KPHP Police
-
కేపీహెచ్‌బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్
మూసాపేట: కేపీహెచ్‌బీకాలనీ మెట్రో స్టేషన్, బస్టాప్ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహించే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు 6 టీములుగా ఏర్పడి మంగళవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కేపీహెచ్‌బీ బస్టాప్, మెట్రో స్టేషన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 మంది మహిళలను అరెస్టు చేసి కూకట్పల్లి ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. ప్రతి నెలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కార్పొరేట్ కాలేజీల పీఆర్ఓల అరెస్ట్
హైదరాబాద్: విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్న కార్పొరేట్ కాలేజీల పీఆర్ఓలను కేపీహెచ్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. మెడికల్ కౌన్సెలింగ్ కు వచ్చిన విద్యార్థులను వీరు తప్పుదోవ పట్టించారు. అంతేకాకుండా తమ కాలేజీల్లో ఎంసెట్ లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో 10 మంది పీఆర్ఓలను విద్యార్థులు కౌన్సెలింగ్ అధికారులకు అప్పగించారు. తర్వాత వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.