మూసాపేట: కేపీహెచ్‌బీకాలనీ మెట్రో స్టేషన్, బస్టాప్ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహించే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు 6 టీములుగా ఏర్పడి మంగళవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కేపీహెచ్‌బీ బస్టాప్, మెట్రో స్టేషన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
10 మంది మహిళలను అరెస్టు చేసి కూకట్‌పల్లి ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. ప్రతి నెలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment