తెల్లని కుర్తాలో మెరిసిన సానియా | Sania Mirza Posts Adorable Photo In Twitter With Son Izhaan On Ramzan Festival | Sakshi
Sakshi News home page

తెల్లని కుర్తాలో మెరిసిన సానియా

May 25 2020 6:27 PM | Updated on May 25 2020 6:43 PM

Sania Mirza Posts Adorable Photo In Twitter With Son Izhaan On Ramzan Festival - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘రంజాన్‌ ఈద్‌ పండగ వేడుకలు’ అంటూ ఆమె క్యాప్షన్‌ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్‌ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు.

ఇక ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా.. ‘చాలా అందంగా కనిపిస్తున్నారు’అని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్‌గా ఉన్నాడు. ‘లాక్‌డౌన్‌ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్‌ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి’  అని సానియా మరో ట్వీట్‌లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement