భార్యను చంపి.. మిస్సింగ్ కేసు పెట్టాడు.. | Husband kills wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపి.. మిస్సింగ్ కేసు పెట్టాడు..

Jan 31 2016 5:37 PM | Updated on May 10 2018 12:34 PM

కళాశాల నుంచి ఇంటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద ఎక్కించుకున్న భర్త నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెల్లి పురుగుల మందు తాగించి హత్య చేశాడు.

కళాశాల నుంచి ఇంటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద ఎక్కించుకున్న భర్త నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెల్లి పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు తన భార్య కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త చెప్తున్న విషయాలు పొంతన కుదరకపోవడంతో.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది.
 తానే భార్యను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హతమార్చి కంపచెట్లలో పడేశానని చెప్పడంతో.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం కమ్మరాయనిమిట్ట సమీపంలో ఆదివారం వెలుగుచూసింది.
 చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందిన కుసుమకుమారి(21)కి బెంగళూరులో నివాసముంటున్న జి. కేశవులు అనే యువకుడితో రెండు నెలల క్రితం వివాహమైంది. కుసుమకుమారి ప్రస్తుతం బీఈడీ చదువుతోంది. మూడు రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లిన కేశవులు బైక్‌పై ఎక్కించుకొని కమ్మరాయనిమిట్ట సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లి పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య కనబడటం లేదని ఫిర్యాదు చేశాడు.
 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ.. విచారణలో భాగంగా భర్తను తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురిని హతమార్చాడాని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement