హిందూపురం అర్బన్ : హిందూపురం ప్రభుత్వాస్పత్రికి జాతీయ అవార్డు అందరి సహకారంతోనే వచ్చిందని ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, సభ్యులు అన్నారు. శనివారం ఆస్పత్రిలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు, సర్టిఫికెట్‌ను అందజేశారు. ఆస్పత్రికి కాయకల్ప కింద జాతీయ అవార్డు లభించడంపై కలెక్టర్ శశిధర్ ప్రసంసించారని చెప్పారు.
అవార్డుతో పాటు ప్రభుత్వం రూ.20 లక్షలు ప్రకటించిందని వీటితో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ, డాక్టర్, సిబ్బంది బృందంతో పాటు కమిటీ సభ్యులు బండారు బాలాజీ, సుశీలమ్మ, అంజినప్ప, బాషా తదితరులు పాల్గొన్నారు.
అందరి సహకారంతోనే జాతీయ అవార్డు
Published Sat, Feb 18 2017 11:50 PM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM
Advertisement
Advertisement