
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా అతియాశెట్టిని వివాహమాడారు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
నూతన వధూవరులు అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో సునీల్ శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా మిఠాయిలు పంచుతూ కనిపించారు. ఈ జంట తొలిసారి భార్యాభర్తలుగా చాలా అందంగా కనిపించింది.
అతియా తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.' పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ, క్రిెకెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఆలియా భట్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి ఫడ్నేకర్, నవ్యనందా శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment