సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన సోయా విత్తనా లు సరఫరా చేస్తున్నామని తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. సోయా విత్తనోత్పత్తిలో కంపెనీలు మోసం చేస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుడైన వెంకట్రావు విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం లెటర్ హెడ్‌ను దుర్వినియోగపరుస్తూ, దాని అధ్యక్షుడిగా 3 నెలలు గా ఉన్నతాధికారులు, సంస్థల మీద తప్పుడు ఫిర్యా దులు చేస్తున్నారన్నారు.
నకిలీ సోయా విత్తనాలను విత్తన ధ్రువీకరణ సంస్థ ఏనాడూ ధ్రువీకరించలేదన్నారు. సరైన ఆధారాలు, రైతుల పూర్తి చిరునామా, మూలవిత్తనం సరఫరా చేసిన విత్తనట్యాగులతో సహా సమర్పించిన తర్వాత ఆన్‌లైన్‌లో మాత్రమే విత్తన క్షేత్రాలను నమోదు చేస్తామని వివరిం చారు. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరిగే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రైతుల ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్‌లు వారికి తెలియకుండా సేకరించడం జరగని పని అని అన్నారు. విత్తన ధ్రువీకరణను నాలుగైదు అంచెల్లో ఉన్న అధికారులతో కూడిన తనిఖీ బృం దాలతో కలిపి చేస్తారన్నారు. మూడేళ్లుగా 18–20 లక్షల విత్తనాలను మన రాష్ట్రానికే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment