kesavulu
-
అంతర్జాతీయ విత్తన సంస్థ అధ్యక్షుడిగా కేశవులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, విత్తన శాస్త్రవేత్త డాక్టర్ కేశవులు ఎన్నికయ్యారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో గురువారం ఇస్టా కాంగ్రెస్ ముగింపు సందర్భంగా ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఇస్టా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. కేశవులు 2025 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. అమెరికాకు చెందిన ఎర్నెస్ట్ ఎలాన్ వైస్ ప్రెసిడెంట్‌గా, మరో తొమ్మిది మంది ఇస్టా సభ్యులుగా ఎన్నికయ్యారు. సభ్యుల్లో కెనడా, న్యూజి లాండ్, ఫ్రాన్స్, ఫిలిఫ్పైన్స్, అర్జెంటీనా, జర్మనీ, జింబాబ్వే, ఇటలీ, ఉరుగ్వేలకు చెందినవారున్నారు. కాగా, కేశవులుకు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. దేశానికి తెలంగాణ విత్తన భాండాగారంగా ఉన్న నేపథ్యం లో ఆసియా నుంచి తొలిసారిగా ఈ పదవికి ఎన్నికైన వ్యక్తి కేశవులు అని కేటీఆర్ వ్యా ఖ్యానించారు. తెలంగాణ నుంచి ఎంపిక కావడంతో యావత్ భారతావనికి కూడా విత్తన రంగంలో అంతర్జాతీయ కీర్తి లభించిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో విత్తన పరీక్ష ల్యాబ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత వ్యవసాయోత్పత్తి ప్రతి ఏడాది స్థిరంగా పెరుగుతూ వస్తోందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కైరోలో జరి గిన ఇస్టా కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్నారు. -
రైతులకు నాణ్యమైన సోయా విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన సోయా విత్తనా లు సరఫరా చేస్తున్నామని తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. సోయా విత్తనోత్పత్తిలో కంపెనీలు మోసం చేస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుడైన వెంకట్రావు విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం లెటర్ హెడ్‌ను దుర్వినియోగపరుస్తూ, దాని అధ్యక్షుడిగా 3 నెలలు గా ఉన్నతాధికారులు, సంస్థల మీద తప్పుడు ఫిర్యా దులు చేస్తున్నారన్నారు. నకిలీ సోయా విత్తనాలను విత్తన ధ్రువీకరణ సంస్థ ఏనాడూ ధ్రువీకరించలేదన్నారు. సరైన ఆధారాలు, రైతుల పూర్తి చిరునామా, మూలవిత్తనం సరఫరా చేసిన విత్తనట్యాగులతో సహా సమర్పించిన తర్వాత ఆన్లైన్లో మాత్రమే విత్తన క్షేత్రాలను నమోదు చేస్తామని వివరిం చారు. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరిగే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రైతుల ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్‌లు వారికి తెలియకుండా సేకరించడం జరగని పని అని అన్నారు. విత్తన ధ్రువీకరణను నాలుగైదు అంచెల్లో ఉన్న అధికారులతో కూడిన తనిఖీ బృం దాలతో కలిపి చేస్తారన్నారు. మూడేళ్లుగా 18–20 లక్షల విత్తనాలను మన రాష్ట్రానికే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. -
తక్కువ ఖర్చుతోనే సేంద్రియ ధ్రువీకరణ
తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ డైరెక్టర్ డా. కేశవులుతో ‘సాగుబడి’ ముఖాముఖి ప్రశ్న: ఏయే ఉత్పత్తులకు తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ ద్వారా ధ్రువీకరణ పొందవచ్చు? డా.కేశవులు: రైతులు రసాయనాలు వాడకాన్ని మాని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే అన్ని రకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పూలతోపాటు మిర్చి, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలకు మా వద్ద నుంచి సేంద్రియ ధ్రువీకరణను సులభంగా పొందవచ్చు. అంతేకాదు, అడవి నుంచి సేకరించే ఉత్పత్తులకు కూడా సేంద్రియ ధ్రువీకరణ ఇస్తాం. ప్రశ్న: సేంద్రియ వ్యాపారులకు లైసెన్స్ ఇస్తారా? డా. కేశవులు: సేంద్రియంగా పండించిన పంటలను శుద్ధి చేసే ప్రాసెసింగ్ సెంటర్లు, సేంద్రియ ఆహారోత్పత్తులను విక్రయించే టోకు, చిల్లర వ్యాపారులకు కూడా మా సంస్థ అనుమతి ఇస్తుంది. జీవన ఎరువులు, జీవన క్రిమి, కీటక నాశనులు వంటి సేంద్రియ ఉత్పాదకాలకు కూడా ధ్రువీకరణ ఇస్తాం. ప్రశ్న: ఈ ధ్రువీకరణతో∙ ఎక్కడైనా అమ్ముకోవచ్చా? డా. కేశవులు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడ సాగు చేసే రైతులైనా మా నుంచి సేంద్రియ ధ్రువీకరణ పొంది, తమ ఉత్పత్తులను మన దేశంలో, విదేశాల్లో కూడా అమ్ముకోవచ్చు. ప్రశ్న: సేంద్రియ ధ్రువీకరణకు ఎంత ఖర్చవుతుంది? డా. కేశవులు: వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల సంస్థ(అపెడా) నుంచి ధ్రువీకరణ హక్కులు పొందిన రాష్ట్రాల్లో తొమ్మిదవది తెలంగాణ. ఇతర రాష్ట్రాలకన్నా తక్కువ ఫీజుతోనే ధ్రువీకరణ ఇస్తున్నాం. ఏడాదికి ఒక ఎకరానికైతే రూ. 1,860 అవుతుంది. 25 ఎకరాలకైతే రూ. 2,100 అవుతుంది. సేంద్రియ పంటగా ధృవీకరణ పొందడానికి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలకు రెండేళ్లు పడుతుంది. బహువార్షిక పండ్ల తోటలకు మూడేళ్లు పడుతుంది. ఈలోగా కూడా సేంద్రియ ఉత్పత్తిగానే అమ్ముకోవచ్చు. సేంద్రియ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రతి ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు.. తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ, హాకా భవన్, నాంపల్లి, హైదరాబాద్. ఫోన్స్: 040–23237016, 23235939, 91000 26624. – డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్ -
‘తల్లి పాలతోనే ఆరోగ్యం’
హిందూపురం టౌన్ : తల్లి పాలతోనే శరీర ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల, మేధస్సు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బీపీఎన్ఐ సంస్థ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తెలుగు బ్రౌచర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీపీఎన్ఐ జాతీయ కోఆర్డినేషన్ సభ్యుడు, మెడికల్ సూపరింటెండెంట్ కేశవులు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆస్పత్రుల జిల్లా కోఆర్డినేటర్ రమేష్‌నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్‌నాథ్, కేశవులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన బ్రౌచర్లు ఆంగ్లంలో విడుదల అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగులో విడుదల చేశామన్నారు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారని తెలిపారు. తల్లిపాలే పిల్లలకు పౌష్టికాహారమన్నారు. రాష్ట్రంలో సరైన అవగాహన లేక 31 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, ఆర్ఎంఓ రుక్మిణమ్మ, వైద్యులు పోలప్ప, శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు అంజినప్ప, సుశీలమ్మ, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదర్శమూర్తి విజయమ్మ
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు తిరుపతి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై వేధించినా, కష్ట కాలంలోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీని విజయబాటలో నడిపించిన ఆదర్శమూర్తి వైఎస్ విజయమ్మ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు కొనియాడారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల అభివృద్ది కోసం తపించే మహోన్నత వ్యక్తి విజయమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు, మాజీ ఎంపీటీసీ నల్లందుల సుధాకర్‌రెడ్డి, చిన్న, హరిబాబు, వీరనారాయణరెడ్డిలు పాల్గొన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో.. రూరల్ మహిళా విభాగం రూరల్ మండల అధ్యక్షురాలు మొక్కల భారతి ఆధ్వర్యంలో సీమల్లవరం పంచాయతీలో వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు సావిత్రి, రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భార్యను చంపి.. మిస్సింగ్ కేసు పెట్టాడు..
కళాశాల నుంచి ఇంటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద ఎక్కించుకున్న భర్త నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెల్లి పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు తన భార్య కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త చెప్తున్న విషయాలు పొంతన కుదరకపోవడంతో.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. తానే భార్యను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హతమార్చి కంపచెట్లలో పడేశానని చెప్పడంతో.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం కమ్మరాయనిమిట్ట సమీపంలో ఆదివారం వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందిన కుసుమకుమారి(21)కి బెంగళూరులో నివాసముంటున్న జి. కేశవులు అనే యువకుడితో రెండు నెలల క్రితం వివాహమైంది. కుసుమకుమారి ప్రస్తుతం బీఈడీ చదువుతోంది. మూడు రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లిన కేశవులు బైక్‌పై ఎక్కించుకొని కమ్మరాయనిమిట్ట సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లి పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య కనబడటం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ.. విచారణలో భాగంగా భర్తను తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురిని హతమార్చాడాని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.