ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి | One killed in a collision between the two | Sakshi
Sakshi News home page

ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

Published Fri, Nov 25 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య  ఘర్షణ చోటు చేసుకోగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలోని రంగంపేటకు చెందిన గుర్రప్ప(32)జీవనోపాధి కోసం వచ్చి రాజంపేటలో నివసిస్తున్నారు. గాలివీడుక చెందిన శేఖర్, గుర్రప్ప మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో గుర్రప్ప మృతి చెందాడు. ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడినట్లు సమాచారం. తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించావని శేఖర్‌.. గుర్రప్పతో వాదనకు దిగడంతోనే ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. రాయితో కొట్టడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.  పట్టణ ఎస్‌ఐ రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement