Rajampeta
-
టీడీపీ అభ్యర్ధి సైలెంట్.. అన్ని సర్దుకుని సొంత నియోజకవర్గానికి పరార్
పోలింగ్‌కు ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీమే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కాని బయటి నుంచి వచ్చి సవాళ్ళు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కుడుంది? అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకువచ్చారు.వాస్తవానికి బాలసుబ్రమణ్యాన్ని టీడీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు అయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బిజేపికి ఇవ్వగా..అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ బరిలో దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా...ఆందోళనలు కూడా చేశారు. ఓ వైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైనా బాలసుబ్రమణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు అయనకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అయినా బాలసుబ్రమణ్యం మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుకుంతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామనే అలవికానీ హామీలతో రాజంపేట వాసులను అకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజంపేటకు తీసుకువచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టిడిపి జెండా ఎగరేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైఎస్సార్సీపీ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రమణ్యం అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచెయ్యలేదని.. బిజేపితో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తొంది. పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో.. ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడకుండా తన అన్నీ సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తామన్న అయన ఇప్పుడు సైలెంటయ్యారు. కానీ తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం కాన్ఫిడెంట్గ ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్ధికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అయిందని ధీమాగా చెబుతున్నారు. -
మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు
-
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
-
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్‌ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్‌తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్‌లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్‌మోహన్‌రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
గత ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాజంపేట: గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పత్తిపాటి కుసుమకుమారి భర్త పత్తిపాటి సుబ్రమణ్యంనాయుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున విషద్రావణం తీసుకున్న తరుణంలో సంబంధీకులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!
అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది. 18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాలిబాట స్వరూపం.. ► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. ► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. ► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. ► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలిబాటకు వెయ్యేళ్లు... రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు. – చొప్పా ఎల్లారెడ్డి, వైస్‌చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు. – పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి,రాజంపేట: వైఎస్సార్సీపీకి కార్యకర్తలు, నాయకులే మూలస్తంభాలని రాజంపేట ఎంపీ, లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం తోట కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తలే కీలక సూత్రధారులన్నారు. కార్యకర్తలకు వెన్నంటే ఉంటామన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో తనతోపాటు ముందంజలో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. రాజంపేట అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని, త్వరలో తాను, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్ సీఎంను కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలో తొంభై ఐదుశాతానికి పైగా అమలు చేసిన సీఎం జగన్‌కు, ఎన్నికల అనంతరం మేనిఫెస్టోను ఆన్లైన్లో తొలగించిన చంద్రబాబుకు పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైఎస్సార్సీపీకే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. టీడీపీకి దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా మద్దతు ఉంటే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్సీపీ జెండా కిందనే జీవిద్దామని కార్యకర్తలకు, నాయకులకు గడికోట పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతోనే జెండా రెపరెపలు రైల్వేకోడూరు అర్బన్: కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, నాయకుల కష్టంతోనే వైఎస్సార్సీపీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి పార్టీ జెండా రెపరెపలాడుతోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. వారి కష్టాన్ని పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
11 ఏళ్ల రాజం పేట మున్సిపాలిటీ ఎన్నికలు
-
వైరల్: నలుగురిని కాపాడిన యాచకుడు
నందలూరు (రాజంపేట): ఈతకు వెళ్లి నీటి గుంతలో కూరుకుపోయిన ఐదుగురిలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురిని ఒక యాచకుడు కాపాడాడు. ఈ ఘటన చెయ్యేటి రైల్వే వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. చెయ్యేటి గ్రామమైన కుమ్మరపల్లె (నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధి)కు చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. ఇసుక కోసం గోతులు తీయడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షానికి భారీగా నీరు చేరింది. ఈ గుంతల్లో ఈత కొడుతూ ఐదుగురూ లోపలకు కూరుకుపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన ఒక యాచకుడు గుంతలోకి దిగి నలుగురిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఆదిత్య (16) బయటకు రాలేక మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థి తండ్రి రమేశ్ గతంలోనే చనిపోయాడు. ఒకగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శైలజ రోదించడం అందరినీ కలచివేసింది. -
ట్రేడింగ్‌లో మోసాలకు పాల్పడిన ముగ్గురికి రిమాండ్
సాక్షి, వైఎస్సార్ కడప: ఆన్లైన్ ట్రేడింగ్‌లో 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కానీస్టెబుల్ ఈశ్వర్ మోసపోవడంతో రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అధిక లాభాలు గడించవచ్చనే ఆశతో కానిస్టేబుల్ ఈశ్వర్ అప్పు చేసిన ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. దీంతో పీటీ వారెంటుతో నిందితులను పోలీసులు హైదరాబాద్ నుంచి రాజంపేటకు తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకరూ చైనా దేశస్థుడు కాగా మరో ఇద్దరూ ఇండియాకు చెందిన హర్యానా వాసులుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం నందలూరు జేఎఫ్ఎం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. -
చీటింగ్ కేసులో టీడీపీ నేత హరిప్రసాద్ అరెస్ట్
రాజంపేట, రాయచోటి: అటాచ్‌లో ఉన్న సొసైటీ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన కేసులో వైఎస్సార్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రాజంపేట సీఐ శుభకుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనగలూరు మండలం కంబాలకుంటకు చెందిన వెంకటసుబ్బయ్య 2001లో శ్రీసాయి ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాడు. చార్మినార్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో వెంకటసుబ్బయ్య జైలుకు వెళ్లిన సమయంలో రాజంపేటలో అటాచ్‌లో ఉన్న ఐదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా హరిప్రసాద్ విక్రయించాడు. మూర్తి, శంకర్‌నాయుడు, జోహార్ చౌదరి అతడికి సహకరించారు. వెంకటసుబ్బయ్య ఈనెల 1న దీనిపై రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నిందితుడు హరిప్రసాద్‌ను ఆదివారం దేవుని కడపలో అరెస్టు చేసి రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్‌జైలుకు తరలించారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడు హరిప్రసాద్ తన భూములను ఆక్రమించడమే కాకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు వెంకటసుబ్బయ్య ఆదివారం రాయచోటిలో మీడియాతో పేర్కొన్నాడు. చార్మినార్ బ్యాంకులో రుణం విషయంలో తనను అరెస్టు చేయడంతో సొసైటీ తాత్కాలిక సెక్రటరీగా హరిప్రసాద్‌ను నియమించానన్నారు. ఇదే అదనుగా రాజంపేటలో భూమిని నకిలీ పేర్లతో విక్రయించినట్లు పేర్కొన్నాడు. -
ఆర్సీ రెడ్డి విజయగాథ
ఆయన సివిల్ సర్వీసుకు ఎంపిక కాలేదు. కష్టపడి మూడు పర్యాయాలూ ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఆ వైఫల్యం నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఏ రంగంలో విఫలమయ్యారో అదే రంగంలో విజయముద్ర వేసుకున్నారు. ఎందరో సివిల్ సర్వీసుకు ఎంపిక కావడానికి కారణమయ్యారు. విజయబాట వేశారు. కాదు..విజయబావుటా ఎగురవేశారు..ఆయనే ఏడు పదులు దాటిన ఆర్సీ రెడ్డి..స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత విశేషాలు ఒకసారి పరికిద్దామా.. రాజంపేట: వైఎస్సార్ జిల్లా నందలూరు మండలంలోని ఓ మారు పల్లె. పేరు ఈదరపల్లె.. ఆ ఊరికి సర్పంచ్‌గా పనిచేసిన భూమన మల్లారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి(ఆర్సీ రెడ్డి). ఆ ఊరిలోనే ప్రాథమిక విద్య చదివారు. తర్వాత రాజంపేట మండలం గుండూర్లు వెళ్లి కొంతకాలం చదివారు. నందలూరులోని జిల్లా ప్రజాపరిషత్ స్కూలులో స్ఎల్ఎల్సీ (ఇప్పటి టెన్తు క్లాస్) ఉత్తీర్ణులయ్యారు. సైన్స్‌మీద మక్కువతో కడప వెళ్లి ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ప్రతి క్లాసులోనూ మంచి మార్కులే వచ్చేవి. ఆయన ఆటల్లోనూ దిట్ట. ఎస్వీ యూనివర్శిటీలో హకీ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించారు. చదువుతున్నప్పటి నుంచి ఉన్నత స్థానం చేరుకోవాలని ఆర్సీ రెడ్డి అభిలషించేవారు. ముఖ్యంగా ఐఏఎస్ కావాలని ఎక్కువగా పరితపించేవారు. ఇదే ఆకాంక్షను తన తల్లిదండ్రులు మల్లారెడ్డి..భవానమ్మల వద్ద వ్యక్తంచేశారు. వారు కూడా వెంటనే వెన్నుతట్టి ప్రోత్సహించారు. వెంటనే ఆర్సీ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రావూస్ స్టడీ సర్కిల్లో చేరారు. కష్టపడి చదివారు. సివిల్ సర్వీసు పరీక్ష మూడు సార్లు రాశారు. ఈ మూడు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో కుంగుబాటు..నిరాశలను దరిచేరనీయకుండా తనకున్న ఆంగ్ల పరిజ్జానంతో కొద్దికాలం ఇంగ్లీషు మ్యాగ్జైన్లో జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేశారు. తాను ఢిల్లీలో శిక్షణ పొందిన రావూస్ ప్రొద్బలంలో హైదరాబాద్‌లోని అదే శిక్షణా సంస్థ శాఖకు ఎండీగా పనిచేశారు. బలమైన సంకల్పంతో.. రావూస్‌లో చేస్తున్నా ఆయన మస్తిష్కంలో సివిల్ సర్వీసెస్ ఆలోచన నిరంతరం వెంటాడేది. పల్లె నేపథ్యంలో తనలాగే వచ్చిన వారికి తర్ఫీదునిస్తే కొందరయినా సివిల్స్‌కు ఎంపికవుతారని భావించేవారు. మట్టిలో మాణిక్యాలను తవ్వి తీయాలని బలమైన సంకల్పం తీసుకున్నారు. తనకున్న అనుభవసారంతో సివిల్ సర్వీస్‌కు వెళ్లే అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలనుకున్నారు. 1985లో సాహసంతో ఓ ముందడుగు వేశారు. హైదరాబాద్‌లో స్వయంగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ పేరుతో చిన్నగా సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనతోపాటు మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేసుకున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆసంస్థకు పేరు వచ్చింది. ఏటా సివిల్ సర్వీస్ ఫలితాల్లో కొందరు విజేతలవడం ప్రారంభమైంది. దీంతో ఆర్సీ రెడ్డికి విశేష ఖ్యాతి లభించింది. ఆయన వద్ద కోచింగ్ తీసుకుని సివిల్ సర్వీసుకు ఎంపికైన ప్రముఖుల్లో ఏకెఖాన్, తేజ్‌దీప్ ప్రతిహస్త, ద్వారకతిరుమలరావు, రాజేందర్‌రెడ్డి తోపాటు ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌లుగా ఉన్న కృష్ణబాబు, ధనుంజయరెడ్డి లాంటి వారున్నారు. 2001లో ఇండియా టాపర్ సత్యప్రకాశ్(రాజంపేట) ఆర్సీరెడ్డి మార్గదర్శకంలోనే శిక్షణ పొందడం విశేషం. ఇలా సివిల్ సర్వీసుకు ఎంపికైన వారిని తయారు చేసే ఆర్సీరెడ్డి తమ ప్రాంతానికి చెందిన వారేనని ఇక్కడి వారు ఆనందపడుతుంటారు. నందలూరుకు చెందిన ఇద్దరు ఇప్పటివరకూ సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారంటే ఆయన ప్రేరణే. గడచిన మూడు దశాబ్ధాలలో ఈ సంస్థలో తర్ఫీదు పొంది 135 మంది ఐఏఎస్, 23 మంది ఐఎఫ్ఎస్, 142 ఐపీఎస్, 643 మంది సెంట్రల్ సర్వీసెస్‌లకు ఎంపికైనట్లు సంస్థ వర్గాలు చెప్పాయి. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 14మంది విజేతలుగా నిలిచారు. ఆర్సీ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. అమెరికాలో ఉంటున్నారు. భార్య విద్యావేత్తగా పనిచేసి రిటైరయ్యారు. ఆర్సీ రెడ్డి తమకు స్ఫూర్తి అని రాజంపేట పరిసర ప్రాంత యువకులు చెబుతుంటారు. ఆయన ఇక్కడి కార్యక్రమాలకు హాజరై అందరినీ పలకరించి వెళ్తుంటారు. సానపడితే వజ్రాలే.. పల్లెటూళ్ల నుంచి వచ్చారని తక్కువ అంచనా వేయకూడదు. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. వారిని గుర్తించి సానబడితే వజ్రాలవుతారు. ఐక్యూ గుర్తించి, సరైన మార్గంలో తర్ఫీదు ఇస్తే వారు తప్పకుండా సివిల్స్ లాంటి రంగాల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరంభంలోనే మెరుగైన రీతిలో సాధన పెట్టాలి. అప్పుడే మంచి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. నేను సివిల్స్‌కు ఎంపిక కాలేకపోయినా ఇదే భావనతో సివిల్స్.. గ్రూప్‌వన్ సర్వీసులకు కొంతమందిని అందించగలుగుతున్నాను. ఇది పూర్వజన్మసుకృతంగా భావిస్తుంటాను. – భూమన రామచంద్రారెడ్డి -
మళ్లీ రాజంపేటకు ఐఏఎస్ అధికారి !
రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ తర్వాత సబ్ కలెక్టరేట్ ఉంది. ఇక్కడికి మళ్లీ ఐఏఎస్ క్యాడర్ కలిగిన అధికారి కేతన్‌గర్గ్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటిష్ పాలకుల నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్‌కు సబ్‌కలెక్టరుగా ఐఏఎస్‌ల నేతృత్వంలో రెవెన్యూ పాలన కొనసాగింది. 24 మంది సబ్‌కలెక్టరుగా ఇక్కడ పనిచేశారు. చివరిగా సబ్‌కలెక్టరుగా ప్రీతిమీనా పనిచేసి వెళ్లారు. అప్పటి నుంచి ఐఎఎస్ హోదా కలిగిన వారిని ఇక్కడ సబ్‌కలెక్టరుగా అప్పటి ప్రభుత్వం నియమించలేదు. తర్వాత ఆర్టీవోలుగా విజయసునీత, ప్రభాకర్పిళ్లై, వీరబ్రహ్మం, నాగన్నలు పనిచేశారు. ప్రస్తుతం ధర్మచంద్రారెడ్డిలు ఆర్డీవో కొనసాగారు. వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో మళ్లీ రాజంపేటకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారిని నియమించడం విశేషం. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేతన్‌గర్గ్ విజయనగరంలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. -
ముద్దనూరు–ముదిగుబ్బ లైనుపై ఆశలు
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాలు రైలుకూతకు దూరంగా ఉన్నాయి. ఈ మార్గాల మీదుగా రైలు మార్గాలేవీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో రైలు కూత వినిపించడంలేదు. జిల్లాలో రైల్వేపరంగా అభివృద్ధికి ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు కృషి చేస్తున్నారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ రాయచోటి, ఇటు పులివెందుల నియోజకవర్గ పరిధిలో వెళుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు రైల్వే సేవలు అందే అవకాశముంది. తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బలైను తెర మీదకు వచ్చింది. దీంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు రేకేత్తించాయి. 65కిలోమీటర్ల రైల్వేలైన్.. ముదిగుబ్బ రైల్వేస్టేషన్ గుంతకల్–బెంగళూరు రైలు మార్గంలో ఉంది. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో ఈ లైనుకు రైల్వేశాఖ సర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు 65 కిలోమీటర్ల దూరం ఉంది. ముద్దనూరు–ముదిగుబ్బ కొత రైల్వే లైన్ సర్వేకి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ లైను సర్వే ఏ దిశగా ఉంటుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రకటించిన కొత్తరైల్వేలైన్ల సర్వేలా ఉండిపోతుందా.. ముందుకు వెళుతుందా అనేది వేచిచూడాల్సిందే. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా కదిరి మార్గంలో ముదిగుబ్బ వరకు వెళ్లే విధంగా అలైన్మెంట్ చేస్తారా..లేక పులివెందుల సమీప ప్రాంతం నుంచి వెళ్లే విధంగా అలైన్మెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలైన్మెంట్ స్పష్టమైతే పులివెందుల మీదుగా అయితే అక్కడి వాసులు రాబోయే రోజుల్లో రైలుకూత వినవచ్చు. బడ్జెట్లో కొత్త లైను సర్వేకి నామమాత్రంగా నిధులు కేటాయిచారని విమర్శ ఉంది. ఈ లైనును త్వరిగతిన రాబట్టుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు రైలు కూత వినిపిస్తుంది. -
రాజంపేటలో రోడ్డు ప్రమాదం; చిన్నారి మృతి
సాక్షి, వైఎస్సార్ కడప : రాజంపేట మండలం చొప్పావారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలను దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బొలెరో వాహనాన్ని బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో 12 మంది ప్రయాణిస్తుండగా యాదాద్రి భువనగిరికి చెందిన చిన్నారి చందన(10) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన 11 మందిని తిరుపతి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి దగ్గరుండి వివరాలు సేకరిస్తున్నారు. -
‘ఘాట్’ గా స్పందనేదీ..?
సాక్షి, రాజంపేట: అదిగో అల్లదిగో అంటూ శ్రీవారిని స్మరిస్తూ .. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితా పితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట ఇది. మూడవ ఘాట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా తెరపైకి వచ్చినా నాటి ప్రభుత్వాలు, టీటీడీ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ బాట అభివృద్ధి అటకెక్కింది. శ్రీ వేంకటేశ్వరస్వామిపై 32వేల సంకీర్తనార్చనలు చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన మార్గాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని విస్మరిస్తూ వస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దారిలో తిరుమలకు నడిచి వెళుతున్న భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. మార్గం తీరు ఇలా.. కడప–రేణిగుంట జాతీయర రహదారిలో కుక్కలదొడ్డి నుంచి తుంబరతీర్థం మీదుగా తిరుమలకు అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొండకు వెళ్లేందుకు మూడురోజులు పడుతుంది. కుక్కలదొడి సమీపంలోని మామండూరు మీదుగా అటవీ మార్గం నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొంచెం అటు ఇటుగా తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులుతిరుమలకు చేరుకుంటున్నారు. ఒక్క రాజంపేట ప్రాంతంలో నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం అనుకూలం. కొండపైన అన్నమయ్య పార్వేట మండపం వద్ద పాపవినాశనం రోడ్డులో దగ్గరలో ఈ దారి కలుస్తుంది. కాలిబాటలో పాడుబడిన సత్రం శేషాచలం అటవీ ప్రాంతంలో.. అన్నమయ్య కాలిబాట పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతంలో సాగుతుంది. ప్రకృతి రమణీయ, కమనీయ దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ మార్గంలో రోడ్డు వేస్తే తిరుమలకు చేరుకునే భక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులున్నాయి. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధిచేస్తే తిరుమలకు రానుపోను 44 నుంచి 48 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇప్పుడున్న మార్గం ద్వారా 51కిలోమీటర్ల దూరం పడుతోంది. అదే మామండూరు నుంచి తిరుమల మార్గంలో అయితే 23 కిలోమీటర్లే అవుతుంది. దశాబ్ధాలుగా అతీగతీలేదు అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధిని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కుక్కల దొడి లేదా మామండూరు నుంచి తిరుమలకుమార్గం వేస్తే తిరుపతి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన చిత్తూరు జిల్లా వాసుల్లో నెలకొంది. తిరుమల దగ్గర అంశాన్ని అటవీ సంరక్షణ పేరుతో అడ్డుకుంటున్నటులగా ఆరోపణలున్నాయి. అందువల్లే అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయంలోపూర్తి నిర్లక్ష్యవైఖరి కనిపిస్తోంది. కాలిబాట స్వరూపం మామండూరు–బాలపల్లె మధ్య స్వామి పాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతవరణంతో పూర్వం భక్తులు కాలిబాట కొండకు చేరుకుంటుంది. అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటల, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 17వ సారి ఆకేపాటి తిరుమల మహాపాదయాత్ర వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తిరుమల మహాపాదయాత్రను 17వ సారి చేపట్టనున్నారు. ఈనెల 13న శుక్రవారం వేలాది మందితో తిరుమల పాదయాత్ర ప్రారంభించనున్నారు. అదేరోజున ఆకేపాడు లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు. కంకణధారణ, హోమం, భజనలు, అన్నదాన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఆకేపాడు ఆలయాల సముదాయం నుంచి మధ్యాహ్నం 2గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేషనల్హైవే మీదుగా రాజంపేట, రైల్వేకోడూరుకు చేరుకొని అక్కడి నుంచి అటవీమార్గం(మామండూరు)లో తిరుమల చేరుతుంది. గోవిందమాలలు ధరంచి తిరుమలకు కాలిబాటన వెళుతున్న భక్తులు(ఫైల్) అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలి అన్నమయ్య నడిచివెళ్లి శ్రీవారిని దర్శించుకున్న కాలిబాటను పునరుద్ధరించాలని భక్తులతోపాటు తాను దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నాం. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఈ కాలిబాట అభివృద్ధికి బీజం పడింది. అయితే ఆయన మరణాంతరం కాలిబాట అభివృద్ధి అంశం అటకెక్కింది. 17వసారి పాదయాత్రగా ఈ మార్గం గుండా తిరుమల వెళుతున్నాను. భక్తులు పాల్గొని పాదయాత్రను జయప్రదంచేయాలి. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట అన్నమయ్య బాటలో వెళ్లడం మహాభాగ్యం పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే మూడవ ఘాట్‌గా ఉపయోగపడుతుంది. తెలంగాణ, సీమవాసులకు దగ్గరగా ఉంటుంది. ఈ మార్గం అభివృద్ధిపై ఆకేపాటితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు డైరెక్టర్ అటవీప్రాంతం: శేషాచలం తొలినడక:అన్నమాచార్యుడు చరిత్ర: వెయ్యేళ్లు దూరం: 23 కిలోమీటర్లు కాలిబాట ప్రారంభం: మామండూరు–బాలపల్లె మధ్య -
ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి
పుల్లంపేట: ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణంలో నివసించే కొండపల్లి కృష్ణమూర్తి, గౌరి దంపతులు తమ కుమార్తె లక్ష్మీప్రసన్నను పుల్లంపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. అక్కడ సైన్సు ఉపాధ్యాయుడు శివ తనను చదువు విషయమై తరచూ వేధిస్తున్నాడని లక్ష్మీప్రసన్న పలుమార్లు తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కుమార్తెను ఓదార్చేందుకు విద్యార్థిని తల్లి గౌరి మంగళవారం సాయంత్రం పాఠశాల వద్దకు వచ్చింది. సిబ్బంది అనుమతించకపోవడంతో వెలుపల వేచి ఉంది. పాఠశాల విడిచిపెట్టాక లక్ష్మీప్రసన్నను హస్టల్‌కు తీసుకెళ్లింది. దుస్తులు మార్చుకుంటానని గది లోపలికి వెళ్లిన లక్ష్మీప్రసన్న చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ముఠా అరెస్టు
సాక్షి, రాజంపేట: చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ఫోన్‌కాల్స్ ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ వీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ బి. శుభకుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఫోన్‌కాల్ నిర్వహిస్తున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్దనున్న రూ. లక్షల్లో విలువజేసే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫ్రొటోకాల్ టెలికమ్యూనికేషన్ సామగ్రి, కంప్యూటర్లను, అలాగే దాదాపు 500కుపైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. పట్టణ బీఎస్ఎన్ఎల్ జేఈ ప్రసాద్ ఫిర్యాదు మేరకు అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ముఠాపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ తదితర పరికరాలు రెడ్డివారి వీధిలో నిర్వహించే ఈ ముఠా నెలకు రూ. 10లక్షలు మేరా ఆదాయం ఆర్జీస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన సయ్యద్ మహ్మద్ షరీఫ్ అలియాస్ మున్నా, పోలికి చెందిన గుండ్రాజు సుదర్శన్ రాజు, రాజశేఖర్ నాయుడు అలియాస్ నాయుడులను అదుపులోకి తీకున్నామన్నారు. ప్రధాన సూత్రధారి రెడ్డివారి వీధికి చెందిన లక్ష్మీనారాయణ కువైట్‌లో ఉన్నాడన్నారు. వీరి వద్ద నుంచి అతడు లింక్ తీసుకొని అక్కడ నుంచి కువైట్, ఇండియా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలకు నిమిషానికి రూ.32 అయ్యే కాల్ని రూ. 6 లకే అందిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్రమమార్గంలో టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో పట్టణ పోలీసులు పాల్గొన్నారు. చదవండి : స్మార్ట్ దోపిడీ -
అరుదైన గౌరవం
సాక్షి, కడప : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం స్పీకర్ స్థానంలో కొలువుదీరారు. ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభను నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభను నిర్వహించడం సాంప్రదాయం. ఈక్రమంలో ప్యానల్ స్పీకర్‌గా అధ్యక్ష స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ప్యానల్ స్పీకర్ అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకుడు భారత అత్యున్నత చట్టసభకు స్పీకర్‌గా విధులు నిర్వహించడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎంపీగా లోక్‌సభలో ప్రభుత్వతీరును ఎండగట్టి నేడు అదే లోక్‌సభలో చిన్న వయసులోనే ప్యానెల్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడం నిజంగా గర్వకారణమని అంటున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంచెలంచెలుగా ఉద్యమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నిర్ణయం మేరకు పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం 2019లో మరోమారు ఆయన రాజంపేట నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లు ఆధిక్యతతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్యానల్ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆమేరకు గురువారం ఆ హోదాలో లోక్‌సభ నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిపారు. -
ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహించిన మిథున్‌రెడ్డి
-
లోక్‌సభ నిర్వహిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన.. గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులైన విషయం విదితమే. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించిన ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.