
హైదరాబాద్: అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి అలిసన్ రిస్కే డ్యాన్స్‌కు భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫిదా అయ్యారు. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అలిసన్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. భారత మాజీ డేవిస్ కప్ ఆటగాడు, కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజు కొడుకు స్టీఫెన్ అమృత్‌రాజ్‌ను ఆమె వివాహం చేసుకోనుంది. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ‘ ఇప్పటినుంచి నాకు భారత అభిమానులుకు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక నుంచి నేను అమృత్‌రాజ్ కుటుంబ సభ్యురాలిని. మీ అభిమానాన్ని గెలుచుకునేందుకు చిన్న ప్రయత్నం చేశాను’అంటూ పోస్ట్ చేసింది.
ఇక అలిసన్ చేసిన ట్వీట్‌కు సానియా రీట్వీట్ చేస్లూ..‘వావ్.. వాటే డ్యాన్స్. ఒక్కటి కాబోతున్న ఇద్దరికి కంగ్రాట్స్’అంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం అలిసన్ చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. అంతేకాకుండా స్టీఫెన్, అలిసన్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక 37వ సీడ్ అలిసన్ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేదు. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో స్టార్ ప్లేయర్ సెరేనా విలియమ్సన్ చేతిలో అలిసన్ ఘోరంగా ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment