పురిటిబిడ్డను చంపబోయిన తల్లి | Newborns killing mother | Sakshi
Sakshi News home page

పురిటిబిడ్డను చంపబోయిన తల్లి

Published Tue, Mar 8 2016 3:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

పురిటిబిడ్డను చంపబోయిన తల్లి

పురిటిబిడ్డను చంపబోయిన తల్లి

కేసు నమోదు

 హిందూపురం  : ఆడపిల్ల పుట్టడంతో ఆవేదనకు లోనై చంపబోయిన బాలింతపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లికి చెందిన కళావతికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. మూడవ కాన్పులో మగపిల్లాడు పుట్టి చనిపోయాడు. తిరిగి గర్భం దాల్చిన ఆమెకు శనివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపు ఇంటి వద్దనే ప్రసవమైంది. ఆడపిల్ల పుట్టడంతో మనస్థాపానికి గురైంది. అదే సమయంలో తల్లీబిడ్డను ఆదివారం ఉదయం 6.55గంటలకు  హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

8 గంటలకు సిబ్బంది డ్యూటీ మారే సమయంలో ఆడబిడ్డను వదిలించుకునేందుకు తల్లి ప్రయత్నించింది. పసికందు గొంతు నులమడంతో నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చింది. అదే సమయంలో ఇతరులు గదిలోకి రావడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది శిశువుకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి అనంతరం కర్నూలుకు తీసుకెళ్లినట్లు స్థానిక ఆస్పత్రి సూపరింటెండెండ్ కేశవులు తెలిపారు. ఘటనపై వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement