
సాక్షి, రాజంపేట/వైఎస్సార్ జిల్లా : రాజంపేట జనసేన అసెంబ్లీ అభ్యర్థి కుసుమ కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల నేపథ్యంలో రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో కుసుమ కుమారి ఈ సమావేశానికి హాజరుకాగా.. కార్యకర్తలు ఆమెను అడ్డగించారు. ఇక్కడికి రావడానికి నీవెవరు అంటూ ఆమెను ప్రశ్నించారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ మలిశెట్టి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కుసుమ కుమారి అక్కడే ఉండటంతో కార్యకర్తలు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.
కాగా వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడా మల్లికార్జున రెడ్డి పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment