కూలిన మెట్రో స్టేషన్‌ వాల్‌... పలువురికి గాయాలు! | Delhi's Gokulpuri Metro Station Slab Collapsed | Sakshi
Sakshi News home page

Delhi: కూలిన మెట్రో స్టేషన్‌ వాల్‌... పలువురికి గాయాలు!

Published Thu, Feb 8 2024 12:58 PM | Last Updated on Thu, Feb 8 2024 1:20 PM

Delhi Metro Station Slab Collapse - Sakshi

ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లో ‍గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు.  ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ గురువారం 11 గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ (తూర్పు వైపు) కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్‌ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలు చేపడుతున్నారు.  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement