పోలింగ్‌కు ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీమే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కాని బయటి నుంచి వచ్చి సవాళ్ళు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కుడుంది?
అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే దొరకలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకువచ్చారు.
వాస్తవానికి బాలసుబ్రమణ్యాన్ని టీడీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు అయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బిజేపికి ఇవ్వగా..అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ బరిలో దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా...ఆందోళనలు కూడా చేశారు.
ఓ వైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైనా బాలసుబ్రమణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు అయనకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అయినా బాలసుబ్రమణ్యం మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుకుంతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామనే అలవికానీ హామీలతో రాజంపేట వాసులను అకట్టుకునే ప్రయత్నం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజంపేటకు తీసుకువచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టిడిపి జెండా ఎగరేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైఎస్సార్‌సీపీ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రమణ్యం అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచెయ్యలేదని.. బిజేపితో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తొంది.
పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో.. ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడకుండా తన అన్నీ సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తామన్న అయన ఇప్పుడు సైలెంటయ్యారు. కానీ తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ మాత్రం కాన్ఫిడెంట్‌గ ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్ధికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపొందడం, వైఎస్‌ఆర్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అయిందని ధీమాగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment