
సాక్షి, రాజంపేట: గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పత్తిపాటి కుసుమకుమారి భర్త పత్తిపాటి సుబ్రమణ్యంనాయుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గురువారం తెల్లవారుజామున విషద్రావణం తీసుకున్న తరుణంలో సంబంధీకులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.