హిందూపురం (అనంతపురం): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిని పూనం మాలకొండయ్య బుధవారం ఉదయం తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు బాలాజీ విధుల్లో లేరు.
బాలాజీ విధులకు తరచూ గైర్హాజరవుతూ ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ఆ వైద్యుణ్ని విధుల నుంచి తొలగిస్తూ ఆమె అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'విధుల్లో లేకపోతే ఖబడ్దార్..'
Published Wed, Aug 19 2015 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement