పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం | central medical team visits hindupur hospital | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం

Published Wed, Dec 7 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం

పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం

హిందూపురం అర్బన్‌ : పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వైద్య బృందం సభ్యులు నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ప్రొఫెసర్‌ లేఖసుబ్బయ్య, సహాయకులు డాక్టర్‌ ప్రభుస్వామి అన్నారు. బుధవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కేంద్ర వైద్య బృందం సభ్యులు పర్యటించారు. ముందుగా లేబర్‌ వార్డు, చిన్నపిల్లల, మెడికల్‌ వార్డులు, కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించారు. జనఽనీ సురక్షçయోజన, మెడాల్‌ ల్యాబ్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పనితీరు, చైల్డ్‌కేర్‌ వంటి పథకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వ నిధులు, వాటి వినియోగం గురించి ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర వైద్య పథకాల అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ధర్మవరం, హిందూపురం ఏరియా ఆస్పత్రులను సందర్శించామన్నారు. హిందూపురం ఆస్పత్రిలో వసతులు బాగున్నాయని, అయితే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని గుర్తించామన్నారు. కార్యక్రమంలో డీపీఓ కిషోర్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేశవులు, మెడికల్‌ ఆఫీసర్‌ పోలప్ప, ఆర్‌ఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన వైద్యబృందం
లేపాక్షి : కేంద్ర వైద్య బృందం సభ్యులు హిందూపురం ఆస్పత్రి పరిశీలన అనంతరం బుధవారం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. శిల్పాలు, చిత్రాలు తిలకించి, ఆలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement