rajam peta
-
రాజం పేటలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
ఎర్ర చందనం స్మగ్లింగ్.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
సాక్షి, కడప : రాజంపేట ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని రోల్లమడుగు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మూడు రోజుల పాటు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అధికారులకు తారసడ్డారు. ఫారెస్ట్ పోలీసులను చూసిన స్మగ్లర్లు అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక బీ టెక్ విద్యార్థి ఉండటం గమనార్హం. స్మగ్లింగ్ లాభసాటిగా ఉండటంతో చాలా మంది చదువుకున్న తమిళ యువత అడవుల బాట పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 10 గొడ్డళ్లు, రంపాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
జనసేన అభ్యర్థికి చేదు అనుభవం
సాక్షి, రాజంపేట/వైఎస్సార్ జిల్లా : రాజంపేట జనసేన అసెంబ్లీ అభ్యర్థి కుసుమ కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల నేపథ్యంలో రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో కుసుమ కుమారి ఈ సమావేశానికి హాజరుకాగా.. కార్యకర్తలు ఆమెను అడ్డగించారు. ఇక్కడికి రావడానికి నీవెవరు అంటూ ఆమెను ప్రశ్నించారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ మలిశెట్టి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కుసుమ కుమారి అక్కడే ఉండటంతో కార్యకర్తలు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. కాగా వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడా మల్లికార్జున రెడ్డి పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
కడప : రాజంపేట రాజకోట
సాక్షి, రాజంపేట: రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 1989 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్‌ను ఎంపీగా గెలిపించడంలో వైఎస్ కీలకపాత్ర పోషించారు. వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. నాడు వైఎస్ వెంట నడిచిన రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం.. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాసటగా నిలిచి రాజంపేటపై రాజన్న ముద్ర సుస్థిరం అని చాటి చెప్పారు. కడప సెవెన్‌రోడ్స్ : రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం ఇటు వైఎస్సార్, అటు చిత్తూరు జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు ఈ నియోజకవర్గ పరి«ధిలో ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలు రాజంపేట లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1896 పోలింగ్ కేంద్రాలు ఉండగా 14,69,575 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గ ఫలితాలను గమనిస్తే తొలినుంచి కాంగ్రెస్ హవా నడిచింది. 11సార్లు కాంగ్రెస్ విజయకేతనం ఎగురేసింది. దేశంలో ఎక్కడైనా జరిగాయో లేదో తెలియదుగానీ 1957లో తొలి ఎన్నికే కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ విశ్వనాథరెడ్డి ఏకగ్రీవం కావడం విశేషం. స్వతంత్ర అభ్యర్థిగా 1962లో సీఎల్ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా 1984లో సుగవాసి పాలకొండ్రాయుడు, 1999లో గునిపాటి రామయ్య మాత్రమే ఇప్పటివరకు ఎంపికయ్యారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మిథున్‌రెడ్డి 174762 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆయనకు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ రావడం విశేషం. రాజంపేట అసెంబ్లీలో 8648, రైల్వేకోడూరులో 9393, రాయచోటిలో 50036, తంబళ్లపల్లెలో 11554, పీలేరులో 33148, మదనపల్లెలో 12019, పుంగనూరులో 46009 ఓట్ల ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి అన్ని అసెంబ్లీల్లో మెజార్టీ వచ్చినా రాజంపేట, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మల్లికార్జునరెడ్డి, శంకర్‌యాదవ్ గెలుపొందారు. మిథున్‌రెడ్డికి మొత్తం 601752 ఓట్లు రాగా, టీడీపీ–బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి 426990 ఓట్లు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి జి.ముజీబ్ హుసేన్ డిపాజిట్ కోల్పొయినప్పటికీ 59,777 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ కేవలం 29,332 ఓట్లు సాధించి ధరావత్తు కోల్పోయారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి కులస్తులు మూడుసార్లు గెలుపొందగా, మిగతా అన్ని సార్లు బలిజ సామాజికవర్గం నేతలు ఎన్నికయ్యారు. -
ప్రజాసంకల్పప యాత్ర ౩౦౦ రోజు రాజంపేటలో కేక్ కట్ చేసిన నేతలు
-
దిగువ ఎడారే!
రాజంపేట: ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నీటి కొరత తీరుతుంది. పచ్చనిపొలాలు రైతన్న ఇంట సిరులు కురిపిస్తాయి... ఇదంతా నాణేనికి ఒకవైపే. ప్రాజెక్టు నిర్మాణంతో పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని.. మట్లిరాజుల కాలం నాటి ఊటకాల్వలు ఒట్టిపోయాయని రైతన్నల ఆవేదన మరో కోణం. ఇది చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని నందలూరు, పెనగలూరు మండలాలకు చెంది వేలాది మంది రైతుల పరిస్ధితి. అన్నమయ్య జలాశయం నిర్మితం సమయంలో ఎగువ, దిగువ ప్రాంతాలకు సమానంగా నీటి పంపిణీలో న్యాయం జరిగాలి. అయితే కేవలం ఎగువ ప్రాంత అవసరాలకే అన్నట్లు ఉంది. దిగువ ప్రాంతాల్లో నందలూరు, పెనగలూరు మండలాలున్నాయి. యేటిలో నీటి ప్రవాహంతో ఒకప్పుడు ఈ ప్రాంతంలో చక్కగా పంటలు పండేవి. ఇప్పుడు డ్యాం పుణ్యమా అని నిర్వీర్యమయ్యాయి. డ్యాం ఫుల్ అయితేనే.. జలాశయం నిండి విడుదల అరుుతే తప్ప దిగువ ప్రాంతానికి నీటి చుక్క రాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అయితే వేసవిలో దిగువకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దిగువ ప్రాంతానికి నందలూరు కెనాల్‌ను నిర్మిస్తేనే ప్రయోజనమని రైతులు కోరుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తమ కడుపు కొడుతోంద ని దిగువ రెతులు ఆవేదన చెందుతున్నారు. డ్యాం నిర్మాణం ఇలా.. మొదట తొగురుపేట వద్ద డ్యాంకు శంకుస్ధాపన శిలాఫలకం వేశారు. పలు రకాల కారణాలు చూపి ఆ తర్వాత బాదనగడ్డ వద్ద చెయ్యేరు ప్రాజెక్టు నిర్మాణానికి 1976లో అప్పటి సీఎం జలగంవెంగళరావు శంకుస్ధాపన చేశారు. నిర్మాణం ఆరంభమైన 27సంవత్సరాలకు పూర్తి అరుుంది. 2003లో అప్పటి భారీ నీటీపారుదలశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రాజెక్టు వల్ల రాజంపేట, పుల్లంపేట మండలాలు సస్యశ్యామలమయ్యాయి. భూగర్భజలాలు బాగా పెరిగి కరువును పారదోలింది. డ్యాం నిండి నీటి విడుదల అవకాశాలు లేకపోవడంతో దిగువ ప్రాంతం పరిస్థితి మాత్రం దయనీయంగా తయూరైంది. ఎడారిగా దిగువప్రాంతం.. దిగువ ప్రాంతాలైన నందలూరు, పెనగలూరు మండలాల్లోని రైతుల కష్టాలు చెప్పనలివికాదు. చెయ్యేరు నది ఎండిపోయి ఎడారిలా ఉంది. భూగర్భజలాల అడుగంటిపోయాయి. చరిత్ర కాలంలో ఈ రెండు మండలాల్లో రైతుల కోసం మట్టిరాజుల నిర్మించిన 23 ఊటకాల్వలు ఒట్టిపోయి వాటి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. 18వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోవడంలేదు. నందలూరు మండలంలోని పాటూరు, నాగిరెడ్డిపల్లె, నందలూరు, లేబాక తదితర ప్రాంతాల్లో చుక్కనీరు లేదు. చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. అన్నమయ్య డ్యామే కారణం. పెనగలూరు, నందలూరు మండలాలకు డ్యాం నిర్మాణం శాపంగా మారింది. కనీసం దిగువ ప్రాంతాల గురించి నిర్మాణ రోజుల్లో ప్రభుత్వం ఆలోచించలేదు. తోటంశెట్టి సురేష్, నారాయణనెల్లూరు, పెనగలూరు చెయ్యేరులో ఎప్పుడూ జలకళ ఉండేది చెయ్యేరులో ఒకప్పుడు జలకళతో ఉట్టిపడేది. ఇప్పుడు యేటిలో నీటి ప్రవాహం లేదు. ఇందుకు ఒక రకంగా అన్నమయ్య డ్యాం అనే చెప్పవచ్చు. డ్యాం నిర్మాణంలో దిగువ ప్రాంతాల గురించి ఆలోంచించి ఉంటే ఇప్పుడు యేరు కరువు పరిస్ధితులను అధిగమించేది.. భూమన శివశంకరరెడ్డి, మాజీ సర్పంచ్, నందలూరు చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాలి చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. డ్యాం నిర్మాణ సమయంలో దిగువ ప్రాంతానికి కెనాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డ్యాం నిర్మాణం వల్ల నందలూరు, పెనగలూరు మండలాలకు కరువు ఛాయలు అలుముకుంటన్నాయి. ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు రైతుల కష్టం గురించి ఆలోచించాలి. సీవీరవీంద్రరాజు, అధ్యక్షుడు, ధర్మప్రచారపరిషత్, నందలూరు -
రాజంపేట టీడీపీలో తారస్థాయికి చేరిన విభేదాలు
కడప: రాజంపేట నియోజకవర్గంలోని వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న మల్లిఖార్జున రెడ్డిపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. స్థానికంగా ఉంటూ ఎప్పుట్నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్న తమను పట్టించుకోవడం లేదంటూ నందలూరు తెలుగుతమ్ముళ్లు తిరుగుబాటుకు సిద్ధమైయ్యారు. బ్రహ్మయ్య వర్గీయులను ప్రక్కకు పెట్టిన మల్లిఖార్జున రెడ్డి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కొత్తగా పార్టీలో చేరిన వారికే బాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీలో చోటు చేసుకుంటున్న విభేదాలతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.