వైఎస్‌ జగన్‌ ఓడిపోవడమేంటి?: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు | KTR Key Comments On YSRCP Defeat In Andhra Pradesh Elections 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

‘సంక్షేమం’ అందించిన వైఎస్‌ జగన్‌ ఓడిపోవడమేంటి?: కేటీఆర్‌

Published Tue, Jul 9 2024 1:22 PM | Last Updated on Tue, Jul 9 2024 1:44 PM

ktr key Comments On Ysrcp Defeat In Andhrapradesh

సాక్షి,ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక కామెంట్స్‌ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్‌జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైఎస్‌ఆర్‌సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం(జులై 9)  ఢిల్లీలో కేటీఆర్‌ మీడియా చిట్‌చాట్‌లో  ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పవన్‌కల్యాణ్‌ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. వైఎస్‌జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement