శామీర్‌పేట్: ‘నాకు ఏమీ రావు.. ఏంటో నా జీవితం.. పిచ్చిలేస్తుంది.. అసలు లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా.. నాకు చనిపోవాలనిపిస్తుంది’ అంటూ స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగ వెంకటరమణ–లక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం తుర్కపల్లికి వలస వచ్చి ఉమాశంకర్ రైస్‌మిల్‌లో కారి్మకులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురు తేజస్విని సాయిదుర్గాలక్ష్మి (16) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 3న తలనొప్పిగా ఉందని తేజస్విని స్కూల్‌కు వెళ్లలేదు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసి నిద్రించారు.
శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తల్లి లక్ష్మి బాత్ రూంకు వెళ్లగా తేజస్విని బాత్‌రూంలో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ గుర్తించారు. కాగా తేజస్విని అతిగా నిద్రించేదని, తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment