టైటిల్‌ పోరుకు అనిరుధ్‌ జోడీ | Title fight to Hyderabad tennis player Anirudh Chandrasekhar | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు అనిరుధ్‌ జోడీ

Published Sat, Oct 5 2024 11:03 AM | Last Updated on Sat, Oct 5 2024 11:23 AM

Title fight to Hyderabad tennis player Anirudh Chandrasekhar

విలేనా (స్పెయిన్‌): హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ ఈ ఏడాది నాలుగో ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన విలేనా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీ సెమీఫైనల్లో అనిరుద్‌–నిక్కీ కలియంద పునాచా (భారత్‌) ద్వయం 6–3, 7–6 (7/5)తో సెజార్‌ క్రెటు (రొమేనియా)–వాలెంటిన్‌ రోయర్‌ (ఫ్రాన్స్‌) జంటపై గెలిచింది. 

88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్‌–నిక్కీ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశారు. 26 ఏళ్ల అనిరుధ్‌ ఈ ఏడాది మనాకోర్‌ ఓపెన్, ఓల్‌రాస్‌ ఓపెన్, క్వింపెర్‌ ఓపెన్‌ టోరీ్నలలో ఫైనల్‌కు చేరాడు. ఓల్‌రాస్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించి, మిగితా రెండు టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement