hindupur hospital
-
ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యమందిస్తాం
సాక్షి, హిందూపురం(అనంతపురం) : రాష్ట్రంలోని పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ కర్తవ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. మంగళవారం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వమోవృద్ధులకు ప్రత్యేక వార్డు, గుండెజబ్బుల ఐసీయూ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. వార్డుల్లోని రోగులను మంత్రి ప్రత్యేకంగా పరామర్శించి వైద్యసేవలు, సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేస్తున్న దాతలను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ.. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. హిందూపురం ఆసుపత్రిలో వృద్ధులకు, గుండె జబ్బుల వారికి ఐసీయూ, డయాలసిస్ వంటి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వైద్య సిబ్బందిని నియమిస్తాం... హిందూపురం ఆసుపత్రిలో మాతశిశు కేంద్రంలో, ఇతర విభాగాల్లో వైద్యుల కొరతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. హిందూపురం ఆసుపత్రిలో రెఫరల్ ఆసుపత్రిగా కాకుండా మెరుగైన వైద్యం అందించేలా జిల్లా స్థాయి వైద్య సదుపాయలు కల్పిస్తామన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ రామసుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ దివాకర్, డీసీహెచ్ రమేశ్‌నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు శ్రీరాంరెడ్డి, మైనార్టీ నాయకులు ఫజుల్ రెహమాన్, మాజీ కౌన్సిలర్లు ఆసిఫుల్లా, రెహమాన్, నాయకులు బసిరెడ్డి, ఉదయ్, సోమశేఖర్‌రెడ్డి, గంగిరెడ్డి, బండ్లపల్లి జబీ, శివశంకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, ఉమర్‌ఫరూక్, పరిగి నాయకులు బాలాజి, గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. మంత్రికి పలు వినతులు హిందూపురం ఆసుపత్రిలో వార్డు ప్రారంబోత్సవానికి విచ్చేసిన బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణకు పలువురు వినతిపత్రాలు అందించి సమస్యలు పరిష్కారించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం డిసెంబర్ నుంచి తమకు వేతనాలు నిలిపివేసిందని, ఇప్పటి వరకు పది నెలల వేతనాలు అదలేదని బ్లడ్‌బ్యాంకులో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తిరిగి ఇప్పించడానికి సహాయం చేయాలని మంత్రిని కోరారు. 70 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్ల వద్ద మున్సిపల్ అధికారులు కనీసం రోడ్డు, డ్రైనేజీలు నిర్మించలేదని తమపై వివక్ష చూపుతున్నారని బాపూజీ మరిజన యువజన సేవా సంఘం నాయకులు వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యే, గత మున్సిపల్ పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తమకు మౌళిక సదుపాయలు కల్పించాలని సంఘ నాయకులు నాగరాజు, అశోక్, పవన్ వినతిపత్రం అందించారు. -
అందరి సహకారంతోనే జాతీయ అవార్డు
హిందూపురం అర్బన్ : హిందూపురం ప్రభుత్వాస్పత్రికి జాతీయ అవార్డు అందరి సహకారంతోనే వచ్చిందని ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, సభ్యులు అన్నారు. శనివారం ఆస్పత్రిలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు, సర్టిఫికెట్‌ను అందజేశారు. ఆస్పత్రికి కాయకల్ప కింద జాతీయ అవార్డు లభించడంపై కలెక్టర్ శశిధర్ ప్రసంసించారని చెప్పారు. అవార్డుతో పాటు ప్రభుత్వం రూ.20 లక్షలు ప్రకటించిందని వీటితో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణమ్మ, డాక్టర్, సిబ్బంది బృందంతో పాటు కమిటీ సభ్యులు బండారు బాలాజీ, సుశీలమ్మ, అంజినప్ప, బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ జాతీయ రెండో ఆస్పత్రిగా అవార్డు స్వీకరణ
హిందూపురం అర్బన్ : హిందూపురం ప్రభుత్వాస్పత్రికి కేంద్ర కాయకల్ప బృందం జాతీయ ఉత్తమ రెండో ఆస్పత్రిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని మేడి హర్డింగ్ మెడికల్ కాలేజ్ స్వర్ణజయంతి ఆడిటోరియంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. 2016–17కి విజయనగరం ఆస్పత్రికి మొదటిస్థానం, హిందూపురం ఆస్పత్రికి రెండో ఉత్తమ స్థానం లభించింది. అవార్డు రావడంపై ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం
హిందూపురం అర్బన్ : పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వైద్య బృందం సభ్యులు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ప్రొఫెసర్ లేఖసుబ్బయ్య, సహాయకులు డాక్టర్ ప్రభుస్వామి అన్నారు. బుధవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కేంద్ర వైద్య బృందం సభ్యులు పర్యటించారు. ముందుగా లేబర్ వార్డు, చిన్నపిల్లల, మెడికల్ వార్డులు, కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. జనఽనీ సురక్షçయోజన, మెడాల్ ల్యాబ్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పనితీరు, చైల్డ్‌కేర్ వంటి పథకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, వాటి వినియోగం గురించి ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర వైద్య పథకాల అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ధర్మవరం, హిందూపురం ఏరియా ఆస్పత్రులను సందర్శించామన్నారు. హిందూపురం ఆస్పత్రిలో వసతులు బాగున్నాయని, అయితే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని గుర్తించామన్నారు. కార్యక్రమంలో డీపీఓ కిషోర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, మెడికల్ ఆఫీసర్ పోలప్ప, ఆర్ఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన వైద్యబృందం లేపాక్షి : కేంద్ర వైద్య బృందం సభ్యులు హిందూపురం ఆస్పత్రి పరిశీలన అనంతరం బుధవారం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. శిల్పాలు, చిత్రాలు తిలకించి, ఆలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. -
ప్రపంచ బ్యాంకు నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి
హిందూపురం అర్బన్ : ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలో ఆవరణలో అన్న క్యాంటిన్, మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారితోపాటు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్ కోన శశిధర్, వైద్య విధాన పరిషత్ చైర్మన్ బీకేనాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కామినేని శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రసుత్తం హిందూపురంలో ప్రారంభించామన్నారు. అలాగే ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచామన్నారు. తద్వారా మాతా శిశు మరణాలు నివారించామన్నారు. ఓపీ కూడా 28 శాతం పెరిగిందన్నారు. హిందూపురం ఆసుపత్రికి శనివారం అనస్థీషియన్‌ను నియమిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ బాలకృష్ణ వచ్చిన తర్వాతే హిందూపురం అభివృద్ధి జరుగుతోందన్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించాలని బాలకృష్ణను కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ బెంగళూరు రాయయ్య ఆసుపత్రిలో ఆరోగ్యసేవ సదుపాయం అందించడానికి చర్చిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ లక్ష్మి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఆసుపత్రి కమిటీ చైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు. -
మృత్యు ఒడికి చిన్నారి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో కర్ణాటక గుట్టకొడికేపల్లికి చెందిన అభిలాష్ (4) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు రవి, గాయిత్రీ ఆస్పత్రి వద్ద కన్నీరు మున్నీరయ్యారు. అభిలాష్‌కు తీవ్ర జ్వరం ఉందని వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి మరో డాక్టర్‌కు బాధ్యత అప్పగించి వెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందటంతో వైద్య సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరకుని వైద్యులతో గొడవకు దిగారు. ఇంతలో డాక్టర్ వెంకటరమణ అక్కడికి చేరుకుని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. బెంగళూరుకు వెళ్లాలని సూచించాలి కదా వైద్యులను బంధువులు నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐలు మహమ్మద్‌బాష, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పారు. -
‘తల్లి పాలతోనే ఆరోగ్యం’
హిందూపురం టౌన్ : తల్లి పాలతోనే శరీర ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల, మేధస్సు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బీపీఎన్ఐ సంస్థ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తెలుగు బ్రౌచర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీపీఎన్ఐ జాతీయ కోఆర్డినేషన్ సభ్యుడు, మెడికల్ సూపరింటెండెంట్ కేశవులు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆస్పత్రుల జిల్లా కోఆర్డినేటర్ రమేష్‌నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్‌నాథ్, కేశవులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన బ్రౌచర్లు ఆంగ్లంలో విడుదల అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగులో విడుదల చేశామన్నారు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారని తెలిపారు. తల్లిపాలే పిల్లలకు పౌష్టికాహారమన్నారు. రాష్ట్రంలో సరైన అవగాహన లేక 31 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, ఆర్ఎంఓ రుక్మిణమ్మ, వైద్యులు పోలప్ప, శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు అంజినప్ప, సుశీలమ్మ, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పురిటిబిడ్డను చంపబోయిన తల్లి
కేసు నమోదు హిందూపురం : ఆడపిల్ల పుట్టడంతో ఆవేదనకు లోనై చంపబోయిన బాలింతపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లికి చెందిన కళావతికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. మూడవ కాన్పులో మగపిల్లాడు పుట్టి చనిపోయాడు. తిరిగి గర్భం దాల్చిన ఆమెకు శనివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపు ఇంటి వద్దనే ప్రసవమైంది. ఆడపిల్ల పుట్టడంతో మనస్థాపానికి గురైంది. అదే సమయంలో తల్లీబిడ్డను ఆదివారం ఉదయం 6.55గంటలకు హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. 8 గంటలకు సిబ్బంది డ్యూటీ మారే సమయంలో ఆడబిడ్డను వదిలించుకునేందుకు తల్లి ప్రయత్నించింది. పసికందు గొంతు నులమడంతో నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చింది. అదే సమయంలో ఇతరులు గదిలోకి రావడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది శిశువుకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి అనంతరం కర్నూలుకు తీసుకెళ్లినట్లు స్థానిక ఆస్పత్రి సూపరింటెండెండ్ కేశవులు తెలిపారు. ఘటనపై వన్‌టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'విధుల్లో లేకపోతే ఖబడ్దార్..'
హిందూపురం (అనంతపురం): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిని పూనం మాలకొండయ్య బుధవారం ఉదయం తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు బాలాజీ విధుల్లో లేరు. బాలాజీ విధులకు తరచూ గైర్హాజరవుతూ ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ఆ వైద్యుణ్ని విధుల నుంచి తొలగిస్తూ ఆమె అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.