Metro Pillar
-
కేపీహెచ్‌బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్
మూసాపేట: కేపీహెచ్‌బీకాలనీ మెట్రో స్టేషన్, బస్టాప్ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహించే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు 6 టీములుగా ఏర్పడి మంగళవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కేపీహెచ్‌బీ బస్టాప్, మెట్రో స్టేషన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 మంది మహిళలను అరెస్టు చేసి కూకట్పల్లి ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. ప్రతి నెలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్‌పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీ కొట్టిన కారుశామీర్పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్‌కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్‌తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కూలిన మెట్రో స్టేషన్ వాల్... పలువురికి గాయాలు!
ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ గురువారం 11 గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ (తూర్పు వైపు) కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
మెట్రో స్టేషన్ల కిందా తాగుడే!
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లే కాకుండా ఇప్పుడు మెట్రోస్టేషన్ల కింద కూడా తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని నగరానికి చెందిన టీఏవీ శ్రీనివాస్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. పంజగుట్ట మెట్రో స్టేషన్ కింద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో బంధించి తన ట్వీట్‌తో జతపరిచారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. This is the current situation near Punjagutta @HyderabadMetroR station. Request @KTRBRS to take action @TelanganaDGP @NVSReddyIRAS pic.twitter.com/mf4fPj7vuF — T A V Srinivas (@TAVSrinivas1) July 7, 2023 -
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్‌పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్‌కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్‌కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి
-
ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కొడుకు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. తేజస్వీ(25) అనే మహిళ తన భర్త లోహిత్, రెండున్నరేళ్ల కూమార్తె, కుమారుడు విహాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హెబ్బాల్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీర్ లేఅవుట్ వరకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్పకూలి రోడ్డు మీద పడింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై ఇనుప రాడ్లతో కూడిన మెట్రో పిల్లర్ పడటంతో వారు తీవ్ర గాయపడ్డారు. ముగ్గురుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వివాహితతోపాటు ఆమె మూడే కుమారుడు మరణించారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లర్ కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన: ప్రయాణికులను ఎక్కించుకోకుండా..