
అయితే, దీనిపై పుతిన్ తాజాగా స్పందించినట్లు టీఏఎస్‌ఎస్ అనే సంస్థ తెలిపింది. 'ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుడు వార్తలు ట్రంప్ ప్రచారం చేసేవారంతా కూడా వేశ్యలకంటే కూడా పనికిరానివాళ్లు. ట్రంప్ అమ్మాయిలతో గడిపాడని, అవి తమ వద్ద ఉన్నట్లు చేస్తున్న ప్రచారం మొత్తం కూడా అమెరికాలో ట్రంప్ వ్యతిరేక వర్గం(పరోక్షంగా ఒబామాను ఉద్దేశించి) చేస్తున్న ఆరోపణలు మాత్రమే. అసలు ఇలాంటివాటిని ప్రచారం చేసేవారిని నైతిక విలువలు లేనివారిగానే పరిగణించాలి' అంటూ పుతిన్ చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది.