తాడేపల్లి: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు.
‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment