
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
కుషాయిగూడ (హైదరాబాద్): ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నూర్జహాన్, ప్రియాంక, శేఖర్‌రెడ్డి అనే ముగ్గురు మౌలాలి హసింగ్‌బోర్డు, కృష్ణానగర్ కాలనీలో గతకొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు.
విషయం తెలిసిన పోలీసులు దాడులు జరిపి విటులు వెంకటేశ్, అఖిల్, వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువతలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు శేఖర్‌రెడ్డి, ప్రియాంకను అరెస్టు చేయగా నూర్జహాన్ పరారీలో ఉంది. కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న యువతులను స్టేట్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.