడాది జోష్‌గా కనిపించిన రామ్‌కు, ఆ తర్వాత చేసిన ‘శివమ్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కొత్త ఏడాది మొదటి రోజునే హరి పాత్రలో తన ప్రేయసి శైలజతో ఎదురైన ప్రేమ అనుభవాలను ‘నేను...శైలజ’ అని చెప్పనున్నారు. మళ్ళీ... మళ్ళీ... రానా ‘బాహుబలి’లో భల్లాలదేవగా, ‘రుద్రమదేవి’లో చాళుక్య వీరభద్రుడిగా మంచి నటన కనబరిచారు రానా. హిందీ చిత్రం ‘బేబీ’లో కీలక పాత్ర, ‘దొంగాట’, ‘సైజ్ జీరో’ చిత్రాల్లో అతిథి పాత్రలు కూడా చేశారు. ప్రస్తుతం ‘బాహుబలి’ సీక్వెల్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లో నటిస్తున్నారు. అలాగే, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న మలయాళ ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో నటిస్తున్నారు. లవ్... యాక్షన్... మధ్య ఊగిసలాట లవర్‌బాయ్ ఇమేజ్‌లో నుంచి బయటపడేందుకు యాక్షన్ పంథాలో ముందుకు వెళుతూ నాగచైతన్య చేసిన విభిన్న ప్రయత్నం ‘దోచేయ్’. కొత్త ఏడాదిలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’లో, మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్‌లో నాగచైతన్య కనిపించనున్నారు. ఇమేజ్ కంచె దాటి... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సృజనాత్మక దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’లో సైనికుడిగా వరుణ్ ఒదిగిపోయిన వైనాన్ని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ‘లోఫర్’ టైటిల్‌కి తగ్గట్టు అభినయించారు. కొత్త ఏడాదిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా, క్రిష్‌తో మరో సినిమా చేయడానికి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేనమామ బాటలో... మేనమామ చిరంజీవిలానే ఉంటారు సాయిధరమ్ తేజ్. ఈ ఏడాది ‘రేయ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ద్వారా తెరపై కనిపించారు సాయిధరమ్. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో మేనమామ చిరంజీవి సూపర్‌హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో..’ పాట రీమిక్స్‌కు ఆయనలానే స్టెప్స్ వేసి, మేనమామకు తగ్గ మేనల్లుడు అనిపించుకున్నారు. కొత్త ఏడాదిలో ఆయన ‘తిక్క’, ‘సుప్రీమ్’ చిత్రాలతో పలకరిస్తారు. ఎట్టకేలకు... ‘భలే మంచి’ టైమ్! ‘దొంగాట’లో అతిథి పాత్ర, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో విభిన్న తరహా పాత్ర చేశారు సుధీర్‌బాబు. ఆ తర్వాత చేసిన‘మోసగాళ్లకు మోసగాడు’ నిరాశపరి చినా, ఇటీవల శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ‘భలే మంచి రోజు’ వంటి డిఫరెంట్ క్రైమ్, కామెడీ మూవీ ద్వారా ప్రశంసలు అందుకున్నారు. త్వరలో హిందీ చిత్రం ‘భాగీ’లో విలన్‌గా కనిపిస్తారు. డ్యాన్సులు... ఫైట్లు... ‘ అఖిల్’ అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ కోసం అందరూ ఈ ఏడాది ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు. కొత్త ఏడాదిలో అఖిల్ చేసే మలి చిత్రం ఇంకా చర్చల దశలో ఉంది. లక్కీ హీరో! గోదావరి జిల్లా యాసలో పక్కింటి అబ్బాయిలా కనెక్ట్ అయిపోయే రాజ్ తరుణ్‌కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’తో క్రేజీ హీరో అయిపోయారు. ప్రస్తుతం మంచు విష్ణు కాంబినేషన్లో ఓ సినిమా, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’లో నటిస్తున్నారు. సక్సెస్ఫుల్ ‘కేరింత’ స్నేహం నేపథ్యంలో ‘కేరింత’, ప్రేమకథాంశంతో ‘కొలంబస్’ చిత్రాలు చేశారు సుమంత్ అశ్విన్. ప్రస్తుతం ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగే ‘రైట్ రైట్ చేస్తున్నారు. గరమ్ గరమ్‌గా... వస్తున్నాడు! ఆది ఈ 2015లో తెరపై కనిపించలేదు. దానికి కారణం మదన్ దర్శకత్వంలో రానున్న ‘గరం’ చిత్రానికి శ్రద్ధ తీసుకోవడమే. ఈ కథ నచ్చి, తండ్రితో చర్చించి, సొంతంగా నిర్మించారు. కొత్త ఏడాదిలో ‘గరం’తో, ‘చుట్టాలబ్బాయ్’తో పలకరించనున్నారు. వచ్చే ఏడాది ఆ అమ్మాయితోనే... ‘బీరువా’, ‘టైగర్’ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ వచ్చే ఏడాది ‘ఒక అమ్మాయి తప్ప’తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. సర దాగా... మంచు విష్ణు ‘డైనమైట్’లో సరికొత్త గెటప్‌తో కనిపించారు. 2016లో ‘సరదా’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లోనూ, మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ‘శౌర్య’ం చూపించడానికి... ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయన దశరథ్ దర్శకత్వంలో ‘శౌర్య’ సినిమా చేస్తున్నారు. ముచ్చటగా మూడు... ఈ ఏడాది ‘అల్లరి’ నరేశ్ ‘జేమ్స్‌బాండ్’, ‘బందిపోటు’, ‘మామ మంచు-అల్లుడు కంచు’లో నటించారు. కొత్త చిత్రాలతో రెడీ అవుతున్నారు. శర్వా ఎక్స్రప్రెస్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి ఫీల్‌గుడ్ మూవీతో అలరించారు శర్వానంద్. కొత్త ఏడాదిలో రానున్న ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లో మాస్ పాత్రలో కనిపిస్తారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే... ‘జాదూగాడు’లో కనిపించిన నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రంతో కొత్త ఏడాదికి శ్రీకారం చుడుతున్నారు. ‘కల్యాణ వైభోగమే’ రిలీజ్‌కి రెడీ. ఇంకా ‘ఒక మనసు’, ‘జో అచ్యుతానంద’ చిత్రాలు చేస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలతో... హాస్యనటుని స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగిన సునీల్ ఈ ఏడాది సందడి చేయలేదు. కొత్త ఏడాది ‘కృష్ణాష్టమి’ తదితర చిత్రాల్లో హీరోగా కనిపిస్తారు. పీపుల్స్ స్టార్ దండకారణ్యం పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఈ ఏడాది ‘రాజ్యాధికారం’లో మూడు పాత్రలు పోషించారు. వచ్చే ఏడాదికి ‘దండ కారణ్యం’ని సిద్ధం చేస్తున్నారు. ఇటు హీరో.. అటు నిర్మాత... నితిన్ ఈ ఏడాది ‘కొరియర్ బోయ్ కల్యాణ్’లో నటించారు. ‘అఖిల్’ చిత్రానికి నిర్మాతగా వార్తలోకెక్కారు. కొత్త ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ... ఆ’ చిత్రంలో కనిపిస్తారు ప్రయోగాలకు సై... ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘శంకరాభరణం’ చిత్రాల్లో నిఖిల్ కనిపించారు. ‘టైగర్’ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ చేస్తున్నారు. ఆ తర్వాత ‘కార్తికేయ’ సీక్వెల్ చేయాలని ప్లానింగ్. ఒకటికి పది... ఈ ఏడాది ‘అసుర’లో ప్రశంసలు అందుకున్న నారా రోహిత్ వచ్చే ఏడాది దాదాపు పది చిత్రాల్లో కనిపించే అవకాశం ఉంది. ఆయన హీరోగా ‘శంకర, ‘పండగలా వచ్చాడు’, ‘సావిత్రి’, ‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘జో అచ్యుతానంద’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘తుంటరి’ చిత్రీకరణ దశలో ఉంటే, ‘కథలో రాజకుమారి’, ‘వాడే వీడు’ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. హీరోగా... ‘కత్తి’లా.... చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూడాలని ఎనిమిదేళ్లుగా తపిస్తున్న అభిమానుల కోరిక ‘బ్రూస్లీ’తో చిరు స్థాయిలో తీరింది. రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రంలో మూడు నిమిషాల సేపు గెస్ట్‌గా మెరిశారు చిరంజీవి. తాను త్వరలో చేయబోయే 150వ చిత్రానికి ఇది టీజర్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. 2016లో చిరంజీవి పూర్తిస్థాయి హీరోగా ‘కత్తి’లా తయారు కావడం ఖాయమని తేలిపోయింది. సో... లెటజ్ వెయిట్ అండ్ సీ. సెంచరీ దారిలో.... 2015లో ‘లయన్’గా కనిపించిన బాలకృష్ణ, 2016 సంక్రాంతికి ‘డిక్టేటర్’గా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. బాలకృష్ణకు ఇది 99వ సినిమా. సో.. ఇక నూరవ చిత్రం ఎలా ఉంటుంది? ఎవరి దర్శకత్వంలో చేస్తారు? అనే విషయంపై చర్చ సాగుతోంది. అతి త్వరలో ఈ సినిమా వార్త తెలుస్తుంది. వ్యక్తిగత విషయానికొస్తే.. ఈ ఏడాది బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రహ్మణి ఓ బాబుకు జన్మనిచ్చారు. తాత అయినందుకు బాలయ్య చాలా సంబరపడిపోయారు. రెండు సినిమాలు గ్యారంటీ ఈ ఏడాది నాగార్జున పూర్తి స్థాయి సినిమాలో కనిపించలేదు. అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’లో జస్ట్ అలా తళుక్కున మెరిశారంతే. 2016లో మాత్రం ఆయన కచ్చితంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను ఖుష్ చేయనున్నారు. ‘దసరా బుల్లోడు’ తరహాలో నాగ్ చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి రేసులో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ‘నా ఊపిరి’ కూడా ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక, బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎలానూ ఉంది. బాబు బంగారం! ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేశ్‌బాబుతో కలిసి నటించిన వెంకటేశ్, ఈ ఏడాది పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. తండ్రి రామానాయుడు దూరం కావడం ఈ ఏడాది వెంకటేశ్‌కి అతి పెద్ద విషాదం. ► కమల్‌హాసన్ ఈ ఏడాది ‘ఉత్తమ విలన్’గా కనిపించారు. చాలా విరామం తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమాగా ‘చీకటి రాజ్యం’ చేశారు. వచ్చే ఏడాది ‘అమ్మా నాన్న ఆట’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ► కామెడీ చిత్రాల హీరోగా నవ్వించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ ఏడాది ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’, ‘అఖిల్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ తదితర చిత్రాల్లో కనిపించనున్నారు. ► ఈ ఏడాది ‘టై’, ‘వీడికి దూకుడెక్కువ’, ‘ఢీ అంటే ఢీ’ తదితర చిత్రాల్లో కనిపించిన శ్రీకాంత్ వచ్చే ఏడాది మరిన్ని ప్లానింగ్స్‌లో ఉన్నారు. ఈ ఏడాది తెరపై కనిపించని సుమంత్, తరుణ్, సాయిరామ్ శంకర్లు వచ్చే ఏడాది కొత్త చిత్రాలతో పలకరించనున్నారు. ► తమిళ స్టార్లు విక్రమ్ (‘ఐ), సూర్య (‘రాక్షసుడు’), విశాల్ (‘మగ మహారాజు’, ‘జయసూర్య’) చిత్రాల్లో కనిపించారు. ► ఈ ఏడాది సుశాంత్ సినిమా ఏదీ రాలేదు. ఆ లోటుని ‘ఆటాడుకుందాం రా’ సినిమా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ► ‘కొత్త జంట’ తర్వాత ‘అల్లు’ శిరీష్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ► వరుణ్ సందేశ్ ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘లవకుశ’ తదితర చిత్రాల్లో నటించారు. ► ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ చిత్రంలో హీరోగా నటించిన ప్రిన్స్, ‘నేను శైలజ’లో ముఖ్య పాత్ర చేశారు. ► ‘త్రిపుర’లో హీరోగా చేసిన నవీన్‌చంద్ర వచ్చే ఏడాది ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ తన లక్‌ని పరీక్షించుకోనున్నారు. ► ‘సింగమ్ 123’లో ఈ ఏడాది హీరోగా కనిపించిన సంపూర్ణేశ్ బాబు వచ్చే ఏడాది ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.వైరస్.కామ్’ తదితర చిత్రాల్లో కనిపిస్తారు. ► ‘రాజుగారి గది’తో హీరోగా ఎంటరైన అశ్విన్, ఇటీవల ‘జత కలిసే’తో గుర్తింపు తెచ్చుకున్నారు. -
మంత్రులపై ‘ప్రోగ్రెస్’ కత్తి!
మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్ కొందరికి ఉద్వాసన.. మరికొందరికి శాఖల కత్తిరింపు డీఎస్‌తో పాటు మరికొందరి సర్దుబాటుకూ అవకాశం కీలక శాఖలు సీనియర్ల చేతికి.. త్వరలోనే వెలువడనున్న నిర్ణయం హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ప్రచారం పలువురు మంత్రులను హడలెత్తిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ తయారు చేశారని.. త్వరలోనే కొందరికి ఉద్వాసన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలనలో ఏడాది అనుభవం గడించినా ఇంకా కొందరు అమాత్యులు బాలారిష్టాలను దాటలేకపోతున్నారని.. సీనియర్ ఎమ్మెల్యేలు అయినా తొలిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న వారు తమ శాఖలపై ఇంకా పట్టు సాధించలేక పోయారన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఏడాదిగా మంత్రుల పనితీరుపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్... ఇక ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. మంత్రుల పనితీరు, వ్యవహార శైలి, అవినీతి తదితర అంశాలపై నిఘా వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ నిత్యం సమాచారం తెప్పించుకున్నారని తెలుస్తోంది. దాని ఆధారంగానే వైద్యారోగ్య శాఖకు ప్రాతినిధ్యం వహించిన అప్పటి డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు ఉద్వాసన పలికారు. అదే సమయంలో ఒకరిద్దరు మంత్రులనూ మందలించారు. ఇపుడు ఏకంగా ఒక్కో మంత్రి పనితీరుపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ను సీఎం తయారు చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులకు సీఎం క్లాస్ తీసుకున్నారు కూడా. ఇలా ఒక్కో మంత్రికి వారి తీరుపై నేరుగానే హెచ్చరికలు చేస్తున్నారని చెబుతున్నారు. ఉద్వాసన ఎవరికి..? ఇప్పటికే అధికార టీఆర్ఎస్ సీనియర్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవలే పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా గులాబీ గూటికి చేరారు. మరోవైపు పార్టీని ముందు నుంచీ అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను మంత్రిని చేస్తానని కేసీఆర్ బహిరంగంగా హామీ ఇచ్చారు. అదే తరహాలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్కూ భరోసా ఇచ్చారు. ఒకేసారి ఈ ఇద్దరికి మంత్రి పదవి రాకపోయినా... కొప్పుల ఈశ్వర్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం పార్టీలో ఉంది. ఇక డీఎస్‌ను కూడా తగిన రీతిలో గౌరవిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయననూ మంత్రివర్గంలో సర్దుబాటు చేసే అంశాన్ని కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా కొందరు మంత్రుల శాఖల కత్తిరింపు కూడా అనివార్యమని తెలిసింది. మంత్రివర్గంలో మహిళలకు చోటు లేని అంశంపై స్వయంగా సీఎం కుమార్తె, ఎంపీ కవిత బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఎవరికి ఉద్వాసన పలుకుతారన్నది చర్చనీయాంశమైంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ల్లో ఒక్కో మంత్రిపై వేటు పడే వీలుందని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒకరిద్దరు మంత్రులనూ పక్కన పెడతారని, మరో ఇద్దరు మంత్రుల శాఖలను కత్తిరిస్తారని అంటున్నారు. తద్వారా ఖాళీ అయ్యే స్థానాల్లో సీనియర్లకు బాధ్యతలు ఇవ్వడం, ముఖ్యమైన శాఖలను సీనియర్లకు అప్పజెప్పడం ఖాయమని చెబుతున్నారు. ఇలా హోం, రెవెన్యూ శాఖలను వేరే వారికి బదలాయించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తలసాని.. తలనొప్పి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిపదవి వరించింది. ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ స్పీకర్ ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. దీనిపై ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు గ వర్నర్ సైతం తలసాని రాజీనామా ఆమోదంపై తానే నిర్ణయం తీసుకుంటానన్న సంకేతాలను స్పీకర్‌కు పంపారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఇబ్బందికరంగా మారడంతో తలసానిని తప్పిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పనితీరు ఆధారంగా మరో ముగ్గురు నలుగురు మంత్రులకూ ఉద్వాసన తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీంతో కనీసం ఐదారు ఖాళీలు అందుబాటులోకి వస్తాయని.. కొత్తవారు, సీనియర్లకు అవకాశం కల్పిస్తారని పేర్కొంటున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశముందని, ఈసారి ఒక మహిళకు అవకాశం దక్కే వీలుందని చెబుతున్నారు. -
స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప కాదు!
