మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్‌పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది.
వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్‌కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు.
అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్‌కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు.
అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా.
(చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి)
Comments
Please login to add a commentAdd a comment