Kusuma Kumari
-
గత ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాజంపేట: గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పత్తిపాటి కుసుమకుమారి భర్త పత్తిపాటి సుబ్రమణ్యంనాయుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున విషద్రావణం తీసుకున్న తరుణంలో సంబంధీకులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జనసేన అభ్యర్థికి చేదు అనుభవం
సాక్షి, రాజంపేట/వైఎస్సార్ జిల్లా : రాజంపేట జనసేన అసెంబ్లీ అభ్యర్థి కుసుమ కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల నేపథ్యంలో రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో కుసుమ కుమారి ఈ సమావేశానికి హాజరుకాగా.. కార్యకర్తలు ఆమెను అడ్డగించారు. ఇక్కడికి రావడానికి నీవెవరు అంటూ ఆమెను ప్రశ్నించారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ మలిశెట్టి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కుసుమ కుమారి అక్కడే ఉండటంతో కార్యకర్తలు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. కాగా వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడా మల్లికార్జున రెడ్డి పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
భార్యను చంపి.. మిస్సింగ్ కేసు పెట్టాడు..
కళాశాల నుంచి ఇంటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద ఎక్కించుకున్న భర్త నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెల్లి పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు తన భార్య కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త చెప్తున్న విషయాలు పొంతన కుదరకపోవడంతో.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. తానే భార్యను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హతమార్చి కంపచెట్లలో పడేశానని చెప్పడంతో.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం కమ్మరాయనిమిట్ట సమీపంలో ఆదివారం వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందిన కుసుమకుమారి(21)కి బెంగళూరులో నివాసముంటున్న జి. కేశవులు అనే యువకుడితో రెండు నెలల క్రితం వివాహమైంది. కుసుమకుమారి ప్రస్తుతం బీఈడీ చదువుతోంది. మూడు రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లిన కేశవులు బైక్‌పై ఎక్కించుకొని కమ్మరాయనిమిట్ట సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లి పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య కనబడటం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ.. విచారణలో భాగంగా భర్తను తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురిని హతమార్చాడాని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
తల్లి ప్రేమ గెలిచింది
విజయవాడ : పేగుతెంచుకుని పుట్టిన బిడ్డను ఇబ్బందుల కారణంగా ఓ అమ్మ విజయవాడలో వదిలేసింది. చిన్నారిని విడిచి ఉండలేక కొద్ది రోజుల్లోనే వదిలేసిన చోటనే వెదుక్కుంది. ఆ ప్రయత్నం ఫలించడంతో కుమార్తె మళ్లీ తల్లి ఒడికి చేరింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన హుస్సేన్‌బీకి ఇద్దరు కుమార్తెలు. మూడు నెలల చిన్న కుమార్తెకు పుట్టుకతోనే గుండెకు చిల్లు ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతుండేది. హుస్సేన్‌బీ భర్త బిందెలకు మాట్లు వేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో హుస్సేన్‌బీ కొద్ది రోజుల కిందట చిన్న కుమార్తెను విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఓ ఆస్పత్రి దగ్గర చెత్తకుండీ వద్ద వదిలివె ళ్లింది. కృష్ణలంక రాణీగారితోటకు చెందిన కుంభా కుసుమకుమారి అటుగా వెళ్తుండగా చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె పాపను తీసుకుని సమీపంలోని దుకాణదారులకు ఈ విషయం చెప్పి తన అడ్రస్ ఇచ్చింది. చిన్నారి కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే తన వద్దకు పంపాలని సూచించి బాలికను తీసుకుని వెళ్లిపోయింది. అనంతరం అనారోగ్యంతో బాధపడుతోందని గుర్తించి వైద్యులకు చూపించింది. కుమార్తెను వదిలి వెళ్లాక హుస్సేన్‌బీ మనశ్శాంతిగా ఉండలేకపోయింది. తన తల్లి నబీషాకు ఈ విషయం చెప్పింది. ఐదు రోజులు గడిచిన తరువాత హుస్సేన్‌బీ తల్లితో కలిసి నగరానికి వచ్చి కూతురిని వదిలేసిన చోట ఆరా తీసింది. స్థానిక దుకాణదారులు కుసుమకుమారి చిరునామా చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లారు. కుమార్తెను వదిలేయడానికి కారణం చెప్పి తనకు తిరిగి ఇవ్వవలసిందిగా కోరింది. దీంతో వారంతా బుధవారం రాత్రి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐకి అంతా వివరించారు. కుసుమకుమారి అంగీకారంతో ఆయన చిన్నారిని తల్లికి అప్పగించారు.