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లలు తమ చుట్టూ ఉన్నదంతా మంచే అనుకుంటాను. ఎప్పుడూ సంతోషంలో మునిగితేలాలనుకుంటారు. మంచీ, చెడు తెలియని దశను సవ్యమైన మార్గంలో పెట్టడానికి నేటి కాలపు అమ్మనాన్నల ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. పదిహేనేళ్ల తన కుమారుడి గురించి ఓ తల్లి ఆందోళన చెందిన విధం ఇది... రెండు నెలల క్రితం... ‘‘మా అబ్బాయి అభినవ్ 9వ తరగతి చదువుతున్నాడు. పదిహేనేళ్లుంటాయి. నేనూ మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగస్తులమే. మాకు ఒక్కగానొక్క బిడ్డ అభినవ్. వాడి మీదే మా ఆశలన్నీ. వాడి భవిష్యత్తు బాగుండాలని, ఇద్దరం కష్టపడుతున్నాం. గత ఏడాది వరకు వాడి పెంపకం మాకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఈ మధ్యే వాడి ప్రవర్తనకు తీవ్రంగా భయపడుతున్నాం. ఏమైపోతాడో అని దిగులుగా ఉంటోంది. పదిహేనేళ్ల పిల్లవాడు డ్రగ్స్ వాడుతున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రికైనా ఎంత షాక్!! అలా నివ్వెరపోయేలా మా అబ్బాయి చేశాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఎదురు తిరుగుతుంటే వయసు అలాంటిదిలే అని సరిపెట్టుకున్నాను. అబద్ధాలు చెబుతున్నాడు అని తెలిస్తే కోప్పడేదాన్ని. కానీ, మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా, ట్యాబ్ వచ్చినా అది కావాలనేవాడు. ఇవ్వకపోతే చచ్చిపోతాను అని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బెదిరింపులు. హెయిర్‌స్టైల్ మార్చాలంటాడు. డ్రెస్సులు ఫ్యాషన్‌గా లేవంటాడు. ఫ్రెండ్స్‌తో తిరుగుళ్లు ఎక్కువయ్యాయి.. తన కన్నా వయసులో పెద్దవారితో స్నేహాలు. కాస్త మందలించినా ఎదురుగా ఉన్న వస్తువులను టీవీ, ఫ్రిజ్.. ఏదుంటే అది పగలకొట్టేంతవరకు వెళ్లింది. నాకు తెలియకుండా మా వారి దగ్గర, ఆయనకు తెలియకుండా నా దగ్గర బుక్ పోయిందనో, పెన్ను కావాలనో, ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అనో.. డబ్బులు అడుగుతూనే ఉంటాడు. ఇవ్వకపోతే దొంగతనం కూడా చేసేవాడు. కోప్పడ్తే ‘నువ్వింతే, నా మీద నీకు నమ్మకం లేదు’ అనేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మార్కులు బాగా తగ్గిపోయాయి. చెప్పింది అస్సలు వినడు అని స్కూల్లో టీచర్ల కంప్లయింట్. ఒక్కగానొక్క కొడుకు. ఏమైనా అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటాడో... అని భయం. అలాగని వదిలేస్తే ఏమైపోతాడో అని దిగులు. ఎవరి సలహా అయినా తీసుకుందామంటే ఇంట్లో ఉండేది మేం ముగ్గరమే! పెద్దవాళ్లు ఊళ్లో ఉంటారు. పిల్లవాడు బాగయ్యేదెలా?! చేస్తున్న ఉద్యోగం మానేయనా?! ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. కుటుంబం గడిచేదెలా?! ఈ తరహా ఆందోళన నాలో ఎక్కువై ఆరోగ్యం కూడా దెబ్బతింది.’ - వసుధ (అభినవ్ తల్లి) నిజాలు ఇలా..! అభినవ్ని తీసుకొని తల్లీదండ్రి వచ్చినప్పుడు పిల్లవాడి స్థితి మామూలగానే ఉన్నట్టు అనిపించింది. తల్లితండ్రి చెబుతున్నట్టుగా ఏమీ లేడని, ఈ దశలో పిల్లల పట్ల ఉండే సహజమైన ఆందోళనే ఈ తల్లిదండ్రిలోనూ ఉందనుకున్నాను. అభినవ్‌తో ఒంటరిగా మాట్లాడి, క్రమం తప్పకుండా కొన్ని సేషన్స్కు అటెండ్ అయితే ఎన్నో విషయాలు తేటతెల్లమయ్యాయి. అభినవ్ కళ్లలో కొద్దిగా ఎరుపు జీర కనిపించింది. ఆకలి ఎక్కువగా ఉంటుందనీ చెప్పాడు. అప్పటికే కొన్ని మెడికల్ టెస్ట్‌లు కూడా చేయించడం వల్ల వాటిలో మందు, పొగ, మాదకద్రవ్యాలకు అప్పుడప్పుడే అలవాటుపడ్డాడని అర్థమైంది. అదే విషయం అడిగితే ‘ స్నేహితుల బలవంతమ్మీద వాటిని తీసుకుంటున్నా’నని చె ప్పాడు. ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే నిజంగానే అభినవ్ పూర్తిగా చదువుమానేసేవాడే! తల్లిదండ్రుల ఆందోళ మరింత పెరిగేదే! ఈ వయసులో... సాధారణంగా టీనేజ్ పిల్లల్లో బిహేవియరల్ సమస్యలను కనుక్కోవడం కష్టం. పేరెంట్స్ మధ్యలో గొడవలుంటే ఆ ప్రభావం పిల్లల మీధ అధికంగా పడుతుంది. వారి మనస్తత్వంలో తీవ్ర మార్పులు వస్తాయి. ఇద్దరూ ఉద్యోగస్తులు అవడంతో తల్లిదండ్రులు తమ తీరికలేని పనులలో నిమగ్నమై ఉంటారు.. పిల్లలతో కొంత సమయం కూడా గడపకపోవడం వల్ల బయటి స్నేహితులను వెతుక్కుంటారు. స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలు చెప్పింది వినకపోయినా, మానసిక సమస్యలున్నా, తెలివితేటల్లో పురోభివృద్ధి లేకపోయినా.. అవే పెరుగుతాయిలే అని పెద్దలు మిన్నకుండిపోతారు. దీంతో పట్టించుకునేవారు ఎవరూ లేరులే అనే నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది. ఇవి తప్పక పాటించాలి... ముఖ్య సమస్యలపైన ముందుగా దృష్టి పెట్టాలి.ఇంట్లో సమస్యలు పిల్లల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. స్కూల్లో ఏ తరహా సమస్యలున్నాయో కనుక్కోవాలి. కొన్నిసార్లు టీచర్లు ఇద్దరు ముగ్గురు పిల్లలనే ‘పాయింట్ ఔట్’ చేసి కించపర చడం, దండించడం వంటివి చేస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. స్నేహితులు కూడా ఇంటి నుంచి ఏమైనా తీసుకురమ్మని డిమాండ్ చేస్తుంటారు. అలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో కనుక్కోవాలి. తల్లిదండ్రులు టీచర్లతో సమయానుసారం తమ పిల్లల పోగ్రెస్, వ్యక్తిత్వం ఎలా ఉందో సంభాషిస్తూ ఉండాలి. మార్పు రావడానికి మంచి - చెడు కారణాలు ఏమున్నాయో చూడాలి. ఎన్ని పనులున్నా... రోజులో కొంత సేపు పిల్లలతో సంభాషించాలి. డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకుండా వస్తువుల రూపేణా భర్తీ చేయాలి. పిల్లవాడి చుట్టూ ఉన్న స్నేహితుల ప్రవర్తననూ పరిశీలించాలి. చాలామంది ‘మా పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ’ ఇస్తాం అని గొప్పగా చెబుతుంటారు. అంత స్వేచ్ఛ కూడా ఈ వయసులో మంచిది కాదు. స్వేచ్ఛకు కొన్ని పరిధులు ఉంటాయని తెలుసుకునేలా పెద్దల ప్రవర్తన ఉండాలి. అలాగని క్రమశిక్షణ పేరుతో అతిగా నియమాలు పెట్టకూడదు. అతి క్రమశిక్షణ పిల్లలను ఎదురు తిరిగేలా చేస్తుంది. కొంతమంది తమ పిల్లలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటామని గొప్పగా చెబుతారు. స్నేహితులుగా అనేది కూడా కొంతవరకే అని తల్లిదండ్రి గ్రహించాలి.స్తబ్దుగా, మౌనంగా పిల్లలు ఉంటే అలాగే వదిలేయకుండా తగిన కారణం తెలుసుకొని వెంటనే పరిష్కరించాలి.తమ ఈడు పిల్లలతో ‘పోలిక’ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. తప్పు పట్టకుండా సాధ్యాసాధ్యాలను వివరించాలి. రెండు నెలలుగా... ఇవన్నీ పాటించి, అభినవ్‌లో వచ్చిన మార్పులు చూసి తల్లీదండ్రీ సంతోషించారు. ‘ఇవే జాగ్రత్తలను పాటిస్తూ ఉండండి’ అనే సూచన వారి ముగ్గురి జీవితాల్లోనూ మార్పును తీసుకువచ్చింది. - డా. చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్ -
బంగారు తల్లికి బెంగ
ఆడపిల్లంటే సమాజంలో ఇప్పటికీ చిన్నచూపే. నగరాలు, పట్టణాల్లో పరిస్థితి కొంత మారుతున్నా.. గ్రామాల్లో ఇప్పటికీ ఆడపిల్లను గుదిబండగా భావిస్తున్నారు. పెంచి, చదివించి, పెళ్లి చేయడం ఆర్థిక భారమన్న భావన తల్లిదండ్రుల్లో పాతుకుపోయింది. ఈ అపవాదును పోగొట్టి ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆలంబన కల్పించి.. ఆమెను బంగారు తల్లిగా మార్చేందుకు ఉద్దేశించిన బంగారు తల్లిపథకాన్ని కొత్త ప్రభుత్వం దాదాపు మూలన పడేసింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పథకం పేరు మార్చి కొనసాగిస్తామని ప్రకటించినా.. అదీ చేయకుండా.. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయకుండా పథకాన్ని..దానిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను డోలాయమానంలో పడేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఈ పథకం స్థితిగతులపై ‘సాక్షి’ ప్రొగ్రెస్ రిపోర్ట్.. వీరఘట్టం, కోటబొమ్మాళి: బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న బెంగ పేద తల్లిదండ్రులను వేధిస్తోంది. పేదవర్గాలకు చెందిన ఆడపిల్లలు పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్పత్రిలో కాన్పు అయిన వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించి తొలివిడతగా పాప పేరిట బ్యాంకు ఖాతాల్లో రూ.2500 జమ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఏటా విడతల వారీగా నగదు జమ చేస్తూ 21 ఏళ్లు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు అందజేస్తారు. పథకం ప్రారంభమై ఈ ఏడాది మే ఒకటో తేదీకి ఏడాది గడిచిపోయినా లబ్ధిదారుల ఖాతాలకు రెండో ఏడాది జమ చేయాల్సిన సొమ్ము విడుదల చేయలేదు. కొత్త దరఖాస్తుదారులనూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 38 మండలాల్లో ఇప్పటివరకు 13,931 మంది ఈ పథకం కింద పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 659 మందిని అనర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిలో 6637 మంది ఖాతాలకు రూ.2500 చొప్పున జమ చేశారు. ఇందులోనూ 5688 మందికే సర్టిఫికెట్లు(బాండ్లు) అందాయి. మిగతావారు బాండ్ల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 6635 మంది దరఖాస్తుదారులకు పథకం మంజూరు నిలిచిపోయింది. మార్చి నుంచి నిధులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చి కొనసాగిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఉ న్న లబ్ధిదారులకు 5 నెలలుగా నిధులు కూడా ఇవ్వలేదు. అధికారులను అడిగితే తమకు ఉత్తర్వు లు లేవంటున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇదీ పథకం లక్ష్యం ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించేం దుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే తగిన ధ్రువపత్రాలతో పేదవర్గాల వారు దరఖాస్తు చేసుకుంటే అర్హతలను గుర్తించి వెంటనే ఆ పాప పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2500 జమ చేస్తారు. టీకాలు అన్నీ సక్రమంగా వేయిస్తే రెండో ఏడాది వెయ్యి రూపాయలు జమ చేస్తారు. ఆ తర్వాత చదువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని విడతల వారీగా నగదు జమ చేస్తూ ఆడపిల్లకు 21 ఏళ్లు.. అంటే పెళ్లి వయసు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు ఆ కుటుంబానికి అందించాలన్నది లక్ష్యం. అత్యధికంగా రణస్థలంలో.. పథకం మంజూరుకు దరఖాస్తు చేయడంలో రణస్థలం అగ్రస్థానంలో ఉంది. ఈ మండలం నుంచి 668 మంది దరఖాస్తు చేయగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా గార(637), ఎచ్చెర్ల(570), రేగిడి(559), లావేరు(538), కోటబొమ్మాళి(519), వీరఘట్టం(507) మండలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం తెల్లకార్డు కలిగిఉన్న పేదవర్గానికి చెందిన వారికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుడితే బంగారు తల్లి పథకం కింద లబ్ధి పొం దే అవకాశం ఉండటంతో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొద్ది నెలల క్రితం వరకు ప్రజలు ఆసక్తి చూపేవారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకా న్ని పట్టించుకోకపోవడం.. కొన్ని నెలలుగా డబ్బులు కూడా జమ కాకపోవడంతో కొన్నాళ్లుగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. నిధులు విడుదల కాలేదు ఎస్.తనూజారాణి, పీడీ, డీఆర్డీఏ జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. అయితే పథకానికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అందువల్ల ఇప్పటివరకు గుర్తించిన లబ్ధిదారులకు ఖాతాలకు సొమ్ము జమ చేయలేకపోతున్నాం. పథకం పేరును మా ఇంటి మహా లక్ష్మిగా మార్చుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వ నిర్ణ యం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుకే బోలెడు తంతు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవడమే పెద్ద తంతు. ఆడపిల్ల పుట్టిన వెంటనే వైద్య సిబ్బంది ఇచ్చే కాన్పు ధ్రువపత్రం, ఆ తర్వాత జనన ధ్రువపత్రం తీసుకోవాలి. గ్రామైక్య సంఘం వద్ద మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటితోపాటు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, మరికొన్ని పత్రాలు జతచేసి ఐకేపీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి రూ. 3 వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఆడపిల్ల పుడితే బంగారుతల్లి పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నారు. ఎంతో ఆశతో దరఖాస్తు చేశాం. తీరా 5 నెలల తర్వాత లిస్టులో నాపేరు లేదన్నారు. నాలుగు నెలలు క్రితం మళ్లీ దరఖాస్తు చేశాను. అయినా ఇంతవరకు బాండ్ రాలేదు. -భోగాది భారతి, వీరఘట్టం పాప పుట్టిన వెంటనే బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేశాను. కానీ ఇంతదాకా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమకాలేదు. అధికారులను అడిగితే అదిగో వచ్చేస్తాది .. ఇదిగో వచ్చేస్తాది అంటున్నారు. - కసింకోట సంతు, వీరఘట్టం గత సంవత్సరంలో జూన్‌లో పాప పుట్టింది. బంగారుతల్లికి దరఖాస్తు చేస్తే వెంటనే బ్యాంక్ ఖాతాలో రూ.2500 పడుతుందని అధికారులు చెప్పారు. ఏడాదైనా పైసా రాలేదు -మయిగాపు చంద్ర, వీరఘట్టం -
కవ్వింత: గుట్టు విప్పాడు...
బిచ్చగాడు: అయ్య, కాస్త అన్నం పెట్టండి బాబూ.. ఇంట్లోంచి: ఒరేయ్ నీకెవర్రా చెప్పింది ఈ ఇంట్లో వంట నేనే చేస్తానని అలవాటు పోదు కదా.. ఓ పెళ్లి సందడిలో ఓ భర్త తన భార్యపై ప్రతి ఐదు నిమిషాలకు ఓ సారి నీళ్లు చిలకరిస్తున్నాడు. ఇంతలో పక్కనున్న మరో మహిళ ఏంటి మీ ఆయన అలా చిలకరిస్తున్నాడని అడిగింది. ‘మా ఆయనది పూల వ్యాపారం’లే అని ఆమె చల్లగా చెప్పింది. సన్నాసెవరో తేలింది టీచర్: వందకు ఐదు మార్కులు తెచ్చుకున్నావు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీ నాన్న ఏమన్నాడు బంటి: నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా అని నన్ను తిట్టాడు సార్ తెలివి తెల్లారింది ఓ ఎస్కలేటరు ఎక్కడానికి సంశయిస్తూ ఓ పెద్దాయన ఆలోచిస్తున్నాడు. ఎందుకండీ... ఆలోచిస్తున్నారని పక్కాయన అడిగాడు. ‘ఎస్కలేటరు ఎక్కేముందు కుక్కపిల్లలను చేతిలోకి తీసుకోండి అని ఇక్కడ బోర్డు పెట్టారండీ... ఇపుడు దాన్నెక్కడ తేవాలి?’’ రహస్యం... రంజిత్: నా జీవితంలో ఒకే ఒక స్త్రీని గాఢంగా ప్రేమించాను. సుజిత్: మీ ఆవిడ లక్కీ అయితే... రంజిత్: పొరపాటున ఆమెకు చెప్పేవురోయ్... ఆ అమ్మాయి వేరు.