‘తల్లి పాలతోనే ఆరోగ్యం’ | mothermilk week meeting in hindupur hospital | Sakshi
Sakshi News home page

‘తల్లి పాలతోనే ఆరోగ్యం’

Published Thu, Jul 28 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

‘తల్లి పాలతోనే ఆరోగ్యం’

‘తల్లి పాలతోనే ఆరోగ్యం’

హిందూపురం టౌన్‌ : తల్లి పాలతోనే శరీర ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల, మేధస్సు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బీపీఎన్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తెలుగు బ్రౌచర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీపీఎన్‌ఐ జాతీయ కోఆర్డినేషన్‌ సభ్యుడు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ కేశవులు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆస్పత్రుల జిల్లా కోఆర్డినేటర్‌ రమేష్‌నాథ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రమేష్‌నాథ్, కేశవులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన బ్రౌచర్లు ఆంగ్లంలో విడుదల అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగులో విడుదల చేశామన్నారు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారని తెలిపారు. తల్లిపాలే పిల్లలకు పౌష్టికాహారమన్నారు. రాష్ట్రంలో సరైన అవగాహన లేక 31 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ వెంకటస్వామి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ, వైద్యులు పోలప్ప, శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు అంజినప్ప, సుశీలమ్మ, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement