కంపెనీ సొమ్మును వేశ్యలపై తగలేసిన సీఈవో
ఇటీవల కుప్పకూలిన బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-మౌంట్‌గాక్స్ అధిపతికి సంబంధించి మరో బండారం బయటపడింది. ఆన్‌లైన్ వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై తగలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. కాల్పనిక నగదు (వర్చువల్ కరెన్సీ) పేరిట వినియోగదారుల నుంచి వందలకోట్ల వసూలుచేసిన బిట్‌కాయిన్ సంస్థ ఇటీవల దివాళా తీసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వినియోగదారుల ఆన్‌లైన్ ఖాతాల నుంచి వర్చువల్ నగదు మాయమైన వ్యవహారంలో కంపెనీ సీఈవో కార్పెలస్ హస్తం కూడా ఉందని, అతను మోసపూరితంగా వినియోగదారులకు చెందిన 1.66 లక్షల డాలర్లను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఈ వ్యవహారంలో జపాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా అతనిపై మరికొన్ని అభియోగాలు వెలుగుచూశాయి. వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై ఖర్చు చేశాడని, శృంగార సేవలు లభించే కార్యక్రమాల్లో పాల్గొని మహిళలపై అతను ఈ సొమ్ము ఖర్చు పెట్టాడని జపాన్ మీడియా తెలిపింది. 2011-13 మధ్యకాలంలో తనకు చెందిన డజన్ కంపెనీల్లోకి నిధులు మళ్లించిన వ్యవహారంపై కార్పెలస్ మొదట అరెస్టయ్యాడు. అనంతరం విడుదలైన అతన్ని బిట్‌కాయిన్ డిపాజిట్లను మళ్లించిన వ్యవహారంలో మళ్లీ అరెస్టు చేశారు.