wedding day
-
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర
టాలీవుడ్లో మోస్ట్ ఎవైటింగ్ వెడ్డింగ్ అంటే హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్‌బర్డ్స్ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా ఆన్లైన్లో వైరల్‌గా మారింది. మరోవైపు శోభితా పెళ్లి చీర, షాపింగ్ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన ఈరోజుకోసం శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్ లేకుండానే తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో షాపింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్ గోల్డ్ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్‌ను సెలెక్ట్ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ క్రీమ్ షేడ్స్‌లో, ఆరెంజ్ కలర్ బార్డర్చీరతో కనిపించిన సంగతి తెలిసిందే. -
గడుసు పిల్లే..! మొత్తానికి తాళి కట్టించుకుంది! వైరల్ వీడియో
పెళ్లిళ్లలో ఉండే హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి పనులు మొదలు పెట్టినదగ్గర్నుంచి ఆ మూడు ముళ్లు పడేదాకా అదొక యజ్ఞంలా లాంటిదే. అందులోనూ అమ్మాయి తరపువారికి అయితే ఈ టెన్షన్ మరీ ఎక్కువ. ఈక్రమంలో బెంగళూరులో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఒక పెళ్లి కూతురు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుంది.. అసలు ఏం జరిగిందంటే.. మూడుముళ్ల వేడుక కోసం అందంగా ముస్తాబైన, బెంగళూరుకు చెందిన పెళ్లి కూతురు పెళ్లి మండపానికి బయలు దేరింది. తీరా భయంకరమైన ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అసలే బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ. దీనికి పెళ్లిళ్ల సీజన్. ఎటూ కదల్లేని పరిస్థితి. ఇలా అయితే.. ఇక పెళ్లి అయినట్టే అనుకుందో ఏమోగానీ, కారు దిగి తన సన్నిహితులతో మెట్రోలో ఎంచక్కా వివాహ మండపానికి చేరింది. సమయానికి తాళి కట్టించుకుంది. పెళ్లి ముస్తాబు, పట్టుచీర నగలతో వధువు నిశ్చింతగా మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమ్మాయి గడుసుదే అంటే ప్రశంసలు దక్కించుకుంటోంది. అయితే ఇందులో కొసమెరపేంటి అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది నాటిది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ మళ్లీ వైరల్ అవుతోంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H — Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023 -
పెళ్లి రోజు మర్చిపోయిన భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య
ఇటీవల భార్తభర్తల గొడవలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. పైగా వాటిని పోలీస్టేషన్ల వరకు తీసుకువచ్చి పంచాయితీ పెడుతుండటం మరింత విడ్డూరం. నాలుగోడల మధ్య పరిష్కరించుకోవాల్సి చిన్నపాటి తగాదా కాస్త దాడి చేసుకునేంత వరుకు వెళ్లిపోతుండటం బాధకరం. అచ్చం అలాంటి విచిత్ర ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైలో ఘట్కోపర్లో నివశిస్తున్న 32 ఏళ్ల విశాల్ నాంగ్రే అనే వ్యక్తి కొరియర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కల్పన ఫుడ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తోంది. అతని భార్య కల్పన ఇద్దరూ కలిసి బెగన్‌వాడిలో నివశిస్తున్నారు. ఆ జంటకు 2018లో వివాహమైంది. ఫిబ్రవరి 18 వారి పెళ్లిరోజు. ఆ విషయాన్ని నాంగ్రే మర్చిపోయాడు. ఈ విషయమై భర్తపై కోపంతో తన తల్లిదండ్రులు, సోదరడుని ఇంటికి పిలిపించి మరి గొడవకు దిగింది. అక్కడితో ఆగక ఆమె అతడిని తీవ్రంగా దుర్భాషలాడుతూ, అతడి తల్లిపై చేతివాటం చూపింది. దీంతో వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఐతే ఆమె భర్త నాంగ్రే గాయపడిన తన తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లి తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడి భార్య, ఆమె తల్లిదండ్రులు, సోదరుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మిరాకిల్ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..) -
లెహంగా తయారీకి 10 వేల గంటలా.. ఎందుకంత స్పెషల్?
క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈనెల 23 వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒక్కటైంది ఈ ప్రేమజంట. సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ ఖందాలాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లిరోజు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపైనే బీ టౌన్లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలో అతియా ధరించిన లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అయితే ఆ డ్రెస్ ఎందుకంత స్పెషల్? అందులో ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) పెళ్లిలో అతియా శెట్టి ధరించిన లెహంగా తయారీకి దాదాపు 10,000 గంటల సమయం పట్టిందని ప్రముఖ డ్రెస్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతియా శెట్టి లెహంగా తయారీకి 416 రోజులు, 10 వేల గంటలు పట్టిందని ఆమె తెలిపారు. అతియా శెట్టి వివాహ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. డిజైనర్ మాట్లాడుతూ.. 'అతియా చాలా చక్కగా,అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. అతియాపై ప్రేమతో ఆ వధువు ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని అనామిక చెప్పకొచ్చింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) (ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ) -
మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా అతియాశెట్టిని వివాహమాడారు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నూతన వధూవరులు అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో సునీల్ శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా మిఠాయిలు పంచుతూ కనిపించారు. ఈ జంట తొలిసారి భార్యాభర్తలుగా చాలా అందంగా కనిపించింది. అతియా తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.' పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ, క్రిెకెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఆలియా భట్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి ఫడ్నేకర్, నవ్యనందా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే?
పిఠాపురం(కాకినాడ జిల్లా): పెళ్లి రోజున కొత్త చీర కొనలేదనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన మల్లిపూడి శ్రీనివాసరావుకు శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన పద్మినితో 2017లో వివాహమైంది. ఈ నెల 11న చేలో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భర్తను పెళ్లి రోజు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చీర కొనాలని పద్మిని అడిగింది. చదవండి: ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం.. ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉందని, తాను ఇప్పుడు కొనలేనని అతడు సమాధానం చెప్పాడు. తోటి వారందరూ వరలక్ష్మీ వ్రతానికి కొత్త చీరలు కొనుక్కుంటున్నారని.. ఆ రోజు పెళ్లి రోజు కూడా అయినందున తనకు చీర కొనాలని కోరింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న పద్మిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. విషయం గమనించిన భర్త కేకలు వేయగా.. బంధువులు, స్థానికులు పరుగున వచ్చి ఆమెను కిందకు దింపారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లి రోజు వరుడు సర్ప్రైజ్.. గిఫ్ట్ చూసి ఏడ్చేసిన వధువు!
జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేమైనది. అందుకే యువతీ యువకులు వారి పెళ్లి రోజున స్పెషల్స్, సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకుంటూ జీవితంలో మరచిపోని రోజులా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీ ఫంక్షన్లు, హల్దీ వేడుకలతో హడావిడీ చేస్తున్నారు. అంతేనా ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం అవి నెటిజన్లను ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహా ఓ జంట వీడియో గత సంత్సరం నెట్టింట ప్రత్యక్షమైంది. తాజాగా ఆ వీడియో మరో సారి వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏముందంటే.. వెడ్డింగ్ డే అనేది ప్రతి జంటకు ప్రత్యేకమైన రోజు. అందుకే తమ కుటుంబ సభ్యులు, బంధువులతో, స్నేహితులతో కలిసి ఎప్పటికీ గుర్తుండేలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో పాటు తమ జీవిత భాగస్వామికి ఏదైనా మరచిపోని బహుమతిని ఇచ్చేందుకు తాపత్రయ పడడం కూడా సహజమే. అయితే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన భార్యకు స్పెషల్ గిఫ్ట్‌తో ఆశ్యర్యపరిచాడు. ఎలా అంటారా.. బ్రెజిల్లో ఉంటున్న వధువు తల్లిదండ్రులను విమానంలో పిలిపించి ఆమెకు స్పెషల్ సర్ప్రైజ్లా ప్లాన్ చేశాడు ఓ వరుడు. ఇక వెడ్డింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వధువు తన తల్లిదండ్రలను చూడగానే ఆనందంతో ఒక్కసారిగా వారి ఏడవడం మొదలుపెట్టింది. అనంతరం వారిని కౌగిలించుకుని తన సంతోషాన్ని కనీళ్ల రూపంలో వారికి తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సర్ప్రైజ్ బాగుంది బాస్ అంటు కామెంట్ పెట్టారు. Husband surprises bride by flying her parents from Brazil to their wedding. ☺️☺️ pic.twitter.com/eBZnOj1R5X — made me smile (@mademe__smile) May 4, 2022 చదవండి: Viral video: చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు -
కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..
Groom starts crying when he sees bride on wedding day: పెళ్లి రోజున గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లికూతురి డ్రెస్‌లో చూసి ఆనందభాష్పాలను దాచలేకపోయాడా పెళ్లికొడుకు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అసలేంజరిగిందంటే.. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న అలెగ్జాండ్రియాను చూసిన వరుడు డెమెట్రియస్ క్యాషరీస్ భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వైట్ పెవిలియన్ గౌను ధరించిన వధువు పుష్పగుచ్చం పట్టుకుని తండ్రితోపాటు రావడం చూసిన వరుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. దీనిని సంబంధించిన వీడియోను మగ్నోలియా రోడ్ ఫిల్మ్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో ప్రశంజల జల్లును కురిపిస్తున్నారు. ‘ఓమై గాడ్! ఈ వీడియో నన్ను కూడా ఏడిపిస్తోంది. మీకు శుభాకాంక్షలు' అని ఒకరు, ‘ఈ వీడియో నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. నాకు మీరు తెలియకపోయినా.. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చాలా భావోధ్వేగంతో కామెంట్ చేశారు. మరి మీరేమంటారు.. చదవండి: Dental Care Tips In Telugu: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? ఐతే ఇలా చేయండి.. View this post on Instagram A post shared by Magnolia Road Film Co. (@magnoliaroadfilmco) -
పెళ్లిలో తాగొచ్చిన వరుడు.. మాజీ ప్రియుడితో వధువు పరార్..
పెళ్లి అన్యోన్య దాంపత్య జీవితానికి పునాది. రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలను కలిపే వేడుక. సంప్రదాయ బద్ధంగా జరిగే ఈ శుభకార్యానికి పెళ్లి కొడుకు తప్పతాగి వచ్చాడు. ఇంకేముంది పెళ్లిమండపంలోనే వరుడిని వదిలేసిన వధువు తన మాజీ ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటన గతేడాది జరగ్గా.. తాజాగా వైరలవుతోంది. మేరీల్యాండ్‌కు చెందిన 24 ఏళ్ల సేరియా సామ్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లికి బంధువులు ఎవరూ రాకపోవడంతో తన కజిన్(మాజీ ప్రియుడు) కైల్‌ను ఆహ్వానించింది. చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం పెళ్లి అనే ఆనందంలో పెళ్లికొడుకు తాగి వచ్చాడు. అటూ ఇటూ తూలుతున్నాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తించాడు. ఇదంతా వధువు గుర్తించింది. ‘వరుడు నా ముఖంలోకి సరిగా చూడలేకపోయాడు. పెళ్లి ఉంగరాలను కూడా కింద పడేశాడు.’అని ఆమె వాపోయింది. చివరికి విచిత్రకర పరిస్థితుల్లో ఆమె పెళ్లి జరిగింది. కానీ వధువు అతని చర్యలపై విసుగు చెందింది. చదవండి: ఐకానిక్ మహాభారత్ సాంగ్‌ను ఆలపించిన ముస్లిం: నెటిజన్లు ఫిదా! వరుడు కళ్లు తెరవలేకపోతున్నాడని, సరిగా నిల్చోలేకపోతున్నాడని తన మాజీ ప్రియుడితో చెప్పుకొని వాపోయింది. ఆమె బాధను చూసిన ఆ వ్యక్తి.. ‘వరుడు నీకు సరైన వాడు కాదు. అతను మూర్ఖుడు. అతనిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇదంతా నేను చూడలేను. అందరూ నిన్ను హెచ్చరించారు. అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో’ అంటూ వధువుపై తనకున్న ఫీలింగ్స్‌ను చెప్పి తనతో వచ్చేందుకు సిద్ధమేనా అని అడిగాడు. దీంతో వధువు ఆలోచించి తన బాయ్‌ఫ్రెండ్‌తో పరారైంది. కారు పార్కింగ్ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్తున్న ఈ జంట ఒకరినొకరు కిస్ చేసుకుంటూ కనిపించారు. -
‘పెళ్లికి చెప్పినంత ఖర్చు పెడతారా.. లేదా లేచిపొమ్మంటారా?!’
అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే.. అదేంటో మహా చెడ్డచిరాకు వస్తుంది కదా.. ఆ విసుగు, కోపంలో మనం ఏం చేస్తామో.. ఎలాంటి మాటలు మాట్లాడతామో మనకే తెలియదు.. అమెరికాకు చెందిన ఓ కాబోయే పెళ్లికూతురికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లడంతో తల్లిదండ్రులనే బ్లాక్మెయిల్ చేసే స్థితికి చేరుకుంది. తన పెళ్లికి కోరినంత ఖర్చు చేయకపోవడం కుదరనడంతో... తనకు నచ్చినవాడితో పారిపోతానంటూ ఆమె బెదిరించిన తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. రెడిట్‌లో ఆమె స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు.. ‘‘ఇటీవలే నాకు నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి పెళ్లి కోసం ఎన్నో కలలు కంటున్నాను. ముఖ్యంగా ఆరోజు ఎలా మేకప్ కావాలి. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి వంటి అంశాల చుట్టే నా మనసు తిరుగుతోంది. నిజానికి మా తల్లిదండ్రులకు నేనొక్కదాన్నే కూతుర్ని. వారి సంపాదనకు కూడా కొదవేం లేదు. చిన్నప్పటి నుంచి ఏం అడిగినా పెళ్లి సమయంలో ఖర్చు చేసేందుకు పొదుపు చేస్తున్నాం అని చెప్పేవారు. దాంతో ఎంగేజ్మెంట్ తర్వాత నుంచే నా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాను. వేదిక, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తదితర విషయాల కోసం 25 వేల డాలర్ల బడ్జెట్ అనుకున్నా. కానీ మా నాన్న.. పెళ్లిరోజున 40 వేల డాలర్లు ఖర్చు చేద్దాం అని చెప్పారు. మా అమ్మ కూడా అదే చెప్పింది. అయితే, 25 వేల డాలర్లలో వేడుక ఖర్చు పూర్తి చేస్తే కాస్త మిగుల్చుకోవచ్చని సలహా కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఆఖరికి 20 వేల డాలర్లకు బడ్జెట్ ఫిక్స్ చేశారు. వెడ్డింగ్ గౌన్, వీల్(తలపై కప్పుకునే వస్త్రం) కోసం కేవలం 3 వేల డాలర్లు. ఇలా అన్నింటికి ఒక్కొక్కటిగా తగ్గించేస్తున్నారు. నాకు చిరాకేసింది. అందుకే చెప్పినంత ఖర్చు చేస్తారా లేదంటే నచ్చిన వ్యక్తితో లేచిపొమ్మంటారా అని బెదిరించాను’’ అని సదరు యువతి రాసుకొచ్చింది. అయితే, ఆఖరికి ఏమైందన్న విషయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంచింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టుకు స్పందనగా.. చాలా మంది యువతి ప్రవర్తనను తప్పుపడుతుంటే.. కొంతమంది మాత్రం.. ముందే ఆమెకు ఆశ పెట్టకుండా అసలు విషయం చెప్పాల్సింది అని తల్లిదండ్రుల తీరును విమర్శిస్తున్నారు. చదవండి: ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు! -
పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం
చంద్రగిరి: అన్యోన్య దాంపత్యానికి దిష్టి తగిలింది. ఆదర్శజంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. పెళ్లిరోజునే పెనిమిటిని మృత్యువు కబళించింది. సాఫీగా సాగుతున్న జీవితం తలకిందులైంది. వివరాలు.. చంద్రగిరి మండలం మఠంపల్లెకు చెందిన శివ(30) తిరుపతిలో డిజైనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పవిత్రను గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం వారికి ఓ అబ్బాయి పుట్టాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని తిరుపతి నుంచి స్వగ్రామానికి శివ బైక్‌పై బయలుదేరాడు. తొండవాడ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన శివను 108లో తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పెళ్లిరోజునే మరణించావా అంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో మఠంపల్లె విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే.. ‘మా అన్నయ్య టెకీ, వదిన డాక్టర్.. తనపై ఆ ముద్ర సరికాదు’ -
నెలసరి దాచిపెట్టిందని విడాకులు
వడోదర: రుతుక్రమం ఆడవాళ్లకు శాపం కాదని, అది వారి శరీరధర్మంలో ఓ భాగమని మహిళా సంఘాలు చెప్తున్నాయి. కానీ ఓ వివాహిత మహిళకు మాత్రం రుతుక్రమం శాపంగా మారింది. గుజరాత్‌లోని వడోదరలో తన దగ్గర నెలసరి విషయాన్ని దాచిపెట్టిందని భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడో భర్త. అలాగే తన గొంతెమ్మ కోర్కెలు తీర్చడం తన వల్ల కాదంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి, టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళకు నెలసరి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు. తీరా పెళ్లయ్యాక గుడికి వెళ్తుంటే తను లోపలకు రాలేనని అసలు విషయాన్ని చెప్పింది. (చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య) అలా వాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా ఈ విషయంలో ఆమె మీద నమ్మకం పోయిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు. ఇంట్లోవాళ్లకు పైసా కూడా ఇవ్వొద్దని పోరు పెట్టేదన్నాడు. కేవలం ఆమె చేతి ఖర్చుల కోసమే ప్రతి నెలా రూ.5 వేలు ఇవ్వాలని, ఇంట్లో ఒక ఏసీ పెట్టించాలని హింసించేదని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, ఆమె చెప్పిన కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్లో వివరించాడు. చాలాసార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి చిన్నదానికి పుట్టింటికి వెళ్లి సతాయించేందని వాపోయాడు. తను అడిగినవి చేయకపోతే.. నీచంగా బెదిరించేదన్నాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ గొడవలు మాత్రం ఆగడం లేదన్నాడు. ఒక రోజైతే టెర్రస్ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టిందని చెప్పాడు. భార్యతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని కోరాడు. (చదవండి: ప్రాణం మీదికి తెచ్చిన ఫేస్బుక్ ప్రేమ) -
పెళ్ళైన రోజే నవ వధువు అదృశ్యం
సాక్షి, కడప: ఉదయం వివాహం చేసుకున్న వధువు.. రాత్రికి అదృశ్యమైన ఘటన కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని అత్తిరాలలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం.. స్థానిక వినాయక్ నగర్ ప్రాంతంలో నివసించే రమణమ్మ కుమార్తె సునీతకు ఈ నెల 25వ తేదీ ఉదయం కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్య అనే యువకుడితో అక్కడే వివాహం అయింది. అదే రోజు సాయంత్రం భర్తతో కలసి వధువు పుట్టింటికి వచ్చింది. రాత్రి పూట ఇంటి బయట అటూ ఇటూ తిరుగుతున్న సునీత ఒక్కసారిగా అదృశ్యమైంది. కల్యాణం అయిన కొద్ది గంటల్లోనే సునీత కనిపించకపోవడంతో కంగారుపడ్డ భర్త, కుటుంబ సభ్యులు చుట్టు పక్కన ఇళ్లలో వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో సునీత తల్లి రమణమ్మ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ మహేష్ నాయుడు దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. వధువు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే పెళ్లికి ముందు వేరే ఎవరినైనా ప్రేమించిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని అధికారులు తెలిపారు. -
ముగ్గురి ఉసురు తీసిన అక్రమ ఇసుక రవాణా
-
సోనం పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపుతా..
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్‌కపూర్ గారాలపట్టి సోనం కపూర్ పెళ్లి రోజు దగ్గరపడుతున్న కొద్దీ బాలీవుడ్లో సందడి పెరుగుతోంది. ఆమె పెళ్లిలో హంగామా కోసం డ్యాన్స్ స్టెప్లను ప్రాక్టీస్ చేస్తుండటం నుంచి దుస్తుల ఎంపికతో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక సోనం పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు తాను ఎంతో ఉద్వేగంగా ఎదురుచూస్తున్నానని ఆమె బాబాయి సంజయ్ కపూర్ చెబుతున్నారు. ‘20 ఏళ్ల కిందట నా పెళ్లిలో మనం డ్యాన్స్ చేశాం..ఇప్పుడు నీ పెళ్లిలో నేను డ్యాన్స్ చేయబోతున్నా’నంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేస్తూ సంజయ్ వ్యాఖ్యానించారు. మే 8న సోనం, ఢిల్లీ వ్యాపారి ఆనంద్ అహుజాల వివాహ వేడుకకు కపూర్ మ్యాన్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుకను జరిపించేందుకు కపూర్, అహుజా కుటుంబాలు నిర్ణయించాయి. ఇక సినిమాల పరంగా సోనం కపూర్ నటించిన వీరే ది వెడ్డింగ్ మూవీ జూన్ 1న థియేటర్ల ముందుకు రానుంది. ఈ మూవీలో సోనంతో పాటు కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా స్క్రీన్‌ను పంచుకోనున్నారు. -
పెళ్లింట విషాదం
ఇంట్లో పెళ్లి ఉందని బంధువులందరికీ చెప్పారు.. పెళ్లి పత్రికలు పంచారు.. బంధువులంతా పెళ్లి కొడుకు ఇంటికి చేరుకున్నారు.. మరీ కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అందరు బంధువులూ పెళ్లికి సిద్ధమయ్యారు. అంతలోనే విధి కన్నెర్ర చేసింది. పెండ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటివరకు సంబరంగా ఉన్న వారంతా దుఖంలో మునిగిపోయారు. కన్న కొడుకు పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కాటికిపయనమయ్యాడు. గుండెపోటుతో తండ్రి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నిండింది. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు పెళ్లికొడుకు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కంటతడి పెట్టించింది. సిరికొండ(బోథ్): సిరికొండ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన సట్ల రాజన్న(60) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. రాజన్నకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. పెద్ద కొడుకు, కూతురు పెళ్లిళ్లు గతంలోనే కాగా చిన్న కొడుకు పోశెట్టి పెళ్లి ఉట్నూర్ మండలం టేకుగూడ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం 12 గంటలకు వధువు ఇంటి వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. మగపెళ్లివారు బయల్దేరడానికి సిద్ధమవుతుండగానే పెళ్లి కొడుకు తండ్రి రాజన్నకు గుండెపోటు వచ్చి కింద పడిపోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు సంబరంగా ఉన్న ఆ ఇంట్లో రోదనలు ఆకాశాన్నంటాయి. ఇంటి పెద్ద మరణంతో పెళ్లిని వాయిదా వేశారు. గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
పెళ్లి రోజే వరుడు పరారీ
యాకుత్‌పురా:కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకు పరారైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ కుమార్తె హసినా ఫాతిమాకు, ఆసిఫ్‌నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్‌తో వివాహం కుదిరింది. ఈ నెల 29న నాంపల్లిలోని ఓ మసీద్‌లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేగాక ఒప్పందం ప్రకారం పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కట్నకానుకలను అందజేశారు.అయితే గురువారం పెళ్లి కుమారుడు షరీఫ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షరీఫ్ కుటుంబ సభ్యులకు 15 తులాల బంగారు ఆభరణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులను ముందుగానే అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా..?
లక్నో : మరి కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువ ఇంజనీర్ ఆజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భాజభజాంత్రిలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. ఈ విషాద సంఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని నందోసి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గాంగ్వర్ ఓ ప్రైయివేట్ బిల్డర్స్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతనికి అదే రోజు సాయంత్రం షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి జరగాల్సింది. పెళ్లి పనులతో ఆ కుటుంబమంతా సందడి నెలకొంది. ఇంతలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్‌పాల్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఫోన్ ద్యాసలో ఉన్న నరేశ్‌ను వేగంగా వచ్చిన రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కోసం వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనడం బాధాకరంగా ఉందని అతని బంధు మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
'మీ రొమాన్స్‌తో కష్టం.. మీరొద్దు.. పెళ్లి రోజే షాక్'
సాక్షి, శ్రీనగర్ : ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను వారి పెళ్లి రోజే ఆ స్కూల్ యాజమాన్యం అనూహ్యంగా తొలగించి షాకిచ్చింది. వాళ్ల రొమాన్స్ స్కూల్ విద్యార్థులకు ఇబ్బందిని కలిగిస్తుందని ఆ కారణంతోనే వారిని తొలగిస్తున్నామంటూ పేర్కొంది. దీంతో కెరీర్ ప్రారంభం సమయంలో వారికి ఉద్యోగం లేకుండా పెళ్లి సంతోషం కూడా మిగలకుండా చేసిన ఆ స్కూల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే తారిఖ్ భట్, సుమయా భషీర్ అనే ఇద్దరు పులువామా జిల్లాలోని ట్రాల్ టౌన్ ప్రాంత వాసులు వారిద్ద పాంపౌర్లోని ఓ ముస్లిం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో గత కొన్నేళ్లుగా టీచర్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు వేర్వేరుగా బాయ్స్, గర్ల్స్ క్యాంపస్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరికి ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది. దాంతో వారిద్దరు కాస్త చనువుగా ఉండటం మొదలుపెట్టారు. గత నెల(నవంబర్) 30న వారి వివాహం ఉండగా అందుకోసం స్కూల్లో సెలవులకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, సెలవులు మాత్రం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం సరిగ్గా పెళ్లి రోజు వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో వారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ సంతోషమే లేకుండా పోయింది. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించినప్పటికీ ఎలాంటి బదులు ఇవ్వలేదు. అయితే, స్కూల్ చైర్మన్ బషీర్ మసూది మాత్రం బదులిస్తూ 'వాళ్లిద్దరు రొమాన్సాలో ఉన్నారు. అది మా స్కూల్లో చదువుతున్న, పనిచేస్తున్న 2000మంది విద్యార్థులకు మంచిదికాదు. 200మంది స్టాఫ్‌కు మంచిది కాదు. వీరి మధ్య ఉన్న విషయం విద్యార్థులకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది' అని బదులిచ్చారు. -
సరిగ్గా పెళ్లైన ఏడాదికే..
వేములవాడ: పెళ్లి రోజు నాడే ఓ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపులకు మహిళ బలైన సంఘటన వేములవాడ మండలం సత్రాజ్‌పల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవికుమార్‌కు ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (2016 ఆగష్టు 19)న గుడిసె అశ్విని(26)తో వివాహమైంది. కాగా.. పెళ్లైనప్పటినుంచి అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన అశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. -
పెళ్లి రోజే.. వివాహిత ఆత్మహత్య
-
పెళ్లి రోజే.. వివాహిత ఆత్మహత్య
హైదారాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిరోజే కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేటలో జరిగింది. ఆరేళ్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ప్రేమజంట కాపురం ఆర్నెళ్లు కూడా సజావుగా సాగలేదు. తప్పు ఎవరిదైనా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. ఇది కాస్త మహిళా పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసులు కౌన్సెలింగ్ పేరుతో కాలయాపన చేశారు. పెళ్లి జరిగి శనివారానికి ఏడాదైంది. అప్పుడే తామిద్దరి మధ్య అంతులేని దూరం రావడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని సూసైడ్ నోట్ రాసింది. పోలీసులను కూడా అత్తింటి వారు కొనేసారని నోట్లో పేర్కొంది. బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ ఆరేళ్లు ప్రేమించుకున్న అనంతరం గతేడాది మార్చి 25న పెళ్లి చేసుకున్నారు. ఏఎండీ క్వార్టర్స్‌లో కాపురం పెట్టారు. ఆరు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తన అత్తింటి వారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. శనివారం ఆ దంపతుల మొదటి మ్యారేజ్ డే. మానసికంగా కుంగిపోయిన భాగ్యలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. అత్తింటి వేధింపులతోనే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు. మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాచావుకు కారణం భర్త శశి, మంజుల, భాస్కర్, రమణి మానసికంగా హింసించారు. భర్త నామాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నాశవాన్ని నావస్తువులను శశి ఫ్యామిలీని ముట్టుకోనీయొద్దు. బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు. వాళ్లని నమ్మొద్దు... ప్లీజ్ అమ్మాయిలు జాగ్రత్త మోసపోకండి. సారీ మమ్మి, డాడి, శివ అని రాసి పెట్టింది. -
ఇంట్లో ఎందరున్నా ‘కల్యాణ లక్ష్మి’
• అసెంబ్లీలో మంత్రి జగదీశ్‌రెడ్డి • లబ్ధిదారులకు వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయం సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని విద్యుత్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఒక ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా అందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ, బీజేపీ పక్షనేత జి.కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కల్యాణలక్ష్మి పథకం తెచ్చేందుకు కారణమైన ఉదంతాన్ని మంత్రి ఈ సందర్భంగా సభకు వివరించారు. ‘‘చెత్తకుండీ వద్ద పసికందును పందులు పీక్కుతిన్నాయన్న వార్తను పత్రికల్లో చదివి ముఖ్య మంత్రి చలించిపోయారు. దీనిపై అధికా రులతో రోజంతా చర్చించారు. ఆడపిల్లలను గర్భంలోనే ఎందుకు తీసేస్తున్నారన్న దానిపై సమీక్షించారు. ఆడపిల్లల పెళ్లిళ్లు భారం అవుతాయన్న కారణంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గుర్తించారు. ఆడపిల్లల వివాహాలు మనమే చేద్దామని నిర్ణయించి పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి కల్యాణలక్ష్మి పేరు పెట్టింది మంత్రి కేటీఆర్..’’ అని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 81 వేలకుపైగా అర్హులకు లబ్ధి చేకూరిందని, పెండింగ్‌లో ఏవైనా దరఖాస్తులు ఉంటే నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఆర్యస మాజ్లో వివాహం చేసుకున్న వారికి కళ్యాణలక్ష్మి వర్తింప జేయాలని టీడీసీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కోరగా.. పెళ్లి ఎక్కడ చేసుకు న్నా ఆధారాలు చూపితే పథకం వర్తిస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... స్పీకర్, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గాల్లో తక్కువ మంది లబ్ధిదారులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై అధికార పక్షం నేతలు స్పందిస్తూ.. అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదని సమాధానం రావడంతో అంతా నవ్వుకున్నారు. -
పెళ్లి రోజునే చేతికి సంకెళ్లు
యువతిపై బలాత్కారం కేసులో అరెస్ట్ తిరువొత్తియూరు: విద్యార్థినిపై బలాత్కారం చేసిన కేసులో వివాహమైన కొద్ది గంటలకే వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుమరి జిల్లా తక్కలై ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి నాగర్‌కోవిల్‌లోని కళాశాలలో చదువుతోంది. ఈమెతో పరిచయం ఏర్పరచుకున్న కులిందురై ప్రాంతానికి చెందిన సురేష్ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. ఇతని మిత్రులు కోవిల్‌కు చెందిన గోపాల్ (47), అరుగువిలైకు చెందిన దినేష్ (25), వాత్తియార్విలైకు చెందిన జ్ఞాన ప్రభు సైతం బలాత్కారానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడచేరి పోలీసులు విచారణ జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జ్ఞానప్రభు మదురై హైకోర్టు శాఖలో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశాడు. అందులో నవంబర్ 4న తన వివాహం జరిగే వరకు అరెస్టు నిలుపుదల చేయాలని పిటీషన్లో కోరాడు. పిటీషన్ పరిశీలించిన న్యాయమూర్తులు వివాహం జరిగే వరకు అరెస్ట్ చేయరాదని పోలీసులను ఆదేశించారు. దీంతో వివాహం జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు అతన్ని నాగర్‌కోవిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో మండపంలోని వారు అవాక్కయ్యారు. జ్ఞానప్రభును శనివారం కోర్టులో హాజరుపరిచారు.