హిందూపురం అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో కర్ణాటక గుట్టకొడికేపల్లికి చెందిన అభిలాష్ (4) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు రవి, గాయిత్రీ ఆస్పత్రి వద్ద కన్నీరు మున్నీరయ్యారు. అభిలాష్‌కు తీవ్ర జ్వరం ఉందని వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి మరో డాక్టర్‌కు బాధ్యత అప్పగించి వెళ్లారు.
చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందటంతో వైద్య సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరకుని వైద్యులతో గొడవకు దిగారు. ఇంతలో డాక్టర్ వెంకటరమణ అక్కడికి చేరుకుని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. బెంగళూరుకు వెళ్లాలని సూచించాలి కదా వైద్యులను బంధువులు నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐలు మహమ్మద్‌బాష, ట్రాఫిక్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పారు.
మృత్యు ఒడికి చిన్నారి
Published Fri, Aug 26 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
Advertisement
Advertisement