lactating women
-
గర్బిణీలు,బాలింతలకు వైఎస్ఆర్ అమృత హస్తం
-
ప్రసవాలపై ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక శ్రద్ధ
-
పురిటిబిడ్డను చంపబోయిన తల్లి
కేసు నమోదు హిందూపురం : ఆడపిల్ల పుట్టడంతో ఆవేదనకు లోనై చంపబోయిన బాలింతపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లికి చెందిన కళావతికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. మూడవ కాన్పులో మగపిల్లాడు పుట్టి చనిపోయాడు. తిరిగి గర్భం దాల్చిన ఆమెకు శనివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపు ఇంటి వద్దనే ప్రసవమైంది. ఆడపిల్ల పుట్టడంతో మనస్థాపానికి గురైంది. అదే సమయంలో తల్లీబిడ్డను ఆదివారం ఉదయం 6.55గంటలకు హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. 8 గంటలకు సిబ్బంది డ్యూటీ మారే సమయంలో ఆడబిడ్డను వదిలించుకునేందుకు తల్లి ప్రయత్నించింది. పసికందు గొంతు నులమడంతో నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చింది. అదే సమయంలో ఇతరులు గదిలోకి రావడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది శిశువుకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి అనంతరం కర్నూలుకు తీసుకెళ్లినట్లు స్థానిక ఆస్పత్రి సూపరింటెండెండ్ కేశవులు తెలిపారు. ఘటనపై వన్‌టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇక రోజూ గుడ్డు
⇒ గర్భిణులు, బాలింతలు, శిశువులకు ⇒ 15 నుంచి అమలు కానున్న ‘వన్ ఫుల్ మీల్’ పథకం ⇒ మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ⇒ క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పని చేయాలి ⇒ ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట సూచన ఇందూరు : మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం ద్వారా ‘వన్ ఫుల్ మీల్’ను ప్రవేశ పెడుతున్నా మని ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. నిర్లక్ష్యం చేయకుం డా క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీడీపీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు లక్షల, కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఐసీడీఎస్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్నారు. మొన్నటి వరకు జిల్లాలోని పది ప్రాజెక్టులలో ఆరింట ‘అమృతహస్తం’ అమలైందని, ఇకపై అన్ని ప్రాజెక్టులలో అమలవుతుందన్నారు. దీనిని పకడ్బందీగా చేపట్టేలా అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గతంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నెలలో 25 రోజులు మాత్రమే గుడ్లు అందజేసేవారని, ప్రస్తుతం పౌష్టికాహార పరిమాణం పెరిగిందన్నా రు. రోజూ గుడ్డుతోపాటు బాలింతలు, గర్భిణులకు 200 మిల్లీలీటర్ల పాలు కూడా ఇస్తామన్నారు. వీటికోసం అంగన్ వాడీ కార్యకర్తల ఖాతాలోకే నేరుగా ముందస్తు నిధులను జమచేస్తామని చెప్పారు. శిశువులు మూడు కిలోల బరువుతో, రక్తహీనత లేకుం డా జన్మించేలా చూడాలని సూచించారు. సూపర్వైజర్లు గ్రామాలను సందర్శించి, కమిటీలను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త కార్యక్రమం అమలు తీరును నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఆర్జేడీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వన్ ఫుల్ మీల్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు. గ్రేడింగ్ విధానంతో పని తీరు పరిశీలన ఇక ముందు అంగన్వాడీల పనితీరును మెరుగు పరచడానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తల పనితీరు మెరుగుపడటమే కాకుండా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందన్నారు. ప్రతీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రంలో ఆరు నుంచి ఏడు గంటల సేపు పిల్లలతో గడపాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. గర్భిణులకు పౌష్టికాహారం సమృద్ధిగా అంది స్తే బిడ్డలు మూడు కిలోల బరువుకు తగ్గకుండా పుడతారన్నారు. ఈ నెల 15 నుంచి అమలయ్యే ‘వన్ ఫుల్ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, స్వరూ పా న్ని హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఇదో ‘గుడ్డు’ పుఠాణి
* పక్కదారి పడుతున్న పౌష్టికాహారం * పిల్లలు, తల్లుల నోళ్లు కొడుతున్న అక్రమార్కులు * నెలకు 16 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా 12తో సరి * కింది నుంచి ఉన్నతస్థాయి వరకూ కుమ్మక్కు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన గుడ్ల పంపిణీలో గూడు పుఠాణి జరుగుతోంది. వారం వారం ఇవ్వాల్సిన గుడ్లలో కోత పెడుతూ, సొమ్ములు బొక్కుతుంటే.. చర్యలు తీసుకోవలసిన స్త్రీ శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకొంటున్నారు. జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల పంపిణీ జరుగుతోంది. జిల్లాలోని 5,143 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిసి 3,19,436 మంది ఉన్నారు. వీరిలో ఆరు నెలల నుంచి మూడేళ్ల్ల లోపు చిన్నారులు 1,46,780 మంది, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 85,935 మంది కాగా గర్భిణులు 86,721 మంది ఉన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 49 లక్షల గుడ్లు సరఫరా చేయాలి. వాటిని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు లబ్ధిదారులకు అందజేస్తుంటారు. గుడ్ల పంపిణీ విషయమై కాకినాడ రూరల్ మండలంలోని స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, తమ్మవరంతో పాటు మురళీధర్నగర్ తదితర ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ‘సాక్షి’ ఆరా తీయగా గుడ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని స్థానికులు చెప్పారు. ఒక్కో కోడిగుడ్డు 50 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి. అయితే కేంద్రాలకు 30 గ్రాముల లోపు ఉండే గుడ్లు కూడా వస్తున్నాయన్నారు. నాలుగు కాదు.. మూడు విడతలే ఒక్కో అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులకు (50 నుంచి 60 మంది ఉంటారని అంచనా) వారానికి 200 నుంచి 240 గుడ్లు పంపిణీ చేయాలి. ఒక లబ్ధిదారుకు వారంలో నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం) నాలుగు గుడ్లు పంపిణీ చేయాలి. ఈ పథకం ప్రారంభమైన మొదట్లో నెలలో 15 రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా చేసేవారు. తర్వాత మారిన విధానం ప్రకారం ఒక అంగన్వాడీ కేంద్రం పరిధిలోని 60 మందికి వారానికి నాలుగు వంతున 240 గుడ్లు, నెల మొత్తంలో 960 గుడ్లు పంపిణీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా కేవలం మూడు విడతలతోనే సరిపెట్టేస్తున్నారు. ఐసీడీఎస్ సిబ్బంది పై నుంచి క్షేత్రస్థాయి వరకు నిర్వాహకులతో మిలాఖతవడంతోనే ఈ బాగోతం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. జిల్లాలోని 5,143 కేంద్రాలలో మూడొంతులు అంటే సుమారు 3,800 కేంద్రాల్లో గుడ్ల సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ కేంద్రాల్లో నెలలో 9 లక్షల పైచిలుకు గుడ్లు దారి మళ్లుతున్నాయి. ఈ అవకతవకలకు తోడు సరఫరా చేసే వారు ఒక వారం రవాణా చార్జీలు కూడా వెనకేసుకుంటున్నారు. గుడ్ల సరఫరా తగ్గింపుపై అంగన్వాడీ కార్యకర్తలకు, స్థానికులకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తమపైన ఉన్న పర్యవేక్షకులకు చెబుతున్నా వచ్చిన వాటితో సరిపెట్టుకోండంటున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లు మూడు వారాలే ఇస్తున్నారు.. నెలకు 16 కోడిగుడ్లు ఇస్తారని అంగన్వాడీ కార్యకర్తల సమావేశాల్లో అధికారులు చెబుతున్నా తమకు మూడు వారాలకు 12 గుడ్లు మాత్రమే ఇస్తున్నారని కాకినాడ రూరల్ మండలం స్వామినగర్‌కు చెందిన కర్రి వెంకటలక్ష్మి వాపోయింది. పిల్లలకు కూడా అలాగే పెడుతున్నారంది. కొన్నిసార్లు ఇచ్చే గుడ్లు అతిచిన్నవిగా ఉంటున్నాయని నిరసించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. గుడ్ల సరఫరాలో అవకతవకలు తమ దృష్టికి కూడా వచ్చాయని, పలు గ్రామాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు చెప్పారు. సక్రమంగా గుడ్లు సరఫరా జరిగేలా చూస్తామన్నారు. -
పౌష్టికాహారం ఎలా?
- అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కాని బియ్యం - పౌరసరఫరాల శాఖ నుంచి అరువు తెచ్చుకున్న అధికారులు - ఈ నెలాఖరు వరకు కోటా రాకుంటే తిప్పలే - ఐసీడీఎస్ కమిషనర్‌కు లేఖ రాసినా ఫలితం శూన్యం ఇందూరు : రేషన్ నిలిచిపోవడంతో నిత్యం ఆహారం తీసుకునే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో పది సీడీపీఓల పరిధిలో మెయిన్, మిని కలిపి 2,711 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పౌష్టికాహారం పేరిట అందించే గుడ్డు, పాలు, ఒక పూట అన్నం కోసం ప్రతి రోజు ఏడు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు వేల సంఖ్యలో వస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రేషన్ బియ్యం, పప్పులు, నూనె తదితర స రుకులను ఒక నెల ముందుగానే కేంద్రాలకు సరఫరా చేస్తుంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కలిపి నెలకు దాదాపు 2,800 క్విటాళ్ల బియ్యం అవరసమవుతా యి. సెప్టెంబర్ నెలలో 1,180 క్వింటాళ్లు మాత్రమే కోటా విడుదల చేశారు. అది కూడా ఐసీడీఎస్ డెరైక్టరేట్ నుంచి రాలేదు. తమ కోటా వచ్చే వరకూ అరువు ఇవ్వాలని కోరితే పౌరసరఫరాల శాఖ వారు సరఫరా చేశారు. ఇదీ ఈ నెలాఖరు వరకు సరిపోతుంది. ఈ నెల 15 వరకే రావాల్సిన వచ్చే నెల కోటా ఇప్పటికీ రాలేదు. రాకపోతే త రువాత సంగతేమిటని ఆలోచిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, రేషన్ కొరత ప్రభావం గర్భిణులు, బాలింతలు, పిల్లలపై పడనుంది. లేఖ రాసినా సెప్టెంబరులో రావలసిన మిగతా కోటా కోసం ఐసీడీఎస్ అధికారులు కమిషనర్‌కు లేఖ రాశారు. అక్టోబర్, నవంబర్ డిసెంబర్ నెలలకు సంబంధించి పూర్తి కోటాను త్వరగా విడుదల చేయాలని కూడా మరో లేఖ ద్వారా కోరారు. కానీ నేటి వరకూ బియ్యం కోటాను జిల్లాకు పంపలేదు. ఆలస్యానికి గల కారణాలేమిటో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. డెరైక్టరేట్ నుంచి కోటా రాలేదు సెప్టెంబర్ నెలకు సంబంధించిన బియ్యం కోటాను సరఫరా చేయాలని ఐసీడీఎస్ డెరైక్టరేట్ అధికారులను కోరాం. సగం కోటాను మాత్రమే విడుదల చేసారు. అది కూడా పౌరసరఫరాల శాఖ ద్వారా అరువు తెచ్చుకున్నాం. డెరైక్టరేట్ నుంచి కోటా వస్తే వారి బియ్యాన్ని తిరిగి వారికిస్తాం. పూర్తి స్థాయిలో రేషన్ విడుదల చేయాలని, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని కమిషనర్‌కు లేఖ రాశాం. - రాములు, ఐసీడీఎస్ పీడీ