మృతి చెందిన సౌజన్య ,( ఎస్‌ఐ దంపతులు (ఫైల్)
రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ ఎస్‌ఐ మహేశ్‌నాయుడు భార్య సౌజన్య (26) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసుస్టేషన్ ఎదురు వీధిలో వీరు నివాసం ఉంటున్నారు. సౌజన్యది నెల్లూరు జిల్లా కావలి కాగా, ఎస్‌ఐది చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలోని వరదయ్యగారిపాళెం. ఐదేళ్ల కిత్రం వీరికి వివాహమైంది. వీరికి పూర్ణేష్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. ఎస్‌ఐ ఏడాదిన్నర క్రితం మన్నూరు స్టేషన్‌కు బదిలీ అయ్యారు. భార్యభర్త ఇక్కడే ఉంటున్నారు. కాగా ఎస్‌ఐ ఉదయం నుంచి ప్రత్యేకహోదా బంద్‌లో విధులు నిర్వర్తించారు. సాయంకాలం ఊటుకూరు గ్రామసభలో విధులు నిర్వర్తించే క్రమంలో ఎస్‌ఐ వెళ్లిపోయారు. పోతూ పోతూ తన బిడ్డను పోలీసుస్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌కు అప్పగించి వెళ్లినట్లు సమాచారం.
పిల్లవాడిని చూసుకుంటుండాలి.. విధులు ముగించుకొని వచ్చేటప్పుడు తీసుకెళతానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇతను విధుల్లో ఉండగానే ఇంటికి రావాలని భార్య నుంచి ఫోన్‌కాల్ రాగా.. తాను గ్రామసభలో ఉన్నానని.. ఆ తర్వాత వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈలోగా పిల్లవ్లాడిని ఓ కానిస్టేబుల్ ఇంటి వద్దకు తీసుకెళ్లి చూడగా, తలుపు వేసి ఉందని వెనక్కి వచ్చి ఎస్‌ఐకి సమాచారం ఇచ్చారు. అయితే మరో కానిస్టేబుల్ మళ్లీ ఇంటికి వద్దకు వెళ్లి బలవంతంగా తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూడగా ఎస్‌ఐ భార్య ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేçసుకోవడాన్ని గమనించారు. వెంటనే ఎస్‌ఐకు సమాచారం అందచేశారు. హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకుని, భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు.
మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ
మన్నూరు ఎస్‌ఐ భార్య ఆత్మహత్య సంఘటన పోలీసువర్గాలను కలవరపాటుకు గురిచేసింది. సంఘటన స్ధలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారని పలువురు పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కేసు విషయంపై పరిశీలిస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ యుగంధర్, ఎస్‌ఐ రాజగోపాల్(టౌన్), రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నరసింహులు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment