prostitutes
-
కేపీహెచ్‌బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్
మూసాపేట: కేపీహెచ్‌బీకాలనీ మెట్రో స్టేషన్, బస్టాప్ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహించే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు 6 టీములుగా ఏర్పడి మంగళవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కేపీహెచ్‌బీ బస్టాప్, మెట్రో స్టేషన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 మంది మహిళలను అరెస్టు చేసి కూకట్పల్లి ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. ప్రతి నెలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రూటు మార్చిన సెక్స్ వర్కర్లు
న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఉపాది కోల్పోయి రోడ్డుపై పడ్డవారు కోకొల్లలు. సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు అన్ని వర్గాల వారు లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అంతేకాదు.. ఢిల్లీ, జీబీ రోడ్డులోని చాలామంది సెక్స్ వర్కర్ల జీవితంలోనూ కరోనా పెను మార్పులు తీసుకువచ్చింది. నరక కూపంనుంచి బయటపడదామని అనుకుంటూ.. పూట గడవదన్న భయంతో ఏటూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారికి మార్గాన్ని సుగమం చేసింది. కరోనా కారణంగా వేశ్యా వృత్తి తీవ్రంగా నష్టపోయింది. దీంతో వారు వేరే ఉపాది వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలో ‘హునర్ జ్యోతి’ కార్యక్రమం వారికి అండగా నిలిచింది. మట్టి దీపాలకు రంగులు వేయటం, కాగితపు బ్యాగులు తయారు చేయటం, అగరుబత్తీలు, కీ రింగుల తయారీ, ఫ్యాబ్రిక్ పనుల్లో శిక్షణననిచ్చి ఉపాధి కల్పిస్తోంది. ( ఆ ప్రాంతంలో భూకంపాల ముప్పు అధికం ) జీబీ రోడ్డులో పడుపు వృత్తి కొనసాగిస్తున్న 2000 మంది వేశ్యల్లో దాదాపు 20 శాతం మంది లాక్డౌన్ సమయంలో ఈ వృత్తుల వల్ల ఉపాధి పొందుతున్నారు. మరి కొంతమంది నగరాన్ని విడిచి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీనిపై ఓ వేశ్య మాట్లాడుతూ.. ‘‘ నేను 12 ఏళ్లుగా ఈ వృత్తినుంచి బయటపడదామని అనుకుంటున్నాను. కానీ, కుదర్లేదు. నా కూతురి భవిష్యత్తు కోసం ఏదైనా వేరే పని వెతుక్కోవాలనుకున్నా. ‘హునర్ జ్యోతి’ కార్యక్రమం ద్వారా మంచి అవకాశం లభించింది’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. -
వేశ్యలపై 9 మంది సామూహిక అత్యాచారం
నొయిడా : దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ముగ్గురు వేశ్యలపై 9 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన బుధవారం నోయిడాలో చోటుచేసుకుంది. బాధితురాల్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కాగా.. ఒకరు క్యాబ్ డ్రైవర్ ఉన్నాడని తెలిపారు. ‘మంగళవారం రాత్రి లజ్‌పత్ నగర్ మెట్రోరైల్వేస్టేషన్ సమీపంలో క్లైంట్స్ కోసం వేచి ఉన్న మా వద్దకు స్విప్ట్ డిజైర్ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాం. రూ.3600 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అనంతరం నొయిడా సెక్టార్ 135లోని ఓ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడికి మరో ఏడుగురు వ్యక్తులు వచ్చారు. వారిని చూసిన వెంటనే మేం వెళ్లిపోతామని చెప్పాం. కానీ వారు దానికి ఒప్పుకోకుండా బలవంతంగా అత్యాచారం చేశారు. భౌతికంగా దాడి చేశారు. అనంతరం అందులోని ఒక వ్యక్తిని బతిమాలితే.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మెయిన్ రోడ్డుపై వదిలిపెట్టాడు. వెంటనే 100కు డయల్ చేసి జరిగిందంతా చెప్పాం. వారు మాకిచ్చిన అడ్వాన్స్ కూడా బలవంతంగా లాక్కున్నారు.’ అని బాధితురాల్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
కేరళ వరదలు: సెక్స్ వర్కర్ల సాయం
ముంబై : కేరళ వరద బాధితులకు మహారాష్ట్ర సెక్స్ వర్కర్లు సాయం చేశారు. అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన సెక్స్‌వర్కర్లు రూ.21వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నెలాఖరువరకు ఈ సాయాన్ని లక్షకు పెంచుతామని కూడా తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు అందజేయాలని చెక్కును స్థానిక డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌కు అందజేశారు. ఈ విషయాన్ని సెక్సవర్కర్ల సంక్షేమం కోసం పనిచేసే ఓ ఎన్జీవో ప్రతినిధి తెలిపారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించనప్పుడల్లా సెక్స్‌వర్కర్లు సాయం చేశారని ఆయన పేర్కొన్నారు. 2015లో చెన్నై వరద బాధితులకు ఒక లక్ష సాయం చేసారని చెప్పారు. ఇప్పటి వరకు సెక్స్‌వర్కర్లు మొత్తం రూ. 27 లక్షల సాయాన్ని చేసినట్లు పేర్కొన్నారు. 2001లో గుజరాత్లో భూకంపం, సునామీ (2004), కశ్మీర్, బీహార్ వరదలు, మహరాష్ట్రలోని కరువు సంభవించినప్పుడు, కార్గిల్ హీరోలకు విరాళాలు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. సాయం చేసిన సెక్స్ వర్కర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
శుక్లా సన్నిహితుడిపై వేటు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) సెలక్షన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమన్న నేపథ్యంలో ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎల్ చైర్మన్, యూపీసీఏ కార్యదర్శి రాజీవ్ శుక్లా వర్గానికి చెందిన అక్రమ్ సైఫీపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఓ జాతీయ మీడియా జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో అక్రమ్ సైఫీ... రాష్ట్ర జట్టులో చోటు కోసం యత్నిస్తున్న యువ ఆటగాడు రాహుల్ శర్మ నుంచి ముడుపులు కోరడంతో పాటు ఆటగాళ్లకు తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నట్లు తేలింది. ఈ అంశాలను ఆ ఛానల్ ప్రసారం చేయడంతో బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. -
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా : బైరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఇటీవల తరుచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వార్తలోకి ఎక్కడం పరిపాటిగా మారింది. తాజాగా మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులకంటే ప్రాస్టిట్యూట్లు(వేశ్యలే) నయమని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లే నయం. కనీసం వారు డబ్బులు తీసుకుని పని అయినా చేస్తారు. స్టేజీలపై డ్యాన్స్‌లు చేస్తూ.. మనల్ని సంతోష పరుస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటారు. పని చేస్తారో చేయరో గ్యారెంటీనే లేదు’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాక లంచాలు అడిగిన ప్రభుత్వ అధికారులను అక్కడే చెప్పులతో కొట్టండి అంటూ ఆయన మద్దతుదారులను ఆదేశించారు కూడా. బైరియా తహసీల్దార్ ఆఫీసులో అధికారులు లంచాలు అడిగారనే ఆరోపణలపై మండిపడ్డ సింగ్, ఈ మేర ఆదేశాలు జారీచేశారు. సింగ్ తన మద్దతుదారులతో కలిసి ‘వార్నింగ్ డే’ ను నిర్వహించారు. లంచాలు అడిగిన అధికారుల వాయిస్‌లను కూడా రికార్డు చేయాలని మద్దతుదారులను కోరారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, వారి సంక్షేమం కోసం తాను జైలుకి వెళ్లడానికైనా సిద్దమన్నారు. సురేంద్ర సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకముందు కూడా దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి కారణం తల్లిదండ్రులేనని, వారి పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తన సొంత పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర కామెంట్లు చేశారు. కొంతమంది మంత్రులను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తీసేయాలని, లేదంటూ యూపీలో పతనం తప్పదని హెచ్చరించారు. పోలీసు స్టేషన్లలో, తహసీల్దార్ ఆఫీసుల్లో, బ్లాక్ ఆఫీసుల్లో పేద ప్రజల బాధలను వినకపోతే, వారు బీజేపీకి ఓటు వేయరన్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీ పాన బసవతారకనగర్‌లో నివా సాల మద్య వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై టూటౌన్ పోలీ సులు దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితో పాటు వేశ్యలు, విటుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి సీఐ యల్లమరాజు వెల్లడించారు. ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన అలివేలమ్మ బసవతారకనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని శింగనమలకు చెందిన ఓ మహిళ, తూర్పుగోదావరి జిల్లాకు పెద్దాపురంకు చెందిన ఓ మహిళను పిలిపించుకుని గుట్టుగా వ్యభిచారం సాగిస్తోంది. ఆదివారం ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన రఘు అనే విటుడుతో ఉండగా పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. డ యల్–100కు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు వివరించారు. నిందితులను రిమాం డ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
'వారు వేశ్యలకంటే నీచమైనవారు'
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్‌కు మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గట్టి మద్దతు పలికారు. ట్రంప్‌పై అనవసర ఆరోపణలు చేసేవారు వేశ్యలకంటే నీచమైనవారని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌పై అలాంటి ఆరోపణలు చేయడం తగదని అన్నారు. గతంలో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ అక్కడ అమ్మాయిలతో గడిపాడని, దానికి సంబంధించిన వీడియోలు రష్యా వద్ద ఉన్నాయని, వాటి ద్వారా భవిష్యత్తులో ట్రంప్‌ను వణికించే అవకాశం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై పుతిన్ తాజాగా స్పందించినట్లు టీఏఎస్ఎస్ అనే సంస్థ తెలిపింది. 'ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుడు వార్తలు ట్రంప్ ప్రచారం చేసేవారంతా కూడా వేశ్యలకంటే కూడా పనికిరానివాళ్లు. ట్రంప్ అమ్మాయిలతో గడిపాడని, అవి తమ వద్ద ఉన్నట్లు చేస్తున్న ప్రచారం మొత్తం కూడా అమెరికాలో ట్రంప్ వ్యతిరేక వర్గం(పరోక్షంగా ఒబామాను ఉద్దేశించి) చేస్తున్న ఆరోపణలు మాత్రమే. అసలు ఇలాంటివాటిని ప్రచారం చేసేవారిని నైతిక విలువలు లేనివారిగానే పరిగణించాలి' అంటూ పుతిన్ చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. -
పోలీసు స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం!
ఆ హోటల్‌కు ఎదురుగానే పోలీసు స్టేషన్ ఉంటుంది. హోటల్ ముందు కానిస్టేబుళ్లు ఎప్పుడూ తచ్చాడుతూ ఉంటారు. కానీ హోటల్ నిండా జరిగిదే వ్యభిచారమే. కేవలం 40 పౌండ్లు (రూ. 3800) ఇస్తే చాలు సెక్స్ వర్కర్లు అందుబాటులోకి వస్తారు. కావాల్సినంత సుఖం పంచుతారు. ఇది తూర్పు లండన్‌లోని స్టార్ హోటల్ హర్ట్లీలో జరుగుతున్న బాగోతం ఇది. ఫారెస్ట్ గేట్ పోలీసు స్టేషన్ ఎదురుగానే ఉన్న ఈ హోటల్‌కు వ్యభిచారం విషయంలో పెద్ద చరిత్రే ఉంది. గతంలో ఇక్కడ బస చేసిన పలువురు పర్యాటకులు కూడా ఇది అత్యంత చెత్త హోటల్ అని, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ బాగా జరుగుతుందని ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో సైతం అభిప్రాయాలు తెలిపారు. ఈ హోటల్ నేరుగా అమ్మాయిలను సప్లయి చేయదు. కానీ ఇంటర్నెట్లో యాడ్స్ ద్వారా అమ్మాయిలను బుక్ చేసుకొని ఈ హోటల్‌కు రప్పించుకోవచ్చు. ఈ హోటల్లో జరుగుతున్న బాగోతంపై తాజాగా 'సండే పీపుల్' అనే మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. 40 పౌండ్లకు రిపోర్టర్‌తో 15 నిమిషాలు గడుపడానికి యామీ అనే ఒక మహిళ ముందుకొచ్చింది. ఈ హోటల్లో రూమ్ నంబర్ 37కు రావాల్సిందిగా ఆమె రిపోర్టరకు మెసేజ్ పంపింది. రిపోర్టర్‌కు హోటల్‌కు వెళ్లేసమయంలో అక్కడ యూనిఫామ్‌లోని పోలీసులు తిరుగుతూ కనిపించారు. అయినా, హోటల్ రిసెప్షనిస్ట్ యామీ ఉన్న గదికి అతన్ని పంపించారు. ప్రకటనలో తనకు 20 ఏళ్లు అని చెప్పినప్పటికీ కొంచె వయస్సు ఎక్కువగా ఉన్న మహిళ అక్కడ రిపోర్టర్‌ను పలుకరించింది. అతడు ఇచ్చిన డబ్బుల్ని తీసుకుంది. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత.. 'సారీ' చెప్పి అక్కడి నుంచి రిపోర్టర్ వెళ్లబోతుండగా.. 'దుస్తులు తీసేయ్.. కమాన్ బేబీ' అంటూ ఆమె అతడిని ఒత్తిడి చేసింది. అతడు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. లండన్‌లోని అత్యంత చెత్త హోటళ్లలో ఒకటిగా హర్ట్లీ హోటల్ పేరుపడింది. ఈ హోటల్ లో తాము దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నట్టు పలువురు పర్యాటకులు ట్రిప్ అడ్వయిజర్ వెబ్సైట్లో తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
కంపెనీ సొమ్మును వేశ్యలపై తగలేసిన సీఈవో
ఇటీవల కుప్పకూలిన బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-మౌంట్గాక్స్ అధిపతికి సంబంధించి మరో బండారం బయటపడింది. ఆన్లైన్ వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై తగలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. కాల్పనిక నగదు (వర్చువల్ కరెన్సీ) పేరిట వినియోగదారుల నుంచి వందలకోట్ల వసూలుచేసిన బిట్‌కాయిన్ సంస్థ ఇటీవల దివాళా తీసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వినియోగదారుల ఆన్లైన్ ఖాతాల నుంచి వర్చువల్ నగదు మాయమైన వ్యవహారంలో కంపెనీ సీఈవో కార్పెలస్ హస్తం కూడా ఉందని, అతను మోసపూరితంగా వినియోగదారులకు చెందిన 1.66 లక్షల డాలర్లను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో జపాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా అతనిపై మరికొన్ని అభియోగాలు వెలుగుచూశాయి. వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై ఖర్చు చేశాడని, శృంగార సేవలు లభించే కార్యక్రమాల్లో పాల్గొని మహిళలపై అతను ఈ సొమ్ము ఖర్చు పెట్టాడని జపాన్ మీడియా తెలిపింది. 2011-13 మధ్యకాలంలో తనకు చెందిన డజన్ కంపెనీల్లోకి నిధులు మళ్లించిన వ్యవహారంపై కార్పెలస్ మొదట అరెస్టయ్యాడు. అనంతరం విడుదలైన అతన్ని బిట్‌కాయిన్ డిపాజిట్లను మళ్లించిన వ్యవహారంలో మళ్లీ అరెస్టు చేశారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
కుషాయిగూడ (హైదరాబాద్): ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నూర్జహాన్, ప్రియాంక, శేఖర్‌రెడ్డి అనే ముగ్గురు మౌలాలి హసింగ్బోర్డు, కృష్ణానగర్ కాలనీలో గతకొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు దాడులు జరిపి విటులు వెంకటేశ్, అఖిల్, వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువతలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు శేఖర్‌రెడ్డి, ప్రియాంకను అరెస్టు చేయగా నూర్జహాన్ పరారీలో ఉంది. కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న యువతులను స్టేట్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
మీరసలు మగాళ్లేనా..!
బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రాకు కోపం వచ్చింది. ఇంతకీ ప్రియాంక కోపానికి కారణం ఏంటా? అనుకుంటున్నారా! ఓ సంస్థకు చెందిన సభ్యులు... ‘ఐటమ్ సాంగ్స్‌లో నర్తించే నటీమణులను వ్యభిచారిణులుగా ప్రకటించాలి’ అంటూ కోర్టును ఆశ్రయించనున్నారు. వారి అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా వ్యక్తపరిచారు కూడా. అమ్మాయిల అసభ్యకరమైన వస్త్రధారణ వల్లనే సమాజంలో మానభంగాలు ఎక్కువయ్యాయనీ, చిన్న చిన్న స్కర్టుల్లో కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా వారి వస్త్రధారణ ఉంటోందనీ సదరు సంస్థ వారు దుయ్యబట్టారు. ప్రియాంకా చోప్రా కోపానికి కారణం ఈ అంశమే. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించాల్సింది పోయి... ఈ విధంగా అర్థం లేకుండా మాట్లాడతారా? అంటూ సదరు సభ్యులపై ప్రియాంక నిప్పులు గక్కారు. కేవలం స్కర్టులు వేసుకోవడం వల్లనే రేప్‌లు జరుగుతున్నాయనడం అమానుషమనీ, కామాంధుల చర్యలను తప్పుబట్టకుండా... మహిళల్ని వేలెత్తి చూపిస్తున్న మీరసలు మగాళ్లేనా అంటూ ప్రియాంక అంతెత్తున లేచారు. ‘‘ఈ విషయంపై నేను కూడా కోర్టుకెళ్తా. ఐటమ్ సాంగ్స్‌లో నర్తించడం వ్యభిచారం ఎలా అవుతుందో తేల్చుకుంటా. ఇలా మహిళలపై బాధ్యత లేకుండా కామెట్లు చేసిన మగాళ్లందరూ లంగాలు కట్టుకొని తిరగాలని ప్రకటించాలంటూ కోర్టును అభ్యర్థిస్తా’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు ప్రియాంక. -
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'
జింద్(హర్యానా): మహిళలు జీన్స్ ధరించకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ డిమాండ్ చేసిన మరుసటి రోజే... అదే సంస్థ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్తామని ఓ విలేకరితో చెప్పారు. ' ఈ విషయంపై మా నాయకులతో చర్చిస్తున్నాం. ఐటెం గాల్స్ ను సుప్రీంకోర్టు వేశ్యలుగా ప్రకటిస్తే సమాజం వారిని బహిష్కరిస్తుంది' అని వ్యాఖ్యానించారు. కురుచ దస్తులు ధరించి సినిమాల్లో కలిపించే ఐటెంగాల్స్, హీరోయిన్లను వేశ్యలుగా పరిగణించాలని త్యాగి పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. తమ న్యాయవాదులతో మాట్లాడుతున్నందున ఈ విషయాన్ని ఇప్పుడే బహిరంగంగా వెల్లడించలేనని అన్నారు. పొట్టి బట్టలు వేసుకుని సినిమాల్లో తైతక్కలాడడం వల్లే మహిళలపై ఘోరాలు పెరుగుతున్నాయని త్యాగి అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, కాలేజీల్లో ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ ఉండాలని సెల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ సోమవారం డిమాండ్ చేసింది. -
ఎందరికో పండు తనువు పుండు
కామారెడ్డి, న్యూస్‌లైన్: పొట్ట నింపుకోవడం కోసం కొందరు మ హిళలు పరువాలను పణంగా పెడుతున్నారు. అరువు దెచ్చుకున్న నవ్వుల తో, అలంకరించుకొని బేరాల కోసం దారులు వెదుక్కుంటున్నారు. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తే అరెస్టు అయి జరిమానాలు కట్టి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసరాలలో రహదారులకు ఇరువైపులా శరీరాల సంత సాగుతోం ది. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న లాడ్జీల సాక్షిగా పడుపువృత్తి నడుస్తోంది. కొందరు మహిళలు దీనినే జీవనాధారంగా మార్చుకున్నారు. గతంలో పాతబస్టాండ్ అడ్డాగా సాగిన వీరి దందా, ఇప్పుడు కొత్తబస్టాండ్ పరిసరాలలోకి మారింది. వచ్చిన దాంట్లో సగభాగం లాడ్జీ యజమానులకు చెల్లించాల్సిందే. శారీరకంగా కృశిస్తున్నా వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబ పోషణ ఏమోగాని రోగాలను నయం చేసుకునేందుకే సరిపోతోంది. వైద్యం చేయించుకు నేందుకు డబ్బులు లేక మృత్యువాత పడుతున్నవారూ ఉన్నారు. రోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వీరి దందా కొనసాగుతోంది. బస్టాండ్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ప్రజలు సంచరిస్తుంటారు. తాగిన మత్తులో వచ్చే విటులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారిని ఎదిరించలేక, ఈ శరీరం తమది కాదన్నట్టుగా ఒదిగిపోయే విధానానికి అలవాటు పడిపోయారు. పొట్టపోసుకునేందుకు తమ బతుకులింతేననుకుని ఈ రోజు ముగిసింది, రేపటి రోజు చూసుకుందామనే దారిలో సాగిపోతున్నారు. ఇక్కడ వ్యభిచారం చేసే వారంతా పేదరికంతోనే ఈ వ ృత్తిలోకి వచ్చారనేది మాత్రం నిజం. గతంలో ఓ లాడ్జీలో మహిళ హత్యకు గురైంది. ఇటీవల కామారెడ్డి పట్టణ శి వారులో, సదాశివనగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు మహిళల హత్యలు కూడా ఈ కారణంతోనే జరిగాయి. హత్య కేసులను చేదించడం పోలీసులకు సవా ల్గా మారుతోంది. క్లూ దొరికేదాక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ వృత్తిని నిర్మూలిస్తే ఇలాంటి హత్య లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ మహిళలు రహదారుల వెంట నిలబడే తీరు ఇతర మహిళలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పురుషులు సైతం ఇక్కడి వాతావరణాన్ని చూసి ఇబ్బందులు పడుతు న్నారు. లాడ్జీలలో వ్యభిచారం అనేది బహిరంగ రహస్యం. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేసి దొరికినవారిని పట్టుకెళ్లి రిమాండుకు పంపి చేతులు దులుపుకుంటారు. ఆ మహిళ లు ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చారన్న విషయాన్ని ప్రభుత్వ యం త్రాంగం పట్టించుకోవడం లేదు. వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపితే కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంది. పోలీసు అధికారులతోపాటు ఇతర అధికారులు ఒక ప్రణాళిక రూపొందించి పడుపు వృత్తిలోకి దిగిన మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారు ఇరత వృత్తులు చేసుకునేందుకు మార్గం చూపాలి. ప్రభుత్వ పథకాలను అందించి వారిలో మార్పు తీసుకురావాలి. ఒక్క కామారెడ్డి పట్టణంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా నడుస్తున్న వ్యభిచారాన్ని నిరోదించేందుకు తగు ప్రణాళికలు రూపొం దించాలి. దాబాల్లో మద్యం తాగడాన్ని నిషేధించి పకడ్బం దీగా అమలు చేస్తున్న పోలీసు యంత్రాంగం పడుపు వృత్తిపై కూడా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు సూచిస్తున్నారు.