పెళ్లి రోజు నాడే ఓ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
వేములవాడ: పెళ్లి రోజు నాడే ఓ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపులకు మహిళ బలైన సంఘటన వేములవాడ మండలం సత్రాజ్‌పల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవికుమార్‌కు ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (2016 ఆగష్టు 19)న గుడిసె అశ్విని(26)తో వివాహమైంది.
కాగా.. పెళ్లైనప్పటినుంచి అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన అశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది.