కామారెడ్డి, న్యూస్‌లైన్: పొట్ట నింపుకోవడం కోసం కొందరు మ హిళలు పరువాలను పణంగా పెడుతున్నారు. అరువు దెచ్చుకున్న నవ్వుల తో, అలంకరించుకొని బేరాల కోసం దారులు వెదుక్కుంటున్నారు. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తే అరెస్టు అయి జరిమానాలు కట్టి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసరాలలో రహదారులకు ఇరువైపులా శరీరాల సంత సాగుతోం ది. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న లాడ్జీల సాక్షిగా పడుపువృత్తి నడుస్తోంది. కొందరు మహిళలు దీనినే జీవనాధారంగా మార్చుకున్నారు. గతంలో పాతబస్టాండ్ అడ్డాగా సాగిన వీరి దందా, ఇప్పుడు కొత్తబస్టాండ్ పరిసరాలలోకి మారింది. వచ్చిన దాంట్లో సగభాగం లాడ్జీ యజమానులకు చెల్లించాల్సిందే.
శారీరకంగా కృశిస్తున్నా
వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబ పోషణ ఏమోగాని రోగాలను నయం చేసుకునేందుకే సరిపోతోంది. వైద్యం చేయించుకు నేందుకు డబ్బులు లేక మృత్యువాత పడుతున్నవారూ ఉన్నారు. రోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వీరి దందా కొనసాగుతోంది. బస్టాండ్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ప్రజలు సంచరిస్తుంటారు. తాగిన మత్తులో వచ్చే విటులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారిని ఎదిరించలేక, ఈ శరీరం తమది కాదన్నట్టుగా ఒదిగిపోయే విధానానికి అలవాటు పడిపోయారు. పొట్టపోసుకునేందుకు తమ బతుకులింతేననుకుని ఈ రోజు ముగిసింది, రేపటి రోజు చూసుకుందామనే దారిలో సాగిపోతున్నారు.
ఇక్కడ వ్యభిచారం చేసే వారంతా పేదరికంతోనే ఈ వ ృత్తిలోకి వచ్చారనేది మాత్రం నిజం. గతంలో ఓ లాడ్జీలో మహిళ హత్యకు గురైంది. ఇటీవల కామారెడ్డి పట్టణ శి వారులో, సదాశివనగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు మహిళల హత్యలు కూడా ఈ కారణంతోనే జరిగాయి. హత్య కేసులను చేదించడం పోలీసులకు సవా ల్‌గా మారుతోంది. క్లూ దొరికేదాక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ వృత్తిని నిర్మూలిస్తే ఇలాంటి హత్య లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఈ మహిళలు రహదారుల వెంట నిలబడే తీరు ఇతర మహిళలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పురుషులు సైతం ఇక్కడి వాతావరణాన్ని చూసి ఇబ్బందులు పడుతు న్నారు. లాడ్జీలలో వ్యభిచారం అనేది బహిరంగ రహస్యం. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేసి దొరికినవారిని పట్టుకెళ్లి రిమాండుకు పంపి చేతులు దులుపుకుంటారు. ఆ మహిళ లు ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చారన్న విషయాన్ని ప్రభుత్వ యం త్రాంగం పట్టించుకోవడం లేదు. వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపితే కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంది.
పోలీసు అధికారులతోపాటు ఇతర అధికారులు ఒక ప్రణాళిక రూపొందించి పడుపు వృత్తిలోకి దిగిన మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారు ఇరత వృత్తులు చేసుకునేందుకు మార్గం చూపాలి. ప్రభుత్వ పథకాలను అందించి వారిలో మార్పు తీసుకురావాలి. ఒక్క కామారెడ్డి పట్టణంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా నడుస్తున్న వ్యభిచారాన్ని నిరోదించేందుకు తగు ప్రణాళికలు రూపొం దించాలి. దాబాల్లో మద్యం తాగడాన్ని నిషేధించి పకడ్బం దీగా అమలు చేస్తున్న పోలీసు యంత్రాంగం పడుపు వృత్తిపై కూడా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు సూచిస్తున్నారు.
ఎందరికో పండు తనువు పుండు
Published Sun, Dec 29 2013 5:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement