Poonam Mala Kondaiah
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి మేలు కలిగేలా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంకలనం చేసిన ఉద్యాన పంటల పంచాంగం ఆవిష్కరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆర్థిక ప్రయోజనాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కలిగించేలా మన వ్యయసాయ పద్దతులుండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతమని, అందుకు తగ్గట్టుగా మనందరం కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన సాగులో ఆరోగ్యానికి మరింతగా ఉపకరించే కొత్త పంటలను ప్రోత్సాహించాలని, పురుగు మందులు, రసాయనాల వినియోగం తగ్గిస్తూ అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని శాస్త్రవేత్తలకు సూచించారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి, మన రాష్ట్ర ఉద్యాన పంటల ఉత్పత్తలకు జాతీయ స్థాయిలో ఉన్నత గుర్తింపు ఉందని, ఈ గుర్తింపును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నతికి ఉప కులపతి డా జానకి రామ్, వారి శాస్త్రవేత్తల బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. 98 ఉద్యాన పంటల సమగ్ర సమాచారంతో రైతులకు సులువుగా అవగాహన కలిగించేలా ఉద్యాన పంటల పంచాంగం రూపొందించారని మంత్రి ప్రశంసించారు. ఉద్యాన పంచాంగ పుస్తకాలు ప్రతి ఆర్బీకేలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగుపై నిర్వహిస్తున్న "తోటబడి" శిక్షణా కార్యక్రమాల్లో ఉద్యాన శాస్త్రవేత్తలు మరింత శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, ఉప కులపతి డా జానకి రామ్ తదితర అధికారులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన -
'విధుల్లో లేకపోతే ఖబడ్దార్..'
హిందూపురం (అనంతపురం): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిని పూనం మాలకొండయ్య బుధవారం ఉదయం తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు బాలాజీ విధుల్లో లేరు. బాలాజీ విధులకు తరచూ గైర్హాజరవుతూ ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ఆ వైద్యుణ్ని విధుల నుంచి తొలగిస్తూ ఆమె అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న ఇంటర్ బోర్డు తొలిసారిగా ఈ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన అమలు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. నిమిషం నిబంధన అమలు చేయడం ఈసారి ఇంటర్ పరీక్షల ప్రత్యేకత. ఎంసెట్ తరహాలో ఇంటర్ బోర్డు కూడా మొదటిసారిగా నిమిషం నిబంధనను అమల్లోకి తెచ్చింది. అంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులను ఉదయం 8:30 గంటలనుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడొద్దని స్పష్టం చేసింది. గతంలో పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించేవారు. ఈసారి అలా కుదరదు. అరగంట ముందుగానే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నందున ఆ వెసులుబాటును తొలగించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థుల్ని సాధారణంగా 8:45 గంటలవరకు పరీక్ష హాల్లోకి పంపుతారు. అయితే 8:45 గంటల నుంచి 9 గంటల వరకూ అనుమతిస్తారు. అయితే ఆలస్యానికి గల కారణాల్ని విద్యార్థులు రాతపూర్వకంగా తెలపాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 19.78 లక్షలమంది హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పేర్లు, మీడియం, పరీక్ష రాసే సబ్జెక్టు వివరాలు, హాల్టికెట్లో ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థులు సంతకాలు చేసేముందు ఓఎంఆర్ బార్కోడ్ షీట్పైనా రిజిస్టర్ నంబరు, పేర్లు, సబ్జెక్టు వివరాలను చూసుకోవాలి. కొత్త సిలబస్, పాత సిలబస్ వివరాలను సరిచూసుకోవాలి. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రం లోకి సెల్ఫోన్లు తేరాదు. సెల్ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉన్న డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిం టెండెంట్ల ఫోన్లపై ట్యాపింగ్ తరహా నిఘా ఉంటుంది. పరీక్షలపై సీఎస్ సమీక్ష: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం సెకండరీవిద్య ముఖ్య కార్యదర్శి(ఇన్చార్జి) పూనం మాల కొండయ్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్శంకర్ నాయక్లతో సమీక్షించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేం దుకవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.