Primary treatment
-
మంచిర్యాల జేసీ వాహనం ఢీకొని ఒకరికి..
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి బస్టాండ్ వద్ద రాజీవ్‌రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సుధాకర్ వాహనం ఆదివారం ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కమాన్ ప్రాంతంలో నివాసముండే బాల ఏసు (52) బస్టాండ్ ఎదురుగా రాజీవ్‌రహదారి దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అవతలి వైపు వాహనం రావడం గమనించిన ఏసు వెనక్కి మళ్లడంతో జేసీ వాహనం అతడిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమైన బాధితుడిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌కు తరలించారు. -
కరుణ లేని పాలకుడు..!
రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యానికి, శోకానికి పాలకుడు కారణం కారాదు. ఆంధ్రప్రదేశ్‌లో అనారో గ్యం తాండవిస్తోంది. ప్రభుత్వానికి ప్రజల ఆరో గ్యంపై శ్రద్ధ లేదనే విషయం అడుగడుగునా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదా సీనతే దీనికి కారణం. రాష్ట్రంలోని ప్రాథమిక వైద్యశాలలన్నీ నరకకూపాలుగా మారాయి. విష జ్వరాలకు మందుల్లేక పీహెచ్‌సీలు వట్టి పోయాయి. నిరంతర వర్షాల వల్ల ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి జ్వరాల పాలబడు తున్నారు. లక్ష కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ఉన్న ప్రభుత్వం పీహెచ్‌సీలను పనిగట్టుకుని నిర్భాగ్యంగా ఉంచటం దారుణం. ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ప్రజలు విలవిలలాడుతుంటే మరోవైపు వెంటిలేటర్స్, బ్లడ్‌టెస్ట్ ల్యాబ్‌లు, మందులు, సరైన గదులు, శుభ్రత, సిబ్బంది లేక పీహెచ్‌సీలు తేలిపోతున్నాయి. ప్రజలు తమ ఇళ్ళ కంటే పీహెచ్ సీలే అధ్వాన్న స్థితిలో ఉన్నా యని వెనక్కి వస్తున్నారు. ‘పరిపాలనాదక్షుణ్ణి, నన్ను మిం చినవారు’ లేరనే చంద్రబాబు పాలనలో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? ఆయనకు కరుణ లేదా? ప్రజల మీద ప్రేమ లేదా? ప్రజలు అనా రోగ్యాన్ని ముఖ్యమంత్రి ఇష్టపడుతున్నారా? సాక్షాత్తు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో ప్రాథమిక వైద్య శాల పిచ్చిమొక్కలు పెరిగి ప్రజలు లోనికి వెళ్ళడా నికి వీల్లేకుండా ఉంది. సభాపతి కోడెల శివప్రసాద్ రావు ప్రాంతమైన నరసరావుపేట, సత్తెనపల్లి పీహెచ్‌సీలన్నీ నరక కూపాలుగా ఉన్నాయి. ఆయ నేమో బాత్రూమ్లు కట్టించడంలో జాతీయ అవా ర్డులు పొందాలని చూస్తున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గం చిల కలూరిపేటలో పీహెచ్‌సీలు అధ్వానంగా ఉన్నాయి. యడ్లపాడు, నాదెండ్ల, గణపవరం పీహెచ్సీలలో వైద్యులే వైద్యశాలలకు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక వైద్యం ఎందుకు చేయించలేకపోతోంది? వైద్యులు సకా లంలో వైద్యశాలకు వచ్చేటట్లు ఎందుకు చూడలేక పోతుంది? ఎంతోమంది జ్వరాలతో మరణిస్తు న్నారు. వృద్ధులైతే కుక్కి మంచం మీద పడుకుని కనీసం కషాయం ఇచ్చేవాళ్ళు అల్లాడుతున్నారు. మరణిస్తే తీసుకెళ్లేవాళ్లు లేక, చనిపోయినవారిని పూడ్చిపెట్టేవారు లేక, పూడ్చిపెట్టడానికి శ్మశానాల్లో స్థలాలు లేక, జీవించే హక్కు లేక, అకాలంగా మరణించినవారిని ఖననం చేసే స్థితి లేక ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ రెన్స్‌లు జరుపుతూ కాలక్షేపం చేయడం ధర్మమా! ప్రజలు కడుతున్న పన్ను ప్రజలకు ఖర్చుపెట్ట కుండా మిగిలిపోతున్న నేపథ్యంలో ప్రజల దుర్భ రమైన పరిస్థితి కళ్లనీళ్లు తెప్పించడం లేదా! 2015- 16 బడ్జెట్‌ని చూస్తే ఒక లక్షా పదమూడు వేల కోట్ల బడ్జెట్లో 64 శాతం ప్రణాళికేతర వ్యయం చూపిం చారు. మిగిలిన 36 శాతం నిధులను రెవెన్యూ ఖాతా కింద చూపించారు. ఒకసారి ఆ ప్రణాళికేతర వ్యయాన్ని పరిశీలిస్తే జీతాలు రూ.30,403 కోట్లు, పింఛన్లు రూ.11,828 కోట్లు, వేతనేతర వ్యయం రూ.2,839 కోట్లు, నిర్వహణ రూ. 939 కోట్లు, సబ్సిడీలు, ఇతర గ్రాంట్లు రూ14,816 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ11,189 కోట్లు, రుణాల చెల్లింపులు రూ.5,087 కోట్లు, ఇతర ఖర్చులు రూ.1,536 కోట్లు ఈ మొత్తం ప్రణాళికేతర వ్యయం 78,637 కోట్లు ఉంది. ఇక ప్రణాళిక వ్యయం విష యానికొస్తే వ్యవసాయం, గ్రామీ ణాభివృద్ధికి రూ.10,424 కోట్లు, జలవనరులు రూ. 4,678 కోట్లు, విద్యుత్తు రూ. 96 కోట్లు, సామా జిక సేవలు రూ.14,904 కోట్లు, రవాణా రూ. 2,155 కోట్లు, ఇత రత్రా 2,150 కోట్లు ఈ మొత్తం రూ. 34,307 కోట్లవరకు ఉంది. ఇందులో ఉద్యోగులకు ఇస్తున్న 30,403 కోట్ల రూపాయలకు రూ. 10,200 కోట్ల రూపాయలు మాత్రమే పని రాబటు ్టకుంటారని విశ్లేషకుల అంచనా. కార్పొరేట్ వైద్య వ్యవస్థకు ఆరోగ్యశ్రీ పేరుతో వేలాది కోట్ల రూపా యలు తగలెట్టడానికి బదులు ప్రభుత్వ వైద్యాన్నే ఎందుకు అభివృద్ధి చేయట్లేదు! చంద్రబాబు రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, తన సామాజిక వర్గం బలంగా ఆశ్ర యించి వున్న కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయ డానికి రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమం సాగిస్తు న్నారు ఇది తెలుగు జాతికి వెన్నుపోటు పొడవటమే. నాయకత్వం అంటే ప్రజలను నడిపించటం అని అర్థం. కానీ, ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యా నికి, శోకానికి పాలకుడు కారణం కాకూడదు. ఆరో గ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అనేక కోణాల్లో నిలదీసే చైతన్యం కావాలి. ‘రాజ్యం అనేది మానవుల కోర్కెలను, ఆశలనూ సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికీ, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు సమతుల్యంగా ఉండాలని’ అంభేడ్కర్ భావించారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజ్యావిష్కరణ కోసం, ప్రత్యామ్నాయ చైతన్యంతో ముందుకెళ్లాల్సిన చారిత్రక సందర్భం ఇది. - డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, అధ్యక్షులు, నవ్యాంధ్రపార్టీ. మొబైల్: 9849741695 -
‘హద్దు’ దాటి వైద్యం
► ప్రైవేటును తలపిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు ► ప్రజల ప్రాణాలతో చెలగాటం ► ఫిర్యాదులు వస్తున్నాస్పందించని యంత్రాంగం ► ఎక్కడికక్కడ ‘మామూళ్ల’ పర్వం హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో ఉన్న ఓ వైద్యశాలను నాలుగు రోజుల క్రితం జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకురాలికి వైద్యశిక్షణ పొందినట్లు ధ్రువీకరణ లేదు. అసలు ఆ వైద్యశాలకు ప్రభుత్వ అనుమతే లేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో ఆస్పత్రిని మూసేసి.. మందులను సీజ్ చేశారు.. ఇలాంటి వైద్యశాలలు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి. వాటి నిర్వాహకులు అధికారుల చేయి తడిపి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అనంతపురం మెడికల్ : వైద్య,ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో కనీన వైద్య పరిజ్ఞానం లేని కొందరు రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ)లుగా కొనసాగుతున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా..అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వైద్యశాలలు అనంతపురం నగరంలోనే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆయుష్షు ఉంటే బతికేస్తున్నారు! జిల్లావ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు రెండు వేలకు పైగానే ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అయితే.. ఏకంగా పడకల ఆస్పత్రులే నడుపుతున్నారు. సూది మందు, సెలైన్లు ఎక్కించడం నిషిద్ధం. దీన్ని బేఖాతరు చేస్తూ శస్త్ర చికిత్స వరకు అన్నీ చేసేస్తున్నారు. మందుల విక్రయ దుకాణం నడపాలంటే లెసైన్స్ తప్పనిసరి. దుకాణదారుడికు బీ ఫార్మసీ విద్యార్హత ఉండాలి. ఇవేవీ పట్టించుకోకుండా మందులు విక్రయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థాయిలో హద్దుదాటి వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగికి ఆయుష్షు ఉంటే బతికేస్తున్నాడు. లేకుంటే ప్రాణాలు పోవాల్సిందే. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం తదితర పట్టణాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల హవా కొనసాగుతోంది. కంటితుడుపుగా దాడులు ఇటీవల కలెక్టరేట్లో మాతృమరణాలపై కలెక్టర్ కోన శశిధర్ సమీక్షించారు. ఈ సందర్భంగా హిందూపురంలోని ఓ వైద్యశాల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణం పోయిందని బాధితుడు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్.. తక్షణం చర్యలకు ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కేవలం ఒకరోజు కంటితుడుపుగా తనిఖీలు చేసి చేతులుదులుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో అనధికారిక క్లినిక్‌లు ఉన్నా పట్టించుకోవడం లేదు. వాటి నిర్వాహకులు ముడుపులు చెల్లిస్తుండటంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇతర ప్రాంతాల సంగతి పక్కన పెడితే అనంతపురం శివారు కాలనీలతో పాటు సాయినగర్, కమలానగర్, పాతూరు, రాజీవ్‌కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నకిలీ వైద్యులు ఉన్నారు. అలాగే మందుల దుకాణాల నిర్వాహకులు ఆర్ఎంపీలకు ఒక గదిని కేటాయించి ప్రజలకు ఉచిత ఓపీ పేరుతో మందుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా వైద్యాధికారులకు కనపడకపోవడం గమనార్హం. -
పురిటిబిడ్డను చంపబోయిన తల్లి
కేసు నమోదు హిందూపురం : ఆడపిల్ల పుట్టడంతో ఆవేదనకు లోనై చంపబోయిన బాలింతపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లికి చెందిన కళావతికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. మూడవ కాన్పులో మగపిల్లాడు పుట్టి చనిపోయాడు. తిరిగి గర్భం దాల్చిన ఆమెకు శనివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపు ఇంటి వద్దనే ప్రసవమైంది. ఆడపిల్ల పుట్టడంతో మనస్థాపానికి గురైంది. అదే సమయంలో తల్లీబిడ్డను ఆదివారం ఉదయం 6.55గంటలకు హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. 8 గంటలకు సిబ్బంది డ్యూటీ మారే సమయంలో ఆడబిడ్డను వదిలించుకునేందుకు తల్లి ప్రయత్నించింది. పసికందు గొంతు నులమడంతో నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చింది. అదే సమయంలో ఇతరులు గదిలోకి రావడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది శిశువుకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి అనంతరం కర్నూలుకు తీసుకెళ్లినట్లు స్థానిక ఆస్పత్రి సూపరింటెండెండ్ కేశవులు తెలిపారు. ఘటనపై వన్‌టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పాము మంత్రం పని చేస్తుందా?
పాము కరవగానే ప్రాథమిక చికిత్స గురించి ఆలోచించకుండా పాము మంత్రాన్ని ఆశ్రయించేవాళ్లు ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నారు. ఇంతకీ అసలు ఆ పాము మంత్రం పనిచేస్తుందా? విషం విరుగుతుందా? మంత్రానికి పాము విషం విరుగుతుందనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మన దేశంలో మొత్తం వంద రకాల పాములు ఉన్నాయి. అందులో తొంభై రకాల పాములకు విషం ఉండదు. త్రాచు, రక్తపింజర, కట్లపాము, ఒక రకమైన సముద్రపు పాముల్లో మాత్రమే విషం ఉంటుంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్ల... పాము కరిచింది అనగానే విపరీతంగా ఆందోళనపడతారు. ఆ ఆందోళనను క్యాష్ చేసుకోడానికే కొందరు మంత్రం వేస్తామనేవారు. కొందరేమో ‘నీకేం కాదు’ అని ధైర్యం చెప్పడానికి, భయాన్ని పారదోలడానికి పాము మంత్రం వేసేవాళ్లు. అంతే తప్ప ‘పాము మంత్రం’ అనేది విషానికి విరుగుడు కానే కాదు. అది తెలియక కొందరు విషసర్పం కాటేసినప్పుడు పాము మంత్రం చాలనుకుని చికిత్స గురించి ఆలోచించక ప్రాణాలు కోల్పో తున్నారు. పాము మంత్రం ‘ఫెయిత్ హీలింగ్’ తప్ప విషం విరుగుడు కాదు. -
గోవిందరాజు పై పంది దాడి
ఉప్పలగుప్తం : పంది దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉప్పలగుప్తానికి చెందిన కేతా గోవిందరాజు బుధవారం గ్రామంలోని శ్మశానవాటిక వైపు కాలినడకన వెళుతుండగా, అదే ప్రాంతంలో సంచరిస్తున్న పంది అతడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన గోవిందరాజుకు స్థానికులు ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బతికించాల్సిన వారే.. బయటికి గెంటేశారు
- గాయపడిన వ్యక్తికి 13 రోజులుగా చికిత్స అందించని ప్రభుత్వ వైద్యులు - కుళ్లిపోరున బాధితుడి కాలు - దుర్వాసన వచ్చి పురుగులు పట్టినా పట్టించుకోని సిబ్బంది - కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో అందిన చికిత్స - సూపరింటెండెంట్‌ను సస్పెండ్ - చేయూలని ఆస్పత్రి ఎదుట ధర్నా మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి 13 రోజుల క్రితం ఏరియా ఆస్పత్రికి రాగా వైద్యులు కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అతడి కాలికి సెఫ్టిక్ అరుు్య పురుగులు పడి కుళ్లిపోరుుంది. దుర్వాసన వస్తుండడంతో రోగులిచ్చిన సమాచారంతో కాంగ్రెస్ నాయకులు రాగా అసలు విషయం బయటపడింది. మానుకోట ఏరియూ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నారుు. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన భాస్కర్ల మోహన్ 13 రోజుల క్రితం పని మీద మానుకోటకు వచ్చాడు. పట్టణంలోని పాతబజారులోని రూరల్‌పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. స్థానికుల సహకారంతో ఏరియా ఆస్పత్రికి చేరుకున్న అతడికి వైద్యులు చికిత్స అందించలేదు. కనీసం అడ్మిట్ కూడా చేసుకోలేదు. సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో చేసేదేమి లేక ఆస్పత్రి ఆవరణలోనే జీవచ్ఛవంగా ఉండిపోయాడు. ఎడమ కాలి నుంచి రక్తం కారి చివరికి కుళ్లిపోరుు కాలి ఎముకలు కూడా బయటకెళ్లారు. కుళ్లిపోరు పురుగులు వస్తున్నా, కంపు కొడుతున్నా అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అటువైపు నుంచి వైద్యులు, రోగులు వెళ్తూ ఆ దుర్వాసన భరించలేక ముక్కు మూసుకున్నారే తప్పా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చిన కొందరు రోగులు కాంగ్రెస్ నాయకులకు సమాచారమిచ్చారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మూలగుండ్ల వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.వెంకట్రాములు అక్కడికి చేరుకోగా.. విధుల్లో ఇంత నిర్లక్ష్యమా అని నాయకులు నిలదీశారు. ఆయన మాత్రం తనకు ఈ విషయం తెలియదని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వారికి ఆయనతో తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో వారు డీఎంఅండ్హెచ్ డీసీహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన వైద్యులు మోహన్‌ను ఆస్పత్రిలోని వార్డుకు తీసుకె ళ్లి చికిత్స ప్రారంభించారు. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయూలి : కాంగ్రెస్ నాయకులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏరియూ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.వెంకట్రాములును సస్పెండ్ చేయూలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ కాలు కోల్పోవడానికి కారణం వైద్యులేనన్నారు. కార్యక్రమంలో నాయకులు పంజాల శ్రీను, బొల్లు రాజు, అప్పె వేణు, గుగులోత్ వెంకట్, సోమ శ్రీనివాస్, వెంకటాచారి, భాస్కర్, వీరభద్రం, మహమూద్, ప్రసాద్, రోగులు, నాయకులు పాల్గొన్నారు. -
ఇక ‘యాక్సిడెంట్ ఫ్రీ’ రహదారులు!
ప్రయోగాత్మకంగా బీజాపూర్ హైవే ఎంపిక హైదరాబాద్: ప్రమాదాలను గణనీయంగా తగ్గించే తరహాలో రహదారుల నిర్మాణం.. వాటిపై నిరంతరం పోలీస్ పెట్రోలింగ్.. ప్రమాదం జరిగితే నిమిషాల్లో ఘటనాస్థలికి అంబులెన్సులు.. మెరుగైన ప్రాథమిక చికిత్స కోసం అక్కడక్కడా అత్యవసర వైద్యం అందించే ట్రామాకేర్ సెంటర్లు.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే రహదారుల నిర్వహణ వ్యవస్థ ఇది. ఇప్పుడు ప్రయోగాత్మకంగా తెలంగాణలో ఓ ప్రధాన రహదారిని ఈ తరహాలో అభివృద్ధి చేసే పని మొదలైంది. 124 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్-బీజాపూర్ హైవేని ఇదే విధంగా రూపొందించే పనికి రోడ్లు, భవనాల విభాగం శ్రీకారం చుట్టింది. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ రహదారికి ఆధునిక హంగులు అద్దనున్నారు. ఏడాదిన్నరలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా మరిన్ని ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తారు.