Flowers business
-
అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయం
దిల్లు ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నది సినిమా డైలాగే కానీ దీన్ని అక్షరాలా రుజువు చేసి చూపించాడు రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లాపల్లి. చిన్నతనంలో కడు పేదరికంలో గడిపాడు. పదవ తరగతి స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని భావించాడు. బెంగళూరులో వెయ్యి రూపాయలకు పనిచేశాడు. అక్కడ ఆయన జీవితం మలుపుతిరిగింది. లాభదాయకమైన పూలసాగు గురించి తెలుసుకుని సక్సెస్ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు శ్రీకాంత్. అతని కుటుంబం వ్యవసాయ కుటుంబమే కానీ పెద్దగా లాభసాటిగా లేదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అటుపేదరికం, ఇటు అప్పులు ఇలా అనేక సవాళ్లు కళ్లముందు కనిపించాయి. దీంతో16 ఏళ్లకే 1995లో బెంగళూరులో బంధువులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక పుట్టింది.నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పని చేసిన తర్వాత, శ్రీకాంత్ వ్యాపారానికి సంబంధించిన మెళకువలతో సిద్ధమయ్యాడు. పూలసాగు, కోత, మార్కెటింగ్ ,పువ్వుల ఎగుమతి ఇలా ప్రతిదీ నేర్చుకున్నాడు. తొలుత చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుండి పూలను సేకరించి వాటితో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 1997లో నగరంలో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించాడు. అలా ఒక పదేళ్లు పనిచేశాక ఇతర పూల పెంపకం దారులతో సహా పరిశ్రమలోని ఇతరులతో పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో సొంతంగా పూలసాగులోకి దిగాడు. నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి, ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని 10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు ఆయన ఇప్పుడు 52 ఎకరాలకు చేరింది. 52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా ఇలా 12 రకాలకు పైగా పూలను పండిస్తున్నాడు శ్రీకాంత్. ఏడాదికి దాదాపు 70 కోట్లదాకా సంపాదిస్తున్నాడు.వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకారణంగా కష్టాలు, సవాళ్లు చాలా ఉంటాయి. దృఢ సంకల్పం , సహనమే తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది అంటాడు శ్రీకాంత్. తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ, గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రీయంగా పెంచుతానని తెలిపాడు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, శ్రీకాంత్ రూ. 70 కోట్ల టర్నోవర్‌ను సాధించాడు. గ్రామీణ కర్నాటక చుటుపక్కల 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ విజయబాటలో నడుస్తున్నాడు. View this post on Instagram A post shared by Bollapally Srikanth (@bollapallysrikanth) -
రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్ చేస్తే..!
సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్‌లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.ఉత్తర ప్రదేశ్‌లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్‌ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో పెళ్లిళ్ల సీజన్లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు. “ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్. -
రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి
-
బంతి పూల సాగుతో..లాభాలు బాగు
-
విదేశాల్లో ఫుల్ డిమాండ్ ... ఆర్కిడ్ పూల సాగు తో రైతులకు లాభాలు
-
లాక్‌డౌన్‌తో డీలా పడ్డ పూలవ్యాపారం
-
అధ్వాన్నంగా పూల రైతుల పరిస్ధితి
-
కవ్వింత: గుట్టు విప్పాడు...
బిచ్చగాడు: అయ్య, కాస్త అన్నం పెట్టండి బాబూ.. ఇంట్లోంచి: ఒరేయ్ నీకెవర్రా చెప్పింది ఈ ఇంట్లో వంట నేనే చేస్తానని అలవాటు పోదు కదా.. ఓ పెళ్లి సందడిలో ఓ భర్త తన భార్యపై ప్రతి ఐదు నిమిషాలకు ఓ సారి నీళ్లు చిలకరిస్తున్నాడు. ఇంతలో పక్కనున్న మరో మహిళ ఏంటి మీ ఆయన అలా చిలకరిస్తున్నాడని అడిగింది. ‘మా ఆయనది పూల వ్యాపారం’లే అని ఆమె చల్లగా చెప్పింది. సన్నాసెవరో తేలింది టీచర్: వందకు ఐదు మార్కులు తెచ్చుకున్నావు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీ నాన్న ఏమన్నాడు బంటి: నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా అని నన్ను తిట్టాడు సార్ తెలివి తెల్లారింది ఓ ఎస్కలేటరు ఎక్కడానికి సంశయిస్తూ ఓ పెద్దాయన ఆలోచిస్తున్నాడు. ఎందుకండీ... ఆలోచిస్తున్నారని పక్కాయన అడిగాడు. ‘ఎస్కలేటరు ఎక్కేముందు కుక్కపిల్లలను చేతిలోకి తీసుకోండి అని ఇక్కడ బోర్డు పెట్టారండీ... ఇపుడు దాన్నెక్కడ తేవాలి?’’ రహస్యం... రంజిత్: నా జీవితంలో ఒకే ఒక స్త్రీని గాఢంగా ప్రేమించాను. సుజిత్: మీ ఆవిడ లక్కీ అయితే... రంజిత్: పొరపాటున ఆమెకు చెప్పేవురోయ్... ఆ అమ్మాయి వేరు.