మీరసలు మగాళ్లేనా..! | Priyanka Chopra Reacts On 'Item Girls Should Be Declared Prostitutes’ | Sakshi
Sakshi News home page

మీరసలు మగాళ్లేనా..!

Published Tue, Dec 9 2014 10:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మీరసలు  మగాళ్లేనా..! - Sakshi

మీరసలు మగాళ్లేనా..!

 బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రాకు కోపం వచ్చింది. ఇంతకీ ప్రియాంక కోపానికి కారణం ఏంటా? అనుకుంటున్నారా! ఓ సంస్థకు చెందిన సభ్యులు... ‘ఐటమ్ సాంగ్స్‌లో నర్తించే నటీమణులను వ్యభిచారిణులుగా ప్రకటించాలి’ అంటూ కోర్టును ఆశ్రయించనున్నారు. వారి అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా వ్యక్తపరిచారు కూడా. అమ్మాయిల అసభ్యకరమైన వస్త్రధారణ వల్లనే సమాజంలో మానభంగాలు ఎక్కువయ్యాయనీ, చిన్న చిన్న స్కర్టుల్లో కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా వారి వస్త్రధారణ ఉంటోందనీ సదరు సంస్థ వారు దుయ్యబట్టారు. ప్రియాంకా చోప్రా కోపానికి కారణం ఈ అంశమే. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించాల్సింది పోయి...
 
 ఈ విధంగా అర్థం లేకుండా మాట్లాడతారా? అంటూ సదరు సభ్యులపై ప్రియాంక నిప్పులు గక్కారు. కేవలం స్కర్టులు వేసుకోవడం వల్లనే రేప్‌లు జరుగుతున్నాయనడం అమానుషమనీ, కామాంధుల చర్యలను తప్పుబట్టకుండా... మహిళల్ని వేలెత్తి చూపిస్తున్న మీరసలు మగాళ్లేనా అంటూ ప్రియాంక అంతెత్తున లేచారు. ‘‘ఈ విషయంపై నేను కూడా కోర్టుకెళ్తా. ఐటమ్ సాంగ్స్‌లో నర్తించడం వ్యభిచారం ఎలా అవుతుందో తేల్చుకుంటా. ఇలా మహిళలపై బాధ్యత లేకుండా కామెట్లు చేసిన మగాళ్లందరూ లంగాలు కట్టుకొని తిరగాలని ప్రకటించాలంటూ కోర్టును అభ్యర్థిస్తా’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు  ప్రియాంక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement