పోలీసు స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం! | Watch as prostitutes sell sex for 30 at seedy hotel just yards from police station | Sakshi
Sakshi News home page

పోలీసు స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం!

Published Mon, May 9 2016 4:16 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

పోలీసు స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం! - Sakshi

పోలీసు స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం!

ఆ హోటల్‌కు ఎదురుగానే పోలీసు స్టేషన్ ఉంటుంది. హోటల్ ముందు కానిస్టేబుళ్లు ఎప్పుడూ తచ్చాడుతూ ఉంటారు. కానీ హోటల్ నిండా జరిగిదే వ్యభిచారమే. కేవలం 40 పౌండ్లు (రూ. 3800) ఇస్తే చాలు సెక్స్‌ వర్కర్లు అందుబాటులోకి వస్తారు. కావాల్సినంత సుఖం పంచుతారు. ఇది తూర్పు లండన్‌లోని స్టార్ హోటల్‌ హర్ట్లీలో జరుగుతున్న బాగోతం ఇది. ఫారెస్ట్ గేట్ పోలీసు స్టేషన్ ఎదురుగానే ఉన్న ఈ హోటల్‌కు వ్యభిచారం విషయంలో పెద్ద చరిత్రే ఉంది. గతంలో ఇక్కడ బస చేసిన పలువురు పర్యాటకులు కూడా ఇది అత్యంత చెత్త హోటల్‌ అని, ఇక్కడ ప్రాస్టిట్యూషన్‌ బాగా జరుగుతుందని ట్రిప్అడ్వయిజర్‌ వెబ్‌సైట్‌లో సైతం అభిప్రాయాలు తెలిపారు.

ఈ హోటల్‌ నేరుగా అమ్మాయిలను సప్లయి చేయదు. కానీ ఇంటర్నెట్‌లో యాడ్స్‌ ద్వారా అమ్మాయిలను బుక్‌ చేసుకొని ఈ హోటల్‌కు రప్పించుకోవచ్చు. ఈ హోటల్‌లో జరుగుతున్న బాగోతంపై తాజాగా 'సండే పీపుల్‌' అనే మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. 40 పౌండ్లకు రిపోర్టర్‌తో 15 నిమిషాలు గడుపడానికి యామీ అనే ఒక మహిళ ముందుకొచ్చింది. ఈ హోటల్‌లో రూమ్‌ నంబర్ 37కు రావాల్సిందిగా ఆమె రిపోర్టరకు మెసేజ్ పంపింది. రిపోర్టర్‌కు హోటల్‌కు వెళ్లేసమయంలో అక్కడ యూనిఫామ్‌లోని పోలీసులు తిరుగుతూ కనిపించారు.

అయినా, హోటల్ రిసెప్షనిస్ట్‌ యామీ ఉన్న గదికి అతన్ని పంపించారు. ప్రకటనలో తనకు 20 ఏళ్లు అని చెప్పినప్పటికీ కొంచె వయస్సు ఎక్కువగా ఉన్న మహిళ అక్కడ రిపోర్టర్‌ను పలుకరించింది. అతడు ఇచ్చిన డబ్బుల్ని తీసుకుంది. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత.. 'సారీ' చెప్పి అక్కడి నుంచి రిపోర్టర్‌ వెళ్లబోతుండగా.. 'దుస్తులు తీసేయ్‌.. కమాన్‌ బేబీ' అంటూ ఆమె అతడిని ఒత్తిడి చేసింది. అతడు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. లండన్‌లోని అత్యంత చెత్త హోటళ్లలో ఒకటిగా హర్ట్లీ హోటల్‌ పేరుపడింది. ఈ హోటల్‌ లో తాము దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నట్టు పలువురు పర్యాటకులు ట్రిప్‌ అడ్వయిజర్‌ వెబ్‌సైట్‌లో తమ అభిప్రాయాలు వెల్లడించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement